E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today march 3rd: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప చేయబోతున్న త్యాగం గురించి తెలుసుకున్న పారిజాతం 

Karthika Deepam 2 Serial Today march 3rd: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప చేయబోతున్న త్యాగం గురించి తెలుసుకున్న పారిజాతం 
Advertisement

Karthika Deepam 2  serial today Episode:    

దీప చేస్తున్న త్యాగానికి దశరథ ఎమోషనల్‌ అవుతాడు. కార్తీక్‌ ఎంత కన్వీన్స్‌ చేయాలని చూసినా దశరథ కన్వీన్స్‌ కాడు.. తనకు కూతురుతో పాటు మనవరాలు రాబోతుందని సంతోషించానని కానీ దీప చేస్తున్న త్యాగం వల్ల ఏం చేయాలో అర్థం కావడం లేదని బాధపడతాడు. కూతురు దీప విషయంలో చేసిన తప్పు మనవరాలి విషయంలో సరిదిద్దుకోవాలనుకున్నట్టు చెప్తాడు. దీప తొలి అడుగులు చూడలేదు. తొలి పిలుపును వినలేదు. ఈ ఆశలన్నీ ఇప్పుడు దీపకు  పుట్టబోయే బిడ్డతో తీర్చుకోవాలని ఆశపడ్డానని అంటాడు. దీప కడుపున అమ్మ పుట్టబోతుందని నా చెల్లి ఆనందపడుతుంది. ఎంతమంది ఆశలను, కలలను చంపేయాలి. ఎవరిని వదులుకోవాలి? మీ అత్త ప్రాణం నిలబెట్టే దేవత ఈ దేవతే అని నాకు అప్పుడు తెలియదు. కడుపున పుట్టిన దేవత. నేను తండ్రిగా ఏం ఇచ్చానని నీ నుంచి తీసుకోవడానికి అంటూ దశరథ ఏడుస్తుంటాడు.

దీంతో దీప జన్మనిచ్చావు కదా నాన్న. తల్లిదండ్రుల రుణం తీర్చుకునే అవకాశం ఎంతమందికి వస్తుంది? ఆ అవకాశం నా బిడ్డకు నాకు  వచ్చింది. నా బిడ్డే నా కన్నతల్లిని కాపాడుతుందంటే అంతకుమించి ఆనందం ఏముంది? నా బిడ్డ నా తల్లి ప్రాణంలోకి వెళ్తుంది. సరే అనండి నాన్న, అమ్మను వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేద్దాం అంటూ దశరథను కన్వీన్స్‌ చేయాలని చూస్తుంది దీప. దీంతో దశరథ ఎమోషనల్‌ అవుతూ.. అటు భార్యకు, ఇటు కూతురికి ధైర్యంగా మాట ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాను అంటూ బాధపడుతుంటాడు.

Advertisement

అయితే ఈ సమస్యకు ఇంతకు మించి పరిష్కారం లేదని కార్తీక్‌ చెప్తుంటే.. ఏంటా సమస్యా, ఏంటా పరిష్కారం అంటూ జ్యోత్స్న, శివనారాయణ, పారిజాతం వస్తారు. వాళ్లను చూసిన కార్తీక్‌, దీప, దశరథ షాక్‌ అవుతారు. ఇంతలో తేరుకున్న కార్తీక్‌ సమస్య పెద్ద మేడమే. అత్తకు ఆపరేషన్ అన్న ప్రతిసారి తమరు లగేజీ సర్దుకుని రెడీగా ఉంటున్నారు కదా. చిన్నసారు ఏమో అత్తను హాస్పిటల్లో జాయిన్ చేద్దామంటున్నారు. నువ్వు ఇల్లు వదిలి వెళ్లిపోతే సమస్య అవుతుంది. అందుకే ఇంటికి కాపాలగా ఉంటాననే పరిష్కారం చెప్పానని జ్యోత్స్నకు కార్తీక్ చెప్పగానే.. మా మమ్మీని సేవ్ చేయడం నా బాధ్యత. నాకు ఎవరూ కాపలాగా ఉండాల్సిన అవసరం లేదంటుంది జ్యోత్స్న.

మరోవైపు డైవర్స్ పేపర్‌ మీద సంతకం చేసిన కాశీపై దాసు కోప్పడతాడు. నువ్వు మనిషివే కదా, కడుపుకు అన్నమే తింటున్నావు కదా అని కోప్పడతాడు. దీంతో కాశీ కూడా బాధగా  స్వప్న విడాకులు తప్పా మరో మాట మాట్లాడటం లేదు.  అందుకే సంతకం చేశానని చెప్తాడు. దీంతో మరింత కోపంగా పెళ్లిలో చదివిన వేదమంత్రాలు కూడా పెట్టిన సంతకాల ముందు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. ఇలా విడిపోవడానికేనా అందరిని ఎదురించి పెళ్లి చేసుకుంది. అంటూ తిడుతుంటాడు. దీంతో కాశీ మాత్రం డైవర్స్‌ పేపర్స్‌ మీద సంతకం చేసినా స్వప్నను వదులుకోను మళ్లీ స్వప్నను ప్రేమిస్తా.. తనను మళ్లీ పెళ్లి చేసుకుంటానంటూ కాశీ చెప్పగానే.. దాసు హ్యాపీగా ఫీలవుతాడు.

Advertisement

తర్వాత కార్తీక్‌ నెల రోజుల పాటు తాము పనికి రావడం లేదని శివనారాయణకు చెప్తాడు. ఎందుకని జ్యోత్స్స అడిగితే దీపను డాక్టర్లు నెల రోజులు రెస్ట్‌ తీసుకోమన్నారు.. అని చెప్పగానే.. దీపను రెస్ట్ తీసుకోమంటే నువ్వెందుకు రావు అంటూ జ్యో అడగ్గానే.. దీపకు సేవలు చేయాలని కార్తీక్‌ చెప్తాడు. అయితే దీపకు సేవలు చేయడానికి ఏర్పాట్లు చేస్తానని జ్యో చెప్పగానే.. కార్తీక్‌ ఉండనని చెప్పగానే.. శివనారాయణ కూడా కార్తీక్‌, దీపలకు పర్మిషన్‌ ఇస్తాడు. నెల రోజులు పనికి రావాల్సిన అవసరం లేదని చెప్తాడు. దీంతో జ్యో షాక్‌ అవుతుంది.  తర్వాత కార్తీక్, దశరథ మాట్లాడుకోవడం పారిజాతం వింటుంది. ఇంతటితో నేటి కార్తీకదీపం 2 సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×