E-Paper
Advertisement

కార్తీక దీపం 2’ మార్చి 30: నిజం తెలుసుకున్న పారిజాతం

కార్తీక దీపం 2’ మార్చి 30: నిజం తెలుసుకున్న పారిజాతం
Advertisement

Karthika Deepam 2  serial today Episode: దశరథ వీలునామాలో క్లాజ్‌ పెట్టిన విషయం గురించి కాంచన తిడుతుంటే.. కార్తీక్‌ అడ్డుపడతాడు. మావయ్య ఈ క్లాజ్ పెట్టకుండా ఉంటే ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఇంట్లో ఖాళీగా ఉంటూ ఆ పారుతో కలిసి ఎవరో ఒకరిని ఇబ్బంది పెడుతుందని అంటాడు. దీంతో కాంచన కోపంగా ఆస్తులు అనగానే ఆకాశం అంతా సంబరపడిపోయే జ్యోత్స్న వాళ్లింట్లో పాతచీర కూడా నాకు దక్కకూడదని అనుకుంటుందని.. అసలు ఇవన్నీ చూస్తుంటే జ్యోత్స్న అసలు మా అన్నయ్య కూతురేనా అనిపిస్తుంది. దాని బుద్ధులన్నీ పారిజాతం పిన్నిలాగే ఉంటాయి. మొన్న హాస్పిటల్‌లో బిడ్డల్ని మార్చేసినట్లు ఓ వార్త చూశాను.. జ్యోత్స్న కూడా అలాగే మారిపోయిందేమో అని కాంచన అనడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు.

మరోవైపు  జ్యోత్స్న ఎదురుచూస్తున్న రిపోర్ట్స్ రావడంతో పాటు సుమిత్ర బ్లడ్ శాంపిల్స్తో  దీప బ్లడ్‌ మ్యాచ్‌ అయ్యామని తెలియడంతో జ్యో షాక్‌ అవుతుంది. అప్పుడే పారిజాతం వచ్చి ఈ రిపోర్ట్స్ ఏంటీ? వచ్చింది ఎవరు? అని అడుగుతుండగానే.. పారిజాతానికి దాస్‌ ఫోన్‌ చేస్తాడు. పారిజాతం వెళ్లిపోతుంది. జ్యో మాత్రం దీపే సుమిత్ర కూతురా..? నేను అనుకున్నదే నిజమని తేలిందా..? డాక్టర్‌ను మేనేజ్ చేసి అబద్ధం చెప్పించారా..?  ఈ నిజం డాడీకి తెలుసా? తెలిసే వీలునామా మార్చి రాయించాడా? అది కూడా తెలిస్తే వీళ్లందరినీ ఏం చేయాలో నాకొక క్లారిటీ వస్తుందని అనుకుంటుంది. దాస్ దగ్గరికి వెళ్లిన పారిజాతం… ఆ రోజు నన్ను మీరంతా మతిలేని దానిని చేశారు. ఎవరు నా మనవరాలు? ఎవరు నీ కూతురు అని నిలదీస్తుంది. కార్తీక్ గాడే పెద్ద మాయలోడు అనుకున్నాను..

Advertisement

నువ్వు అంతకంటే పెద్ద మాయలోడివి అంటుంది. దీంతో దాస్‌, పారిజాతానికి నిజం చెప్తాడు. నీ మనవరాలు ఎవరో కాదు దీప అని చెప్పడంతో పారిజాతం షాక్ అవుతుంది. కుబేర్ ఫోటో చూసి అనసూయ గారిని అడిగితే మొత్తం వివరాలు  చెప్పేసిందని అంటాడు దాస్. దీపకి నాకు ఓ పోలిక ఉంది.. నేను కూడా ఆ ఇంట్లో పనిమనిషినే కాబట్టి నాకు కరెక్ట్‌గా సెట్ అయ్యిందని ఎమోషనల్ అవుతుంది పారిజాతం. దీపే తన మనవరాలు అని తెలియక ఇన్నాళ్లు తను తిట్టిన మాటలు గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంది పారిజాతం. వెంటనే దీపను చూడాలని వెళ్లబోతుంటే దాస్‌ ఆపేస్తాడు. అప్పుడు బిడ్డల్ని ఎందుకు మార్చావని శివనారాయణకు తెలిస్తే నిన్ను కాల్చేస్తాడని.. కార్తీక్‌కు తెలిసినా నిన్ను ఇరికించేస్తాడని బెదిరించడంతో పారిజాతం ఆలోచనలో పడిపోతుంది. అన్ని తెలిసినా ఏమీ తెలియనట్టు ఉండాలని సూచిస్తాడు దాస్‌. అయితే సరే కానీ నేను వెంటనే నా మనవరాలిని చూడాలి అంటూ వెళ్లిపోతుంది పారిజాతం.

మరోవైపు జ్యోత్స్న డైనింగ్‌ టేబుల్ దగ్గర కూర్చుని తాను సుమిత్ర కూతురు కాదన్న విషయం ఎంత మందికి తెలుసి ఉంటుంది. దీప, దాస్‌, బావ ఒక్కటే కాంచన అత్తకు కూడా నిజం చెప్పేశారా..?  అని ఆలోచిస్తుంటే.. దశరథ చూసి సుమిత్ర ఏం జరిగిందని అడుగుతాడు. జ్యోత్స్న భోజనం చేయకుండా అలాగే కూర్చుని ఆలోచిస్తుంటుంది. సుమిత్ర కోపంగా మధ్యాహ్నం జరిగిన విషయమే నువ్వు ఆలోచిస్తున్నావా..? అయితే త్వరలో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం, అత్తారింటికి వెళ్లిపో అని చెప్తుంది సుమిత్ర. దీంతో జ్యోత్స్న ఇరిటేటింగ్‌ గా పెళ్లి అనేది ఏదో రకంగా కంప్లీట్ చేసేది కాదు కొంత టైం పడుతుంది.. అనగానే..  నువ్వు సరిగ్గా ఉంటే మాకు వీలునామా రాసే పరిస్ధితి వచ్చేది కాదు..  నీ వల్ల నేను  నా ఆడపడుచు ముఖం చూడకుండా అయిపోయింది అంటూ మండిపడుతుంది. జ్యో మాత్రం కోపంగా ఆస్థులు తీసుకోవడానికి రెడీ అయ్యారు కానీ మాటలు పడరా అంటుంది. దీంతో దశరథ కోపంగా నీ వల్ల మేం అందరం విడిపోయే పరిస్థితి వచ్చిందని కోప్పడతాడు.

Advertisement

మరోవైపు దీప కోసం ఇంటికి వెళ్లిన పారిజాతం దీప కనబడగానే గట్టిగా హగ్‌ చేసుకుని ఎమోషనల్ అవుతుంది. మనవరాలా అంటూ ప్రేమగా పిలుస్తుంది. అది చూసిన కార్తీక్‌, కాంచన, అనసూయ షాక్‌ అవుతారు. ఇంతటితో నేటి కార్తీకదీపం 2 సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×