E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today march 2nd: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఆపరేషన్ కు ఒప్పుకోని దశరథ  

Karthika Deepam 2 Serial Today march 2nd: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఆపరేషన్ కు ఒప్పుకోని దశరథ  
Advertisement

Karthika Deepam 2  serial today Episode: 

సుమిత్ర కోసం తమ బిడ్డను త్యాగం చేస్తున్నారని దశరథ తెలుసుకుని షాక్‌ అవుతాడు. తర్వాత కార్తీక్‌ ను కోపంగా నా కూతురి కడుపులోని బిడ్డను చంపమని డాక్టర్‌కి చెప్పడానికి అసలు నువ్వు ఎవరు? కడుపులోని బిడ్డను చంపాలనుకున్న నువ్వు.. పుట్టిన బిడ్డన చంపాలనుకున్న పారిజాతం పిన్నికి తేడా ఏంటీ? నా దృష్టిలో ఇద్దరూ ఒక్కటే అంటూ ఎమోషనల్‌ అవుతుంటాడు. బిడ్డలకు ఏదైనా జరిగితే వాళ్ల కోసం జీవితాల్ని పణంగా పెట్టి వారిని కాపాడుకునే తల్లిదండ్రులను చూశాను కానీ మీలాంటి వాళ్లను నేను ఎక్కడా చూడలేదు అనడంతో కార్తీక్‌ కూడా కోపంగా అత్త ప్రాణాలు కాపాడటానికి వేరే దారే ఉంటే నా బిడ్డను ఎందుకు వదులుకుంటాను.. చెప్పండి మామయ్య.. అత్తయ్యను కాపాడుకోవడానికి నీ దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటీ? అంటూ కార్తీక్‌ అడగడంతో

దశరథ మౌనంగా ఉండిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన దీప ఏమైందని అడుగుతుంది. జరిగిన విషయం చెప్తాడు కార్తీక్‌. నేనే నిన్ను బలవంతంగా బిడ్డను వదులుకోమని చెప్పినట్టు మీ నాన్న ఫీలవుతున్నారు.. భార్య ప్రెగ్నెంట్ అని తెలిస్తే భర్త కళ్లలో నీళ్లు తిరుగుతాయి. తనలో ఉన్న ప్రాణం భార్య గర్భంలో ఊపిరి పోసుకుంటుంది. పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. నెలల నిండిన భార్య కడుపులో నుంచి బిడ్డ పాదముద్రలు స్పష్టంగా కనిపిస్తుంటే అది ఎప్పుడు భూమీ మీద అడుగుపెట్టి ఈ నాన్న చేతితో నడక నేర్చుకుంటుందోనని ఎదురుచూశా. ఇలాంటి అనుభూతిని పొందాలని నేను కూడా కోరుకుంటున్నానని చెప్తాడు కార్తీక్‌. అయితే దశరథ మాత్రం నేను నా భార్య కడుపులోని బిడ్డను వద్దు అనుకుంటే దీప పుట్టేదే కాదు. ఇప్పుడు నా కూతురి కడుపులో మరో దీప పెరుగుతోంది. దానిని ఈ లోకం నుంచి దూరం చేయోద్దు.. అంటూ ఎమోషనల్‌ అవుతాడు దశరథ.

Advertisement

దీంతో కార్తీక్‌ కోపంగా అయితే అత్త చనిపోయినా పర్వాలేదా? అనగానే.. దశరథ షాక్‌ అవుతాడు. నా భార్య ప్రాణాల మీదకి వస్తే నా జీవితాన్నే తాకట్టు పెట్టి నా భార్యను నేను బతికించుకున్నాను.. అలాంటి బాధ్యత నీకు లేదా? నిన్నే నమ్ముకుని బతుకుతున్న నీ భార్యను అలాగే వదిలేస్తావా..?   ఈ బిడ్డ పోతుందని తెలిసి నేను, దీప ఎంతో బాధపడుతున్నాం. కానీ తనకు ప్రాణం పోసిన కన్నతల్లి కోసం బిడ్డను వదులుకుంటుంది. అలాంటి త్యాగం చేస్తున్న నీ కూతురి కాళ్లను మనం మొక్కాలని అంటాడు కార్తీక్. దీంతో  దశరథ గట్టిగా ఏడుస్తూ.. సుమిత్ర లేకుండా తాను ఉండలేనని చెప్తాడు. అయితే మేము బిడ్డను వదులుకోవడానికి మీరు ఒప్పుకోండి అని కార్తీక్‌ అడగ్గానే.. లేదు మనం ఇద్దరినీ కాపాడుకోవడానికి ప్రయత్నిద్దామని దశరథ చెప్తాడు. అయితే ఇంటికి వెళ్లి అత్తయ్యను చూడు అప్పుడు నీకు ఎలా అనిపిస్తే అలా చేద్దాం అంటాడు కార్తీక్‌. సరే అంటూ దశరథ ఇంటికి వెళ్లిపోతాడు. కార్తీక్‌ డాక్టర్‌ దగ్గరకు వెళ్లి ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేసుకోమని చెప్తాడు. దీప వెళ్లి ఆపరేషన్‌కు నాన్న ఒప్పుకోలేదు కదా అని చెప్పగానే.. డాక్టర్‌ షాక్‌ అవుతుంది.

మరోవైపు దశరథ ఇంటికి వెళ్లగానే.. సుమిత్ర దగ్గుతూ బాధపడతుంది. తాను బతుకుతానా లేదా..? అంటూ ఎమోషనల్‌ అవుతుంది. సుమిత్ర పరిస్థితి చూసి శివనారాయణ వెంటనే ఆపరేషన్‌ చేయించాలని చెప్తాడు. అప్పుడే అక్కడకు వచ్చిన దీప, కార్తీక్‌లను చూసి దశరథ ఎమోషనల్‌ అవుతాడు.  ఇంతటితో నేటి కార్తీకదీపం 2 సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×