E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today march 28th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  జ్యోత్స్నను పెళ్లి చేసుకోమన్న పారు 

Karthika Deepam 2 Serial Today march 28th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  జ్యోత్స్నను పెళ్లి చేసుకోమన్న పారు 
Advertisement

Karthika Deepam 2  serial today Episode: జ్యోత్స్నను ఓదార్చడానికి వచ్చిన దీపతో జ్యో కోపంగా మాట్లాడుతుంది. ఎప్పుడూ తాను గెలవాలని ఆడతానని  కానీ అది తనకు సొంతం అయ్యేలోపు..  దీప దానిని గెలుచుకుని వెళ్లిపోతుందని.. . ఆట ఎలా ఆడాలో తెలిసిన దీప లాంటి దాని ముందు తెలివైన తనలాంటిది ఓడిపోతూనే ఉందని బాధపడుతుంది జ్యోత్స్న. దీంతో దీప కూల్‌గా నువ్వు ఆట నువ్వే గెలవాలని ఆడతావు.. కానీ నేను నా వాళ్లు గెలవాలని ఆడతాను అంటూ దీప. చెప్పగానే.. జ్యోత్స్న కోపంగా చూడు దీప నీకు భయం అనేది చూపిస్తా..? అంటూ దీపను బెదిరిస్తుంది. దీంతో దీప ఏంటి జ్యోత్స్న నువ్వు ఇక మారవా..? అసలే అమ్మా నాన్న నీ పెళ్లి విషయంలో చాఆ బాధగా  ఉన్నారు.. వాళ్లు ఎన్నో కలలు కంటున్నారు.. వాళ్లను బాధపెట్టకుండా.. నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు మనశ్శాంతి దొరుకుతుంది అని చెప్పి వెళ్లిపోతుంది దీప.

ఇక దశరథ రాసిన వీలునామా గురించి ఆలోచినస్తూ.. దశరథ అన్న మాటలు గుర్తు చేసుకుని ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంది జ్యోత్స్న అప్పుడే జ్యూస్‌ తీసుకుని రూంలోకి వచ్చిన పారిజాతం మాత్రం ఈ వీలునామా డ్రామా మొత్తం మీ అమ్మా నాన్న కలిసి వేసిన స్కెచ్ అని అర్థం అవుతుంది.. నువ్వు వీలైనంత త్వరగా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే ఈ ఆస్తి మొత్తం నీది అవుతుంది అని చెప్పగానే.. జ్యో ఇరిటేటింగ్‌ గా అసలు 15 నెలల గడువులోనే నేను పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలా..? అసలు నేను మనిషినా..? మిషన్‌ నా..? అంటూ కోప్పడుతుంటే..

Advertisement

పారిజాతం మాత్రం.. అయినా సడెన్‌గా అగ్రిమెంట్ టాపిక్ ఎందుకు తీసుకొచ్చావు? కార్తీక్‌, దీపలను ఇంట్లోంచి గెంటేద్దామని ప్లాన్‌ చేశావా..? అని అడుగుతుంది. కాదు వీలునామాని మార్చి రాయించడానికి అలా ప్లాన్‌ చేశాను కానీ వర్కవుట్‌ కాలేదు అంటూ జ్యోత్స్న చెప్పగానే.. పారిజాతం మాత్రం అయినా నువ్వు సుమిత్ర కూతురివి ఇంత రాదాంతం  ఎందుకు చెప్పు అనగానే.. జ్యో మాత్రం కొన్ని అనుమానాలు తీరాలంటే సాక్ష్యాలు, రుజువులు కావాలి.. అని చెప్పగానే.. పారిజాతం మాత్రం నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే జీవితం బాగుపడుతుంది, ఆస్తి కూడా నీకే దక్కుతుందని చెప్పి వెళ్లిపోతుంది పారిజాతం.

మరోవైపు వీలునామా విషయం గురించి దశరథతో కోపంగా మాట్లాడతారు దీప, కార్తీక్‌. తమకు ముందు చెబితే ఏదో ఒకటి చేసేవాళ్లం కదా ఇప్పుడు చూడండి పెంట పెంట అయింది అసలు మాకెవ్వరికీ మైండ్‌ పని చేయడం లేదు అంటారు. దీంతో దశరథ ఎమోషనల్‌ అవుతూ.. ఒక భర్తగా, ఒక తండ్రిగా నేను నలిగిపోయాను. నా భార్య, నా కూతురి కడుపులోని బిడ్డ కూడా బతికారు. సుమిత్ర గురించి జ్యోత్స్నను పెళ్లికి ఒప్పించాలని అనుకున్నాను అందుకే వీలునామా అలా రాయించాను అంటాడు.

Advertisement

అయితే దీప మాత్రం ఆస్థి మొత్తం జ్యోత్స్నకే ఇచ్చేయండని తాను మాత్రం ఆస్తుల కోసం మనుషుల్ని వదులుకోలేనని దీప చెప్పగానే..  ఇది అర్థం కాకే జ్యోత్స్న తప్పుల మీద తప్పులు చేస్తుంది.. ఆస్థి కోసం రేపు నాకే హానీ తలపెట్టొచ్చు కదా అంటూ దశరథ చెప్పగానే.. దీప, కార్తీక్‌ షాక్ అవుతారు. అవును మనం ఆడుతున్న డ్రామాలన్నీ జ్యోత్స్నకి తెలిసిన రోజున మనల్ని వదిలిపెట్టదు.. పిన్ని లాంటి వాళ్లు నిన్ను అనాథవి అనాథవి అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నానంటూ బాధపడతాడు దశరథ. ఇంతటితో నేటి కార్తీకదీపం 2 సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×