E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today march 27th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: వీలునామా విషయంలో జ్యోత్స్నకు షాక్ ఇచ్చిన సుమిత్ర 

Karthika Deepam 2 Serial Today march 27th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: వీలునామా విషయంలో జ్యోత్స్నకు షాక్ ఇచ్చిన సుమిత్ర 
Advertisement

Karthika Deepam 2  serial today Episode: వీలునామా రాసిన లాయరు వెళ్లిపోతుంటే జ్యోత్స్న ఆపేస్తుంది. మీరు ఇక్కడే ఉండాలి. వీలునామాలో ఉన్న తప్పుల్ని సరి చేయాలిన అని చెప్పగానే.. అందులో ఉన్న ఒక్క అక్షరం కూడా మార్చడానికి వీల్లేదని దశరథ చెప్తాడు. నువ్వు నా కూతురివి కాదని చెప్పు ఇప్పుడే మొత్తం మార్చేస్తాను.. అంటూ దశరథ చెప్పగానే.. జ్యోత్స్న కోప్పడుతుంది. మేనల్లుడి కుటుంబానికి ఆస్తి చెందాలని ఎలా రాస్తావని? మండిపడుతుంది. రాస్తే మాత్రం వాళ్లు ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తుంది. ఇంతలో పారిజాతం కలగజేసుకుని తేరగా ఆస్తి కలుస్తుంటే వాళ్లెందుకు వద్దంటారు.. అంటూ తిడుతుంది. దీంతో శ్రీధర్‌ కోపంగా పారిజాతాన్ని తిడతాడు. నా భార్య కానీ, నా కొడుకు కానీ మీ ఆస్తుల మీద ఆశపడే మనుషులైతే ఈ పంచాయతీ ఏనాడో కోర్టులో జరిగేది.. పేపర్స్‌ తీసుకెళ్లి మరి బతిమలాడాను.. ఒక్క సంతకం పెడితే మా తాత మీద కేసు వేస్తానని కానీ కార్తీక్‌, కాంచన అసలు ఒప్పుకోలేదు.. కనీసం దీప కూడా ఒప్పుకోలేదు.. అని చెప్పగానే..

అయితే నువ్వు అన్నది నిజమే అయితే మా నాన్న ఎందుకు ఇలా వీలునామా రాశారు. అత్త మా నాన్ను ఈ వీలునామా ఎందుకు రాశావని నిలదీయాలి కదా అంటుంది. దీంతో యావదాస్తి కొడుక్కి వస్తుందంటే ఎవరైనా ఊరుకుంటారా..? అంటూ పారిజాతం తిడుతుంది. ఇంతలో శివన్నారాయణ కోపంగా  నేను రాసిన వీలునామాను నువ్వు మార్చి రాశావంటే నీకు నా మీద ఎలాంటి గౌరవం ఉందో అర్ధమవుతుందని కోప్పడుతుంటే.. తాను వీలునామా మార్చడానికి ఒక కారణం ఉందని చెప్తాడు దశరథ. దశరథ మాటలకు జ్యోత్స్న కోపంగా ఇదంతా డాడీ మాట్లాడటం లేదని.. వెనక నుంచి కార్తీక్‌ మాట్లాడిస్తున్నాడని కోప్పడుతుంది. పారిజాతం కూడా తప్పు వాడిది కాదు నీది.  అగ్రిమెంట్ పేపర్‌తో ఇంట్లోకి రానిచ్చావు.. ఇప్పుడు ఆస్తి మొత్తానికి ఎసరు పెట్టాడని తిడుతుంటుంది. అయితే ఇప్పుడే అగ్రిమెంట్‌ క్యాన్సిల్‌ చేస్తున్నానని జ్యోత్స్న చెప్పగానే.. అగ్రిమెంట్ అనేది నీకు నాకు మధ్య జరిగింది.. వీలునామా అనేది నీకు మావయ్యకి మధ్య జరిగింది. ఇందులోకి తనను లాగొద్దంటాడు కార్తీక్‌.

Advertisement

వీలునామాలో ఆ క్లాజు తీసేయమని దశరథకు కార్తీక్ చెప్పగానే దశరథ నువ్వు ఎవడివి నాకు చెప్పడానికి అనడంతో అందరూ షాక్‌ అవుతారు. దశరథ మాటలకు జ్యోత్స్న సెంటిమెంట్‌తో బదులిస్తుంది. ఇప్పుడు మా  మమ్మీ ఇక్కడ ఉండుంటే నా కోసం నిలబడేదని ఎమోషనల్‌ అవుతుంది జ్యోత్స్న. అప్పుడే సుమిత్ర వచ్చి వీలునామా మార్చడం గురించి తనకు తెలుసని.. దశరథ తనకు చెప్పే చేశారని అంటుంది. దీంతో జ్యోత్స్న కోపంగా అంటే నీ కూతురి కంటే నీకు ఆడపడుచు కొడుకే ఎక్కువైపోయాడా అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో సుమిత్ర నీకు పుట్టబోయే పిల్లలకు అంటే నీకు ఆస్తిని రాసినట్లే కదా.?  పెళ్లి చేసుకోమంటే ఇప్పట్లో చేసుకోను అన్నావు.. నీ మీద మాకు కొన్ని కలలు ఉండవా? నా కూతురు పెళ్లి చేసుకుంటుంది, పిల్లల్ని కంటుంది.. నా కూతురి పిల్లలకు ఈ ఆస్తి దక్కుతుందని సుమిత్ర చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. పారిజాతం దీప, కార్తీక్‌లను ఘోరంగా తిడుతుంది. అది వినలేక కాంచన, శ్రీధర్‌ ఇంటికి వెళ్దాం పద అని కార్తీక్‌, దీపలను అడుగుతారు. దీంతో కార్తీక్‌ తాము తర్వాత వస్తామని చెప్తారు. కాంచన శ్రీధర్‌ వెళ్లిపోతారు.

మరోవైపు స్వప్న కోసం పెళ్లికొడుకుని తీసుకుని వస్తాడు దాస్. అయితే పెళ్లి ఇష్టం లేదని చెప్పమని కాశీ, స్వప్నకు చెబితే తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని చెప్తుంది. దీంతో కాశీ, కావేరీలు షాక్‌ అవుతారు. మరోవైపు వీలునామా గురించి ఆలోచిస్తున్న జ్యోత్న్స దగ్గరకు దీప వెళ్లి అమ్మానాన్నలను బాధపెట్టోదని చెప్తుంది. దీంతో జ్యోత్స్న కోపంగా దీపను తిడుతుంది. మా విషయాల్లో అనవసరంగా కలగజేసుకుంటున్నావు అంటూ మండిపడుతుంది. ఇంతటితో నేటి కార్తీకదీపం 2 సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×