E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today march 25th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నకు వార్నింగ్ ఇచ్చిన కార్తీక్   

Karthika Deepam 2 Serial Today march 25th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నకు వార్నింగ్ ఇచ్చిన కార్తీక్   
Advertisement

Karthika Deepam 2  serial today Episode: గాఢ నిద్రలో ఉన్న దీపకు వాళ్ల అమ్మానాన్నలను జ్యోత్స్న చంపేసినట్టు కల వస్తుంది. వెంటనే ఉలిక్కిపడి నిద్ర లేస్తుంది దీప. దశరథ ఇంటిక వెళ్దామని కార్తీక్‌ను నిద్రలేపి మరీ చెప్తుంది. తనకు వచ్చిన కల గురించి చెప్తూ బాధపడుతుంది. అయితే ఈ టైంలో వెళ్లడం ఏంటి ఉదయమే వెళ్దాం.. జ్యోత్స్న సొంత కూతురు కాదు కాబట్టి నీకు అలా కల వచ్చింది. అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో జ్యోత్న్స అంత సాహసం చేయదని.. ఒకవేళ అందరినీ నిజం తెలిస్తేనే చేసే చాన్స్‌ ఉందని కానీ ఆ నిజం మనం చెప్తేనే కదా జ్యోత్న్సకు తెలిసేది అని చెప్తాడు కార్తీక్‌.

తర్వాత దశరథ వెల్లి సుమిత్రకు  టిఫిన్‌ తినిపిస్తుంటాడు. సుమిత్ర ఎమోషనల్‌ అవుతూ.. మీరొచ్చి చెప్పే వరకు నాకు టిఫిన్ గురించి కూడా గుర్తులేదు. జ్యోత్స్నకి మంచి సంబంధం కుదిరి మన గార్డెన్‌లోనే పెద్ద పందిరి వేసి పెళ్లి చేయాలని తన కల అని చెప్తుంది. దీంతో జ్యోత్స్నకు పెళ్లి చేయకపోతే మతి పొగొట్టుకునేలా ఉన్నావని దశరథ అనగానే.. జ్యోత్స్నను ఇంట్లోనే ఉంచుకుందామని ఇల్లరికం అల్లుడిని తెచ్చుకుందామని అంటుంది సుమిత్ర. దీంతో దశరథ షాక్‌ అవుతాడు. నీ ప్రవర్థనలో ఏదో తేడా ఉంది అందుకే డాక్టర్‌ను ఇంటికి రమ్మన్నాను అంటాడు దశరథ.

Advertisement

అప్పుడే అక్కడికి వచ్చిన జ్యో లోపలికి రావోచ్చా అని అడుగుతుంది. సుమిత్ర ఆశ్చర్యంగా చూసే సరికి ఈ మధ్యన నేను నీ దగ్గరకు వస్తుంటే నాన్నకు నచ్చడం లేదు అందుకే అడిగి లోపలికి వస్తున్నాను అని జ్యో చెప్పగానే..సుమిత్ర, దశరథ షాక్‌ అవుతారు. జ్యో మాత్రం పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది. తాను స్కూల్‌ నుంచి కానీ కాలేజీ నుంచి కానీ ఇంటికి రాగానే దశరథ, సుమిత్ర ఎంత ప్రేమగా చూసుకునేవారో అంటూ ఎమోషనల్‌ అవుతుంది. దీంతో సుమిత్ర కూడా  మీ నాన్న ప్రేమ ఎప్పుడూ మనసులోనే ఉంటుంది. కానీ నీకే మా మీద ప్రేమ తగ్గిపోయింది. అందుకే నువ్వు పెళ్లి చేసుకోవాలి అంటూ సుమిత్ర చెప్పగానే.. అప్పుడే తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్తుంది జ్యో..

మరోవైపు పారిజాతం కాఫీ తీసుకొచ్చి శివనారాయణకు ఇస్తూ సిగ్గు పడుతుంది. ఇంతలో అక్కడికి శ్రీధర్‌, కాంచన, కార్తీక్‌, దీపలు వస్తారు. రాగానే దీప సుమిత్ర ఆరోగ్యం గురించి అడగ్గానే జ్యోత్స్న ఉక్రోషంగా చూస్తుంటుంది. బిడ్డ విషయంలో నిర్ణయం వెనక్కి తీసుకున్నందుకు కంగ్రాట్స్‌ అంటూ కింద పడ్డావని విన్నాను అప్పుడే ఎందుకు వచ్చావు ఇంటికి అంటూ జ్యో అడగ్గానే.. అప్పుడే డాక్టర్‌ హారిక వస్తుంది. డాక్టర్‌ను చూసి అందరూ షాక్‌ అవుతారు. సుమిత్ర మాత్రం డాక్టర్‌ను చూస్తూ.. ఎమోషనల్‌ అవుతుంది. నేను బ్రతకుతానని అనుకోలేదు.. మీరే నన్ను కాపాడారు అంటూ అప్యాయంగా మాట్లాడుతుంది. డాక్టర్‌ను ఎందుకొచ్చారని అడగ్గానే.. దశరథ తానే రమ్మన్నానని సుమిత్ర తేడాగా కనిపిస్తుందని చెప్తాడు.

Advertisement

అయితే  సుమిత్రగారు చచ్చిపోతానేమో అనే స్టేజ్‌లోకి వెళ్లిపోయారు.. ఆవిడకు జ్యోత్స్న అంటే చాలా ఇష్టం. తన కూతురి పెళ్లి చూడకుండా చచ్చిపోతానేమోనన్న భయం తన మనసులో బలంగా నాటుకుపోయింది. సడెన్‌గా తను ప్రాణాలతో బయటపడేసరికి నమ్మలేకపోతున్నారు. తన మెంటల్ కండీషన్ ఏమాత్రం బాలేదు.. ఆవిడ తట్టుకోలేని విషయాలేవీ చెప్పొద్దు, జ్యోత్స్నకి సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించి సుమిత్రను పరీక్షించి వెళ్లిపోతుంది  డాక్టర్. డాక్టర్‌ వెళ్లిపోగానే.. జ్యోత్స్నతో  పర్సనల్‌గా శౌర్య కిడ్నాప్‌ గురించి మాట్లాడతాడు కార్తీక్‌. ఆ రౌడీలలో ఒక్కడు దొరికినా నీ కథ వేరేలా ఉండేదని హెచ్చరిస్తాడు.  అయితే తాను అనుకున్నది జరగకపోతే దీప కథ వేరేలా ఉంటుందని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. ఇంతటితో నేటి కార్తీకదీపం 2 సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×