E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today march 24th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  అందరి ముందు నిజం అడిగిన పారిజాతం

Karthika Deepam 2 Serial Today march 24th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  అందరి ముందు నిజం అడిగిన పారిజాతం
Advertisement

Karthika Deepam 2  serial today Episode:  ఇంటికి వచ్చిన దీప కార్తీక్‌లను కాంచన తిట్టడంతో దశరథ వచ్చి నిజం చెప్తాడు. దీంతో అందరూ హ్యాపీగా ఉంటారు. అప్పుడే శౌర్య వచ్చి దీపను హత్తుకుని చెల్లి ఎలా ఉందని అడుతుంది. నీ కోసమే ఎదురుచూస్తుందని కార్తీక్‌ చెప్పగానే.. శ్రీధర్‌ కూడా మనందరీ ఆశలు బలంగా ఉన్నాయి కాబట్టే భగవంతుడు కరుణించాడని అంటాడు.. అందరూ కలిసి స్వీట్స్‌ పంచుకుని హ్యాపీగా ఉంటారు. అక్కడే ఉన్న పారిజాతం జరుగుతున్నదంతా వీడియో కాల్‌ చేసి జ్యోత్స్నకు చూపిస్తుంది. అంతా వీడియో చూస్తున్న జోత్స్న దీప నడవడం చూసి అనుమానపడుతుంద. దీప అచ్చం తనలాగే నడుస్తుందేంటి..? ఇంతకు మమ్మీకి డోనర్‌ ఎవరు..? అని అనుమానపడుతుంది.

మరోవైపు కావేరి వాళ్ల దగ్గరకు వెళ్లిన దాస్‌ సుమిత్ర గురించి.. దీప బేబీ బతికిన విషయం గురించి చెప్తాడు. దీతో కావేరీ, స్వప్న, కాశీ హ్యాపీగా ఫీలవుతారు. ఇంతలో దాస్‌ మీకో గుడ్‌ న్యూస్‌ స్వప్నకు మళ్లీ పెళ్లి చేయడానికి సంబంధం చూశామని చెప్పడంతో అందరూ షాక్‌ అవుతారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారికి వీటి గురించి తెలియదు, ఎంతకాలం మనం కలల్లో బతుకుతాం, విడాకుల కోసం కోర్టుకు అప్లయ్ చేశారు ఆలోపు మంచి సంబంధం చూసుకుంటే స్వప్నకి వెంటనే పెళ్లి చేయొచ్చని బావ నాతో చెప్పారని దాస్‌ చెప్తాడు. రేపే పెళ్లి కొడుకు స్వప్నని చూడటానికి వస్తున్నాడట అని దాస్‌ చెప్పడంతో స్వప్న  డల్లుగా ఆలోచనలో పడిపోతుంది.

Advertisement

మరోవైపు జ్యోత్స్నకి వీడియో కాల్‌లో జరుగుతున్నదంతా చూపిస్తున్న పారిజాతాన్ని శివనారాయణ ఎందుకు వీడియో కాల్ చేస్తున్నావు అంటూ అడుగుతాడు. దీంతో షాక్‌ అయిన పారిజాతం ఎమోషనల్‌ గా ఫీలయినట్టు నటిస్తూ.. దీపను ఎలా ఓదార్చాలో అర్ధంకాక ఇక్కడే ఆగిపోయానని  కానీ తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని తెలిశాక సంతోషంతో ఇక్కడే ఉండిపోయానని అబద్దం చెప్తుంది. పారు మాటలకు శివనారాయణ సంతోషిస్తాడు. అయితే తల్లీబిడ్డా ఎంత క్షేమంగా ఉన్నా.. ఇక్కడ ఏదో రహస్యం జరుగుతుందని దీపను లాగుతుంది పారిజాతం.. దీంతో దీప నొప్పితో బాధపడుతుంది. దీపను చూస్తుంటే చాలా నీరసంగా ఉన్నట్లుంది, నీకు అనుమానం రావడం లేదా? ఏ ఆపరేషన్ జరగకుండా దీప ఎందుకు నీరసంగా ఉందని అంటూ శివనారాయణను అడుగుతుంది పారిజాతం.

దీంతో అందరూ షాక్‌ అవుతారు. సైలెంట్‌గా బిడ్డను వదిలించేసుకుని, నీ పెళ్లాన్ని మీ అమ్మ ఇంట్లో ఉండనివ్వదని మీ అమ్మకి అబద్ధాలు చెబుతావా అంటూ కార్తీక్‌ మీద కోప్పడుతుంది పారిజాతం. దీంతో కాంచన కూడా పిన్ని చెబుతున్నది వాస్తవమే.. బిడ్డను ఉంచుకోవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే దీపెందుకు ఆపరేషన్ జరిగిన మనిషిలా అలా నీరసంగా ఉందని నిలదీస్తుంది కాంచన. మనిషిని చూస్తే అర్ధమవుతుంది ఏదో జరిగిందని అంటాడు శ్రీధర్. ఏం జరగలేదని కార్తీక్ ఎంత నచ్చజెబుతున్నా ఎవరూ వినిపించుకోరు. నీకు అబద్థాలు చెప్పడం అలవాటైపోయిందని అంటుంది కాంచన. దీంతో అనసూయ కోపంగా ఎప్పుడూ కార్తీక్ బాబునే నిలదీస్తున్నావు.. దీపను  అసలు విషయం చెప్పమని అడగండి అంటుంది.

Advertisement

ఇంతలో పారిజాతం కూడా దీప ఇన్నిరోజులు ఆసుపత్రిలో ఎందుకు ఉంది? ఎందుకు తిరిగొచ్చింది? అంటూ అడగడంతో కార్తీక్‌, దీపలు షాక్‌ అవుతారు. శ్రీధర్‌ కూడా అనుమానంగా మీరు బిడ్డని వదిలేస్తే దీపని జీవితంలో క్షమించనని మీ అమ్మ చెప్పింది.. అలా జరుగుతుందని భయపడి అబద్ధం చెబుతున్నారా అంటూ నిలదీస్తాడు. శివనారాయణ కూడా దీప నీరసంగా ఎందుకు ఉందో మాకు తెలియాలి అంటూ పట్టుబడతాడు.. దీంతో దశరథ ఒక మంచి విషయం జరిగినప్పుడు ఆనందించాలి కానీ వివరాలు ఎందుకు అంటూ అడగ్గానే.. కార్తీక్‌ మాత్రం దీప హాస్పిటల్‌ లో కాలు జారి వెనక్కి పడిపోయిందని అప్పుడే మేము రియలైజ్‌ అయి బిడ్డను కావాలనుకున్నాం అని చెప్తాడు. కానీ శివనారాయణ, పారు నమ్మరు కార్తీక్‌ అబద్దం చెప్తున్నాడు అనుకుంటారు.  ఇంతటితో నేటి కార్తీకదీపం 2 సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×