E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today march 23rd: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  కార్తీక్ దీపలకు నిజం చెప్పిన డాక్టర్  

Karthika Deepam 2 Serial Today march 23rd: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  కార్తీక్ దీపలకు నిజం చెప్పిన డాక్టర్  
Advertisement

Karthika Deepam 2  serial today Episode: హాస్పిటల్‌ నుంచి సుమిత్రను తీసుకుని అందరూ ఇంటికి వెళ్తారు. ఇంటిని చూసిన సుమిత్ర మళ్లీ ఇంటికి వస్తానో రానో అనుకున్నానని ఎమోషనల్‌ అవుతుంది. దీంతో పారిజాతం అసలు ఇంజక్షన్‌ అంటేనే భయపడే నీ కూతురు నీకోసం ఆపరేషన్‌ చేయించుకుందని..దశరథ హోమం చేశాడని.. మీ మామగారు నువ్వు మళ్లీ క్షేమంగా తిరిగి రావాలని చాలా బలంగా కోరుకున్నారని  అందుకే నువ్వు అన్నీ గండాలను దాటుకుని క్షేమంగా ఇంటికి చేరుకున్నావని అంటుంది. దీంతో సుమిత్ర ఏమోషనల్ అవుతూ.. జ్యోత్స్న చేయి పట్టుకుని ఏడుస్తూ.. కన్నతల్లి రుణం తీర్చుకున్నావమ్మ అంటుంది.

దీంతో దశరథ అసలు రుణం తీర్చుకున్నది నా కూతురు దీప అని మనసులో అనుకుని.. నాకు చిన్న పని ఉంది.. ఇప్పుడే వస్తాను అంటూ దశరథ బయటకు వెళ్తుంటే.. శివనారాయణ కోపంగా సుమిత్ర కన్నా నీకు పెద్ద పని ఏముంటుందని ప్రశ్నిస్తాడు. అయినా వినకుండా దశరథ వెళ్లిపోతాడు. దీంతో జ్యోత్స్న అనుమానంగా నేనే సుమిత్ర అసలైన కూతురిని అయినప్పుడు డాడీ నా మీద ఎందుకు ప్రేమ చూపించడం లేదు. ఏదో జరుగుతుంది అని మనసులో అనుకుంటుంది.

Advertisement

మరోవైపు హాస్పిటల్‌లో ఉన్న దీప, కార్తీక్‌ ఇద్దరూ బొమ్మను చూసుకుంటూ బాధపడుతుంటారు. అత్తయ్యకు ఏం చెప్తావని దీప కార్తీక్‌ను అడగ్గా.. అమ్మ ఎవరి మాటా వినదు.. ఎవరు చెప్పినా వినదు. తప్పు చేశాడని మా నాన్ననే వదులుకుంది. ఇప్పుడు నిన్ను కూడా వదులుకుంటుంది. అప్పుడు మా నాన్నని వదులుకుని నేను మా అమ్మవైపే నిలబడ్డాను. ఇప్పుడు ఏ తప్పు చేయని నిన్ను వదులుకోలేను. దీనికి పరిష్కారం అమ్మకి నిజం చెప్పడమే అంటాడు. అప్పుడే డాక్టర్ వచ్చి దీపకి ఎలా ఉందని అడుగుతూనే.. ఒక తల్లి ప్రాణాన్ని కాపాడుకోవానికి బిడ్డను వదులుకోవడానికి దీప సిద్ధపడింది. కానీ దీపను వదులుకోవడానికి ఆమె బిడ్డ సిద్ధపడలేదని డాక్టర్‌ చెప్పగానే.. కార్తీక్‌, దీప అర్థం కాలేదని అడుగుతారు.. దీంతో డాక్టర్‌ నీ బిడ్డ నీతోనే ఉందని దీపకు చెప్పడంతో కార్తీక్‌, దీప హ్యాపీగా ఫీలవుతారు. మీరు ఇక హ్యాపీగా ఇంటికి వెళ్లవచ్చని డాక్టర్‌ చెప్పగానే కార్తీక్‌, దీప సరే అంటారు.

ఇక ఇంట్లోంచి వెళ్లిపోవడానికి లగేజీ సర్దుకుంటుంది కాంచన. శ్రీధర్‌, అనసూయ ఎంత చెప్పినా వినకుండా వెళ్లిపోవడానికి రెడీ అవుతుంది. ఇంతలో దీప, కార్తీక్‌ ఇంటికి వస్తారు. వాళ్లను గడప దగ్గరే ఆగమని కోపంగా చెప్తుంది కాంచన. వాళ్లు హాస్పిటల్‌ నుంచి వస్తున్నారు దిష్టి  తీసి లోపలికి తీసుకురమ్మని అనసూయకు చెప్తుంది. నా కోడలు ఈ గడపలోకి అడుగుపెట్టడం, నేను గడప దాటి వెళ్లిపోవడం ఒకేసారి జరగాలని అంటుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. అయితే ఇంట్లోకి వస్తున్న దీప మెల్లగా నడుస్తుంటే ఎందుకు అలా నడుస్తున్నావని శ్రీధర్‌ అడుగుతాడు. దీంతో కాంచన కోపంగా కడుపు తీయించుకుంటే అలాగే నడుస్తారని తిడుతుంది.

Advertisement

ఇక కాంచన ఇంట్లో ఉండను అంటుందని తనతో పాటు బయటకు వెల్లిపోతానని అనసూయ చెప్తుంది. దీంతో కార్తీక్‌ కోపంగా సరే అందరూ వెళ్లిపోండి, మీ అందరికీ ఆవేదనలు, బాధలు ఉన్నాయి  కానీ మా మాట మాత్రం వినిపించుకోరా అంటూ కోప్పడతాడు. ఇంతలో అక్కడికి దశరథ వస్తాడు. నీ కోడలి క్షేమం అత్తగారిలా నీకంటే ఎవరు కోరుకుంటారు అంటూ కాంచనను అడగ్గానే.. నీ మాట మీద కూడా నాకు నమ్మకం లేదు.. నలుగురు వెళ్లారు, ముగ్గురు వచ్చారు.. అందుకే నేను వెళ్లిపోతున్నానని అంటూ కాంచన చెప్పగానే.. దశరథ ఎమోషనల్ గా నీకిచ్చిన మాట ఈ అన్నయ్య ఏనాడూ తప్పలేదు.. ఇప్పుడు కూడా తప్పడు, ఆరోజు హాస్పిటల్‌కి నలుగురం వెళ్లాం… ఇప్పుడు కూడా నలుగురం వచ్చామని.. దీప కడుపులోని బిడ్డ క్షేమంగానే ఉందని చెప్పడంతో కాంచన, శ్రీధర్, అనసూయ హ్యాపీగా ఫీవుతారు. దీప కూడా మీ కోడలుగానీ, మీ కొడుకు గానీ మీకిచ్చిన మాట తప్పలేదు అత్తయ్య అంటుంది. ఇంతటితో నేటి కార్తీకదీపం 2 సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×