E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today march 21st: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నకు వార్నింగ్ ఇచ్చిన కార్తీక్  

Karthika Deepam 2 Serial Today march 21st: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నకు వార్నింగ్ ఇచ్చిన కార్తీక్  
Advertisement

Karthika Deepam 2  serial today Episode: సుమిత్రకు ఆపరేషన్‌ జరిగిన తర్వాత జ్యోత్స్న దగ్గరకు వెళ్తుంది పారిజాతం. ఎలా ఉందని జ్యోత్స్నను అడుగుతుంది. దీంతో జోత్స్న బాగా నీరసంగా ఉందని తనకు ఆపరేషన్‌ చేశారని చెప్పడంతో సుమిత్ర కూతురువి నువ్వే కాబట్టి ఆపరేషన్‌ నీకే చేస్తారని పారిజాతం అంటుంది. దీప ఏం చేస్తుందని? తన గదిలోనే ఉందా అని  నువ్వు దాని రూమ్ ముందే ఉన్నావా అంటూ జ్యోత్స్న అడగ్గానే.. తాను దీప రూమ్‌ ముందే ఉన్నట్టు పారిజాతం అబద్దం చెప్తుంది. అయితే దీప ఆపరేషన్‌ రూం వైపు వచ్చిందా అని అడగ్గానే.. రాలేదని చెప్పగానే.. దీప రాకుండా ఆపరేషన్‌ జరిగిందంటే నేనే సుమిత్రకు నిజమైన కూతురిని అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. కార్తీక్‌ హాస్పిటల్‌కు వచ్చాడా అని జ్యో అడగ్గానే.. వాడు హాస్పిటల్‌ లోనే ఉన్నాడని పారు చెప్పగానే.. జ్యో షాక్‌ అవుతుంది.

శౌర్యను కూడా సేవ్ చేశానని నాకు హింట్ ఇచ్చాడు. నీ ఫోన్ నీ దగ్గర ఉండుంటే నీ చెంచాగాళ్లు నీకు ఫోన్ చేసి విషయం చెప్పేవాళ్లు, అలాగే మీ నాన్న కూడా హాస్పిటల్‌కు వచ్చాడు. ఏదో హోమం చేయించాడట అని చెబుతుంది పారు. దీంతో జ్యో ఇరిటేటింగ్‌ గా అసలు  మనం ప్లాన్ చేసింది ఏంటీ? ఇక్కడ జరిగింది ఏంటీ? అసలు బావకి శౌర్య ఎలా దొరికింది అంటూ కోప్పడుతుంటే.. అపుడే కార్తీక్‌ వచ్చి వెటకారంగా ఎలా ఉంది అంటూ పెద్ద మేడం చేసిన పని అందిరికీ తెలిసేలా మీడియాను పిలవాలని అంటాడు. దీంతో జ్యో మీడియా ముందు ఏం చెబుతావని కార్తీక్ ను అడుగుతుంది. ఎంతైనా ఏమైనా చెప్పొచ్చు.. ఒక తల్లి కోసం కన్నకూతురు చేసిన సాహసం అని హెడ్డింగ్ పెట్టి, దీని మీద నాలుగైదు పేజీల ఆర్టికల్ రాయించేస్తాను అంటాడు కార్తీక్‌. అలాగే నీ గురించి అరగంట ఉపన్యాసం కూడా ఇవ్వాలి కానీ మీరు హెల్దీగా లేరు కదా ముందు రెస్ట్ తీసుకోండి, మీకు సన్మానం ఎప్పుడు చేయాలో? ఎక్కడ చేయాలో నేను డిసైడ్‌ చేశాను.. శౌర్య నా కూతురు.. నా కూతురిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు మీరు మాత్రం త్వరగా కోలుకోండి.. పరిగెత్తడానికి ఓపిక ఉండాలి కదా అంటూ వెటకారంగా మాట్లాడుతూ వెళ్లిపోతాడు.

Advertisement

మరోవైపు డాక్టర్‌ హారిక ఆపరేషన్‌ గురించి మాట్లాడుతుంది. సుమిత్ర గారు సేఫ్ అయ్యారు, ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయ్యింది.. ఇక సుమిత్ర గారు నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటారు అని చెప్పడంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు. ఆరిపోతున్న మా ఇంటి దీపాన్ని వెలిగించావని శివన్నారాయణ చెప్పగా.. ఈ క్రెడిట్ మొత్తం మీ మనవరాలిదే, దశరథ గారి కూతురే సుమిత్రకు ప్రాణం పోసిందని చెబుతుంది హారిక. తను మీకు దేవుడిచ్చిన వరమని అంటుంది. మా అన్నయ్య కూతురు బంగారం.. తనే ఈరోజు త్యాగం చేసిందని దాస్ చెప్పబోతుండగానే.. దశరథ దీప గురించి అడుగుతాడు. దీపను ఇప్పుడు చూడొచ్చా అని అడగ్గానే.. పారు కోపంగా సుమిత్రని కాపాడింది జ్యోత్స్న.. నువ్వు చూడాల్సింది మొదట నీ భార్యను, లేదంటే సుమిత్రను కాపాడిన జ్యోత్స్నను అనగానే.. దీపకి కూడా చిన్న ఆపరేషన్ చేశారు.. మావయ్య ఆ ఉద్దేశంతోనే చూడాలని అంటున్నారు అంటూ కవర్ చేస్తాడు కార్తీక్.

కడుపులో బిడ్డను మోయలేక దించేసుకున్న ఆడది దీప.. అలాంటి దాని ముఖం కూడా చూడకూడదు అంటూ  పారిజాతం తిడుతుంటే..దశరథ, దాస్‌లు అడ్డు పడతారు. పారును తిడతారు. దశరథ దీపను చూడ్డానికి వెళ్తుంటే నువ్వెందుకు అడ్డుపడవని శివనారాయణను నిలదీస్తుంది. దీంతో దాస్, పారును తిడుతూ.. శౌర్య కిడ్నాప్‌ విషయం చెప్తాడు. మరోవైపు దీపను చూసిన దశరథ ఏడుస్తుంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన శివన్నారాయణ నువ్వేం తప్పు చేశావని ఏడుస్తున్నావు అని అడగ్గానే.. కొన్ని త్యాగాలు గుర్తింపుకు నోచుకోవని చెప్తాడు దశరథ. ఇంతలో డాక్టర్‌ వచ్చి సుమిత్ర కళ్లు తెరిచిందని చెప్పడంతో అందరూ సుమిత్ర దగ్గరకు వెళ్తారు. అందరూ ఎమోషనల్‌ అవుతుంటారు. డాక్టర్‌ మళ్లీ జ్యోత్న్న ప్రస్తుతం ఎటూ కదల్లేదు, మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతుంది. ఆ తర్వాత అందరూ కలిసి జ్యోత్స్న దగ్గరికి వెళ్తారు.  ఇంతటితో నేటి కార్తీకదీపం 2 సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×