E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today march 20th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ ప్లాన్ సక్సెస్ – హాస్పిటల్ నుంచి బయటకు వెళ్లిన పారిజాతం   

Karthika Deepam 2 Serial Today march 20th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ ప్లాన్ సక్సెస్ – హాస్పిటల్ నుంచి బయటకు వెళ్లిన పారిజాతం   
Advertisement

Karthika Deepam 2  serial today Episode: డాక్టర్‌ హారిక కంగారు పడుతూ కార్తీక్‌కు ఫోన్‌ చేస్తుంది. హాస్పిటల్‌లో మీ వాళ్లు అందరూ కాపలాగా ఉన్నారు.. ఇప్పుడు దీపను ఆపరేషన్‌కు ఎలా తీసుకెళ్లాలో అర్థం కావడం లేదు అని చెప్తుంది. దీంతో కార్తీక్‌ డాక్టర్‌ను కంగారు పడొద్దని చెప్తాడు. వాళ్లను అక్కడి నుంచి పంపేందుకు ప్లాన్‌ చేశాను. కొద్ది సేపట్లో మా పారు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అని చెప్తూ కాల్‌ కట్‌ చేస్తాడు. కొద్దిసేపట్లో దాస్‌, పారిజాతంకు పోన్‌ చేస్తాడు. నువ్వు పొగొట్టిన అసలు మనవరాలు దొరికిందని చెప్పడంతో పారిజాతం షాక్ అవుతుంది. ఆ విషయం చెబుదామనే ఆసుపత్రికి వచ్చాను.. ఇప్పుడు  బయటే ఉన్నాను.. నువ్వు బయటకు వస్తే ఈ రహస్యం చెప్తాను అయినా నువ్వు బిజీగా ఉన్నావు కదా వస్తావో లేదో అంటూ మాట్లాడుతుంటే..

పారిజాతం హ్యాపీగా నా మనవరాలి కంటే నాకు ఏది ఎక్కువ కాదు అనుకుంటూ జ్యోత్స్న మాటలు గుర్తు చేసుకుని అయినా…  నా సొంత మనవరాలు దొరికిన తర్వాత నేను దాని మాటలు ఎందుకు వినాలని అనుకుంటూ బయటకు వెళ్లబోతూ శివనారాయణను గుద్దేస్తుంది. దీంతో శివనారాయణ పారిజాతాన్ని తిడతాడు. ఎందుకంత కంగారు అని ప్రశ్నిస్తే.. ఎందుకంత సంతోషం అంటూ అడగ్గానే.. నా మనవరాలు దొరికిందని చెప్పగానే.. శివనారాయణ షాక్‌ అవుతాడు. మళ్లీ పారిజాతం మాట మార్చి.. జ్యోత్స్న ఆపరేషన్ చేసుకునేందుకు భయపడుతుండటంతో మీ అమ్మ రుణం తీర్చుకునే అవకాశం దొరికిందని చెప్పానని అనడంతో శివనారాయణ కోపంగా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా..? నీ మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన కుదరడం లేదని తిడుతుంటే.. వెంటనే ఆపరేషన్‌ బాగా జరగాలని దేవుడికి మొక్కడానికి వెళ్తున్నాను అటూ పారిజాతం వెళ్లిపోతుంది.

Advertisement

మరోవైపు జ్యోత్స్న మత్తుగా చూస్తూ.. ఈ డాక్టర్‌ ఏ ఇంజక్షన్‌ ఇచ్చిందో ఏంటో.. బాగా నిద్ర వచ్చేస్తుందేంటి..? అసలు బావకు శౌర్య దొరికిందా.. లేదా..? దీప ఏం చేస్తుందో..? దీప రూం దగ్గర కాపలా పెట్టిన గ్రానీ జాగ్రత్తగా అక్కడే ఉందో లేదో… అయినా నేను ఉండగా మీరు అనుకున్నది ఏదీ జరగనివ్వను అనుకుంటూ మత్తుగా చూస్తుండిపోతుంది. ఇంతలో డాక్టర్‌ వెళ్లి దీపను ఆపరేషన్‌ రూంలోకి తీసుకెళ్తుంది. అక్కడే మత్తుగా ఉన్న జ్యోత్స్నను చూసిన దీప షాక్‌ అవుతుంది. డాక్టర్‌ జ్యోత్స్న ఇక్కడుందేంటి..? అని అడగ్గానే.. తనకు ఇంజక్షన్‌ ఇచ్చాను.. నిన్ను చూసిన  గుర్తు పట్టదు.. అని డాక్టర్‌ చెప్తుండగానే… జ్యోత్స్న మత్తులోకి వెళ్లిపోతుంది.

మరోవైపు దాస్‌ దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్తుంది పారిజాతం. కోపంగా దాసును చూస్తూ.. ఎమోషనల్‌ ఫీలవుతూ.. నా మనవరాలిని దూరం చేసుకుని చాలా కాలం అయింది. జ్యోత్స్న ఎప్పుడైతే నా మనవరాలు కాదని తెలిసిందో, అప్పటి నుంచి చేసిన పాపానికి పశ్చాత్తాపపడుతూనే ఉన్నాను. నా మనవరాలి ఇక్కడికి తీసుకురావాల్సింది అంటూ పారిజాతం కోపంగా దాస్‌ను నిలదీస్తుంది. దీంతో దాస్‌ కూడా చిన్న కథ అల్లేస్తాడు. నేను నా కూతురుని చూశాను.. తనకు కూడా తనే నా కూతురన్న విషయం తెలిసింది.  కోపంగా  ఎందుకు నన్ను దూరం చేసుకున్నారని  నిలదీసింది. అయితే తన చిన్నప్పుడు జరిగిన కథంతా చెప్పాను.. దీంతో  మీలాంటి దుర్మార్గుల దగ్గరికి నేను రాను అంటూ తెగేసి చెప్పింది అంటూ కథ ముగిస్తాడు దాస్‌. అయితే ఇదంతా మా అమ్మ చేసిన పాపం, ఏదో మీ మంచి కోసం చేసిందని చెప్పకూడదా…? అయినా నా మనవరాలి దగ్గరికి నన్ను తీసుకెళ్తే నేను బతిమలాడుకుంటానని చెప్తుంది. అయితే ముందు ఈ నీళ్లు తాగు అంటూ దాస్‌ మత్తుమందు కలిపి నీళ్లు పారిజాతానికి ఇవ్వగానే… ఆ నీళ్ళు తాగి మైకంలోకి పోతుంది పారిజాతం. ఇంతటితో నేటి కార్తీకదీపం 2 సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×