E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today march 11th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ప్లాన్ సక్సెస్  

Karthika Deepam 2 Serial Today march 11th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ప్లాన్ సక్సెస్  
Advertisement

Karthika Deepam 2  serial today Episode:  

హాస్పిటల్‌ లో ఉన్న కార్తీక్‌కు శివనారాయణ ఫోన్‌ చేసి రేపు ఉదయం నేను నిన్ను ఒకసారి కలవాలి అని చెప్తాడు. కార్తీక్‌ ఎందుకు అని అడగ్గానే.. ఎందుకనే విషయాలు రేపు చెప్తాను అంటూ ఫోన్‌ కట్‌ చేస్తాడు. కార్తీక్‌ ఆలోచనలో పడిపోతాడు. తాత ఎందుకు ఫోన్‌ చేశాడు.. ఏదో బలమైన కారణమే ఉంటుంది అనుకుంటాడు. మరోవైపు కాల్‌ కట్‌ చేసిన శివనారాయణ పక్కన జ్యోత్స్న, పారిజాతం ఉంటారు. నువ్వు చెప్పినట్టే ఫోన్‌ చేశాను.. రేపు ఏం చేయబోతున్నావు అంటూ అడగ్గానే.. మనకి తెలియకుండా వాళ్లిద్దరు ఏదో చేయబోతున్నారని.. అదేంటో కనుక్కోవాలని చెప్తుంది జోత్స్న..

అయితే వాళ్ల బిడ్డ వాళ్ల ఇష్టం అంటాడు శివనారాయణ. కానీ వాళ్లు నీ కూతురిని మోసం చేస్తున్నారని చెప్తుంది జ్యోత్స్న.  దీంతో శివనారాయణ కోప్పడతాడు. దీప, కార్తీక్‌ల గురించి తప్పుగా మాట్లాడొద్దని నువ్వేసిన నింద నువ్వే నిరూపించాలి లేదంటే అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు. ఆయన వెళ్లిపోయాక ఇంతకీ ఏం చేయబోతున్నావని పారిజాతం అడిగితే కొన్ని చెప్పకూడదు.. చేసి చూపించాలి అంటూ జ్యోత్స్న వెళ్లిపోతుంది.

Advertisement

ఇంటికి వెళ్లిన శ్రీధర్‌ను మీరు అనుమానించిన విషయాన్ని కనుక్కున్నారా? లేదా అని అడుగుతుంది. అప్పుడే అక్కడికి జ్యోత్స్న వెళ్తుంది. కాంచన కోప్పడుతుంది. మనసు నిండా విషం నింపుకున్న మనుషులకు నేను దూరంగా ఉంటానని అంటుంది. దీంతో జ్యోత్స్న సొంత వాళ్లు అంటే ఎవరికి నచ్చడం లేదు. అదే నేను పనిమనిషిని అయ్యుంటే నీ కొడుకు తాళి కట్టేవాడు, నువ్వు నాకు గుడి కట్టేదానివి అంటుంది. దీంతో కాంచన కోపంగా నిన్ను బయటికి పొమ్మంటే పోవేంటి అంటూ తిట్టగానే..

జ్యోత్స్న మాత్రం దీప- కార్తీక్‌లు ఆడుతున్న నాటకం గురించి మీలాగే నాకు, తాతకి కూడా అనుమానంగా ఉందని.. మీరు సరేనంటే నిజం ఏంటో నేను తెలియజేస్తానని అంటుంది. అయితే జ్యోత్స్నను అసలు నమ్మను అంటుంది కాంచన. దీంతో దీప కడుపులోని బిడ్డ గురించి నిజం తెలిస్తే ఓకే.. లేదంటే మీరు ఏమన్నా సరే నేను పడతానని జ్యోత్స్న చెప్పడంతో కాంచన సరే అంటుంది. నువ్వు చేసే పని వల్ల నా కొడుకు- కోడలు ఏదైనా ఇబ్బంది పడితే మాత్రం అస్సలు ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది.. సరే అంటూ జ్యోత్స్న వెళ్లిపోతుంది.

Advertisement

జ్యోత్స్న ప్లాన్‌ చేసి కార్తీక్, దీపలను మరో హాస్పిటల్‌కు రప్పించాలనుకుంటుంది. అందుకోసం కార్తీక్‌ వాళ్లకు ఫోన్‌ చేసి శౌర్య మెట్ల మీద నుంచి కింద పడిపోయిందని చెప్పిస్తుంది. దీంతో కార్తీక్, దీప.. శౌర్యను తీసుకెళ్లామని చెప్పిన హాస్పిటల్‌ కు వెళ్తారు. అప్పటికే హాస్పిటల్‌ లో  శివన్నారాయణ, జ్యోత్స్న, కాంచన, పారిజాతం అందరూ ఉంటారు. వాళ్లను చూసిన దీప, కార్తీక్‌ షాక్‌ అవుతారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మా ఇద్దరినీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని కార్తీక్‌ కోప్పడతాడు..

ఇంతలో జ్యోత్స్న ఒక డాక్టర్‌ను పిలిచి దీపను టెస్ట్‌ చేయమని చెప్తుంది. కార్తీక్‌ కోపంగా హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ జరుగుతున్న మనిషిని తీసుకొచ్చి టెస్టులు చేయిస్తారా..? మీ అందరికీ ఏమైంది…? అంటూ కోప్పడుతుంటే.. కాంచన మాత్రం డాక్టర్‌ తో నా కోడలి కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఏదో సమస్య ఉందట. ఆ బిడ్డ వల్ల తల్లికి కూడా ప్రమాదం ఉందట. ఇద్దరిలో ఎవరో ఒకరినే కాపాడాల్సిన పరిస్ధితి.. నాకు నా కోడలు, నా మనవరాలు ఇద్దరూ బతకాలి. కానీ నా కొడుకు అలా కుదరదు అంటున్నాడు.. మీరు ఒకసారి టెస్ట్ చేసి నిజం చెప్పమని అడుగుతుంది. అందరూ కలిసి దీపను డాక్టర్ తో లోపలికి పంపిస్తారు. బయట కార్తీక్‌ టెన్సన్‌ పడుతుంటాడు.  ఇంతటితో నేటి కార్తీకదీపం 2 సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×