E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode June 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీపతో కలిసి పని చేస్తున్న సూరజ్

Karthika Deepam 2 Serial Today Episode June 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీపతో కలిసి పని చేస్తున్న సూరజ్
Advertisement

Karthika Deepam 2  serial today Episode: ఆఫీసులో ఉన్న దీప దగ్గరకు మేనేజరు వెళ్లి ఎండీ గారు ఫైల్‌ ఇచ్చారని మొత్తం చదివి మీ అభిప్రాయం చెప్పమన్నారు అంటాడు. అదంతా ఇంగ్లీష్ లో ఉందని చదివి నువ్వే చెప్పమని అడుగుతుంది. దీంతో మేనేజరు తాను చదవనని ఇంతకు ముందు నేను చెప్పింది అబద్దం అనుకున్నారు.. అందుకే నేను చదవను అంటాడు. దీంతో కార్తీక్ తాను ఎలాగైనా దీపకు హెల్ప్‌ చేయాలనుకుంటాడు. జ్యోత్స్న అడ్డుపడుతుంది. దీంతో కార్తీక్‌ ఇన్‌డైరెక్టుగా దీపకు అర్థమయ్యేలా ఇంగ్లీష్‌ నుంచి తెలుగుకు ట్రాన్స్‌లేట్‌ చేసే యాప్‌ గురించి చెప్తాడు. కార్తీక్‌ చెప్పినట్టే దీప యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుని ఫైల్‌ మొత్తం ఫోటోలు తీసి ఇంగ్లీష్‌ నుంచి తెలుగులోకి ట్రాన్స్‌ లేట్‌ చేసుకుని చదివి మేనేజర్‌ను తిట్టి గల్లా పట్టుకుని నిలదీస్తుంది. నీతో ఎవరు అబద్దం చెప్పిస్తున్నారు.. అంటూ వార్నింగ్‌ ఇచ్చి పంపిచేస్తుంది. కార్తీక్‌ వెటకారంగా జ్యోత్స్నతో నీ టైం బాగుంది. మేడం కానీ ఇప్పుడే నీ టైం స్టార్ట్‌ అయింది అంటూ బోర్డు మెంబర్స్‌ తో మీటింగ్‌ ఉంది కదా వెళ్దాం పదండి అంటూ కార్తీక్‌ చెప్పగానే..దీప, జ్యోత్స్న మీటింగ్‌ హాల్లోకి వెళ్తారు.

బోర్డు మీటింగ్‌లో దీప, జ్యోత్స్నలకు అప్పగించిన రిజల్ట్ గురించి దశరథ తెలియజేస్తారని శివనారాయణ చెప్పగానే..దశరథ ముందుగా జ్యోత్స్నకు అప్పగించిన బ్రాంచ్‌ టెన్‌ పర్సెంట్‌ గ్రోత్ సాధించిందని అది మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తాడు. అలాగే దీపకు అప్పగించిన బ్రాంచ్‌ టెన్‌ పర్సెంట్‌ లాస్‌లోకి వెళ్లిందని చెప్తాడు. దీంతో జ్యోత్స్నకు సపోర్టు చేసే బోర్డు మెంబర్స్‌ దీప బాధ్యతలు కూడా జ్యోత్స్నకు అప్పగించమని చెప్తారు. దీంతో కార్తీక్‌ కలగజేసుకుని వీళ్లకు ఇచ్చిన టైం గడువు ముగియలేదు కదా ఇంకా వెయిట్‌ చేయండి గడువు వరకు దీప గ్రోత్ లోకి తీసుకెళ్లొచ్చు అని చెప్తాడు. దీంతో దీప తనకు ఇంగ్లీష్‌ రాదని అందుకోసం తనకు హెల్ప్‌ చేయడానికి ఒకరు కావాలని చెప్తుంది. ఎవరు కావాలో నువ్వే ఎంపిక చేసుకో అని చెప్పగానే..

Advertisement

దీప ఆల్‌ రెడీ తాను ఒకరితో మాట్లాడానని చెప్పగానే.. సూరజ్‌ ఎంట్రీ ఇస్తాడు. తనకు సూరజ్‌ హెల్ప్‌ చేస్తాడని చెప్తుంది. దీంతో జ్యోత్స్న షాక్‌ అవుతుంది. నువ్వు చదివిని చదువుకు ఇక్కడ లక్షలకు లక్షలు జీతాలు ఇవ్వలేమని చెప్పగానే.. తాను జీతం కోసం పని చేయడం లేదని నా ఫుడ్‌ కోర్టు దీప గారి బ్రాంచ్‌లో పెట్టుకోవడానికి అంగీకారం తెలిపారు. అందుకే ఇద్దరం కలిసి పని చేస్తామని చెప్తాడు. దీంతో శివనారాయణ సూపర్ ఐడియా అంటూ మెచ్చుకుంటాడు.  ఇంతలో దశరథ అవును నీకీ దెబ్బలేంటి..? అని అడగ్గానే.. జ్యోత్స్న మనసులో భయపడుతుంది. వీడు ఇప్పుడు నిజం చెబితే తాత నన్ను క్షమించడు అనుకుంటూ భయపడుతుంటే అప్పుడే సూరజ్‌ రాత్రి తాను ఇంటికి వెళ్తుంటే.. కుక్కలు వెంటపడ్డాయని తప్పించుకునే ప్రయత్నంలో కింద పడిపోయానని చెప్తాడు. దీంతో జ్యోత్స్న ఊపిరి పీల్చుకుంటుంది.

మీటింగ్‌ తర్వాత దీప దగ్గరకు వెళ్తాడు సూరజ్‌.. దీప ఫైల్స్‌ మొత్తం సూరజ్‌ చూస్తుంటాడు. జ్యోత్స్న ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంది. దీంతో కార్తీక్‌ బాగా కాలుతున్నట్టు ఉంది. కొంచెం ఏసీ పెంచమనాలా..? అంటూ వెటకారంగా మాట్లాడుతుంటే.. జ్యోత్స్న ఇరిటేట్‌గా ఫీలవుతుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×