E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode June 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సుమిత్ర బర్తుడే పార్టీకి వెళ్లిన దక్షిణమూర్తి

Karthika Deepam 2 Serial Today Episode June 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సుమిత్ర బర్తుడే పార్టీకి వెళ్లిన దక్షిణమూర్తి
Advertisement

Karthika Deepam 2  serial today Episode: బర్తుడే పార్టీలో దీప ఇచ్చిన డ్రాయింగ్‌ చూసి సుమిత్ర ఎమోషనల్ అవుతుంది. ఆ డ్రాయింగ్‌ చూసిన పారిజాతం మాత్రం సుమిత్రకు దీప పుట్టినప్పుడు హాస్పిటల్‌ లో ఎలా ఉందో అలాగే ఉంది అని మనసులో అనుకుంటుంది. ఇంతలో సుమిత్ర డ్రాయింగ్‌ ఎవరు వేశారు అని అడగ్గానే.. దీప, శౌర్య వేసింది అని చెప్తుంది. వెంటనే సుమిత్ర, శౌర్యను ముద్దాడుతుంది చాలా బాగా డ్రాయింగ్ వేశావు అంటూ చెప్పగానే.. అమ్మ ఎలా చెప్పిందో అలాగే వేశాను. ఈ ముద్దు అమ్మకు పెట్టు అని శౌర్య చెప్పగానే.. సుమిత్ర దీపను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టి..నా పుట్టినరోజు నాడు నేను అమ్మగా పుట్టిన రోజును గుర్తు చేస్తూ డ్రాయింగ్‌ వేశారు. నాకు ఇంత కన్నా గొప్ప గిఫ్ట్‌ ఏముంటుంది అంటూ ఎమోషనల్ అవుతుంది.

కార్తీక్‌ నువ్వు చెప్పింది నిజమేరా..? ఇది అందమైన కానుక ఇలాంటి క్షణాలను ప్రతి తల్లి జీవితాంతం గుర్తు పెట్టుకుంటుంది. ఎందుకో తెలుసా..? తొమ్మిది నెలలు కడుపులో మోసిన తన తల్లిని తొలిసారి చూసుకునేది ఇక్కడే అంటూ సుమిత్ర ఆనందంతో ఏడుస్తూ ఏమోషనల్‌ అవుతుంది. ఇంతలో జ్యోత్స్న వెళ్లి డ్రాయింగ్‌ లాక్కోబోతుంటే.. సుమిత్ర చేతిలోంచి జారి కింద పడిపోతుంది. అప్పుడే దక్షిణమూర్తి వచ్చి ఆ డ్రాయింగ్‌ తీసుకుంటాడు. దక్షిణమూర్తిని చూసిన అందరూ షాక్‌ అవుతారు. శివనారాయణ కోపంతో రగిలిపోతుంటాడు. పారిజాతం మెల్లగా మనం విన్నది నిజమే.. వాళ్లే ఈయనను పిలిపించారు అనగానే జ్యోత్స్న కూడా మనకు కావాల్సింది ఇదే కదా నువ్వు ఆగు నేను చూసుకుంటాను అంటుంది. శివనారాయణ కోపంగా నా ఇంటికి వచ్చావని అడుగుతాడు. ఆపదలో ఉన్న నన్ను రక్షించినందుకు కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోదామని వచ్చాను అంటాడు.

Advertisement

అయితే వచ్చిన పని అయిపోయింది కదా ఇక బయలుదేరు అనగానే..నేను వచ్చిన పని ఇంకా పూర్తి కాలేదు నీ మనవడు మనవరాలికి కూడా థాంక్స్‌ చెప్పాలి అంటూ వాళ్లిద్దరికీ థాంక్స్‌ చెప్పగానే.. ఇక వెళ్లు అంటూ శివనారాయణ చెప్పగానే.. దక్షిణమూర్తి ఇవాళ నా కూతురు పుట్టినరోజు ఆశీర్వదించాలని వచ్చాను అంటాడు. దీంతో సుమిత్ర కోపంగా దక్షిణమూర్తిని తిడుతుంది. నువ్వు అనుకున్నంత ఈజీగా బంధాలు తెగిపోవు సుమిత్ర అంటూ దక్షిణమూర్తి ఎమోషనల్‌ అవుతాడు. దీంతో కాంచన కోపంగా దక్షిణమూర్తిని తిడుతుంది. బంధాలు తెంపేసుకుంది చంపేసుకుంది మీరు ఆరోజు అహంకారంతో కళ్లు మూసుకుపోయి అయిన వాళ్లందరినీ ఎడమకాలితో తన్నారు.. ఈరోజు ఆవే బంధాలు కావాలని మళ్లీ అడుగుతున్నారు. ఏం అహంకారం చచ్చిపోయిందా..? అంటూ ప్రశ్నించగానే.. దక్షిణమూర్తి కోపంగా బంధాలు తెంపేసుకుంది మీరు. అందుకు ఇన్నేళ్లుగా రాతి విగ్రహాలుగా ఉన్నారు అనగానే..

సుమిత్ర కోపంగా అయితే మీరు జరుపుకోవాల్సింది కూతురు పుట్టినరోజును కాదు చచ్చిన రోజు అంటూ తిడుతుంది. దీంతో దక్షిణమూర్తి ఎమోషనల్ అవుతాడు. శివనారాయణ కోపంగా దక్షిణమూర్తిని తోసేయబోతుంటే..ఆయన చేతిలోని అక్షింతలు సుమిత్ర తల మీద పడతాయి. దీంతో శివనారాయణ మరీ కోపంగా దక్షిణమూర్తిని కొట్టడానికి వెళ్తుంటే.. కార్తీక్‌ అడ్డుపడతాడు. ఇంతలో జ్యోత్స్న ఆయన ఊరికే రాలేదు తాత పిలిస్తే వచ్చారు అని చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. శివనారాయణ కోపంగా ఎవరు పిలిచారు అంటూ ప్రశ్నించగానే.. దీప పిలిచింది అంటూ జ్యోత్స్న చెప్తుంది. దీప షాక్‌ అవుతుంది. కార్తీక్‌ కోపంగా జ్యోత్స్నను తిడతాడు. దీప అంటే ప్రతి ఒక్కరికి వెటకారం అయిపోయింది అంటూ తిడుతుంటే.. దీప నువ్వు బావతో అమ్మ పుట్టిన రోజుకు ఈ పెద్ద మనిషి వస్తే బాగుంటుంది అని నువ్వు అన్నావా లేదా..? అని జ్యోత్స్న అడగ్గానే.. దీప అన్నాను అంటుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు.

Advertisement

కాంచన కోపంగా నువ్వు పిలిచావా..? అని అడగ్గానే.. ఆ విషయం నేను చెప్తాను.. ఎందుకంటే నేను ఎవరు పిలిస్తేనో రాలేదు.. నా కూతురు కోసం వచ్చాను. ఇది నా ప్రాణస్నేహితుడు శివనారాయణ ఇల్లు ఇది నా కూతురు అత్తారిల్లు.. నేను ఎప్పుడైనా రావొచ్చు అంటాడు.దీంతో శివనారాయణ కోపంగా మాటలు చాలించి ఇక్కడి నుంచి వెళ్లిపో అంటాడు. దక్షిణమూర్తి వెల్లబోతూ.. సుమిత్ర కోసం ఆయన కొడుకు కోడలు ఎదురుచూస్తున్నారని చెప్పి వెళ్లిపోతాడు. సుమిత్ర ఏడుస్తుంటే.. శివనారాయణ ఓదారుస్తాడు. అందరినీ అంతా మర్చిపోమ్మని చెప్పి కేక్‌ కట్ చేయమని సుమిత్రకు చెప్తాడు. సుమిత్ర కేక్ కట్‌ చేస్తుంటే.. దక్షిణమూర్తి దయ వల్ల దీప తప్పించుకుంది అంటూ పారిజాతం జ్యోత్స్న చెవిలో చెప్తుంది. ఇక్కడ తప్పించుకుంటేనేం ఆఫీసుకు వెళ్తాం కదా అక్కడ చూసుకుంటాను అంటుంది. ఇంతలో కార్తీకదీపం2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×