E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode June 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప వేసిన డ్రాయింగ్ చూసి భయంతో వణికిపోయిన పారిజాతం  

Karthika Deepam 2 Serial Today Episode June 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప వేసిన డ్రాయింగ్ చూసి భయంతో వణికిపోయిన పారిజాతం  
Advertisement

Karthika Deepam 2  serial today Episode: సూరజ్‌ గురించి దీప, కార్తీక్‌ మాట్లాడుకుంటుంటారు. జ్యోత్స్నకు సూరజ్‌ భయపడ్డాడేమోనని దీప అనగానే.. అంతలా భయపడేవాడు అయితే కాంప్లెంట్‌ చేయడానికి ఇంటి దాకా వచ్చేవాడే కాదు అని కార్తీక్‌ చెప్పగానే.. మరెందుకు తనకు కార్పోరేట్‌ ఆఫీసుల్లో పని చేయడం ఇష్టం లేదని చెప్పాడు అని దీప అడగ్గానే.. ఏదో రీజన్ ఉండొచ్చు అంటూ కార్తీక్‌ చెప్తుంటే.. సమస్య మళ్లీ మొదటికి వచ్చిందని తన దగ్గర పని చేయడానికి స్వప్నను తీసుకుందామని దీప చెప్పగానే.. స్వప్నను వద్దని తన కాపురం ఇప్పుడే సెట్‌ అవుతుందని మళ్లీ తన కాపురానికి మంచిది కాదని అసలే జ్యోత్స్నకు స్వప్నకు అసలు పడదని.. జ్యోత్స్న ఏదైనా అంటే స్వప్నను కంట్రోల్‌ చేయడం తన కాదని కార్తీక్‌ చెప్పగానే.. దీప తాను సర్ది చెప్తానని అంటుంది. అయినా వద్దని కార్తీక్‌ చెప్పగానే.. దీప కాశీనైనా పెట్టుకుందామని అడిగితే వద్దని సూరజ్‌ మనసు మారితే సంతోషం.. మారాలని కోరుకుందాం అంటూ ఆలోచిస్తుంటారు.

రాత్రి షాపు క్లోజ్‌ చేసి సూరజ్‌ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే.. కొంత మంది రౌడీలు సూరజ్‌ను చుట్టుముడతారు. కర్రలతో సూరజ్‌ను కొడుతుంటారు. సూరజ్‌ కింద పడిపోయి బాధగా ఒరేయ్‌ ఎవర్రా మీరు నన్నెందుకు కొడుతున్నారురా అంటూ అడిగినా వినకుండా రౌడీలు ఘోరంగా కొడుతుంటే.. ఇంకో రౌడీ వీడియో తీస్తుంటాడు. ఇంతలో పోలీసుల కారు సౌండ్‌ విని రౌడీలు పారిపోతారు. మరోవైపు జ్యోత్స్న అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తుంటే.. పారిజాతం నువ్వు అనుకున్నది జరిగిందో లేదో అంటుండగానే.. రౌడీలు సూరజ్‌ను కొట్టిన వీడియో పంపిస్తారు. ఆ వీడియో చూసిన జ్యోత్స్న రౌడీలకు ఫోన్‌ చేసి ఏదైనా అవసరం అయితే ఫోన్ చేస్తాను.. మీరు అక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ కాల్ కట్‌ చేసి వీడియో పారిజాతానికి చూపిస్తుంది జ్యోత్స్న. చూశావా గ్రాణి ఈ జ్యోత్స్న జోలికి వస్తే ఎలా ఉంటుందో అని చెప్పగానే.. పారిజాతం భయంగా గట్టిగానే కొట్టినట్టు ఉన్నారే అంటూ కంగారు పడుతుంది. ఇక్కడితో వదిలేయవే అని చెప్పినా ఎక్కడిదాకా తీసుకెళ్లి వదిలేయాలో నాకు తెలుసులే అంటూ వెళ్లిపోతుంది జ్యోత్స్న.

Advertisement

తన పుట్టిన రోజును ఎవ్వరికీ చెప్పొద్దని సుమిత్ర అనుకుంటుంది. అయితే కార్తీక్‌ మాత్రం కేక్‌ కట్‌ చేద్దామని దశరథ్‌, కార్తీక్‌ ప్లాన్‌ చేస్తారు. అయితే శౌర్యకు విషయం తెలిసి ఇంట్లో అందరికీ చెప్తుంది. దీంతో సుమిత్ర డల్లుగా నా బర్తుడే కోసం ఎలాంటి హడావిడి చేయోద్దని చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత దీప బయటకు వెళ్లి కార్తీక్‌ తనకు ముందే చెప్పనందుకు బాధపడుతుంటే.. కార్తీక్‌ వెళ్లి ఓదారుస్తాడు. దీంతో సుమిత్రకు ఏదైనా స్పెషల్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని దక్షిణమూర్తిని తీసుకొచ్చి బర్తుడే విషెష్‌ చెప్పించాలని దీప ఆలోచిస్తుంది. పక్క నుంచి పారు, జ్యో విని వెల్లిపోతారు. కార్తీక్‌ మాత్రం వద్దని ఎమోషనల్‌ అవతాడు. కార్తీక్‌ మాటలకు దీప ఎమోషనల్‌ అవుతూ హగ్‌ చేసుకుని ఏడుస్తుంది. లోపలికి వెళ్లిన జ్యో వెళ్లి శివనారాయణకు కార్తీక్‌, దీప మాట్లాడుకున్న దక్షిణమూర్తి విషయం చెప్తానని అంటే పారిజాతం ఆపేస్తుంది. ముందు వాళ్లు ఏం చేస్తారో చేయని తర్వాత మనం చేసేది చేద్దాం అంటుంది. దీంతో జ్యో ఆగిపోతుంది.

మరోవైపు సుమిత్రకు ఏం గిఫ్ట్‌ ఇవ్వాలోనని దీప, కార్తీక్ ఆలోచిస్తుంటారు. ఇంతలో శౌర్య అక్కడికి వెళ్తుంది. అప్పుడే కార్తీక్‌ శౌర్యను మీ అమ్మ బర్తుడే అయితే ఏం గిఫ్ట్‌ ఇస్తావని అడగ్గానే.. శౌర్య మంచి డ్రాయింగ్‌ వేసి ఇస్తానని శౌర్య చెప్పగానే.. కార్తీక్‌ అదే గిఫ్ట్‌ నువ్వే రెడీ చేసి ఇవ్వమని చెప్పగానే.. దీప హ్యాపీగా ఫీలవుతుంది. తర్వాత అందరూ కలిసి కేక్‌ కటింగ్‌ కు రెడీ చేస్తారు. అప్పుడే అక్కడకు వచ్చిన సుమిత్ర చాలా బాగా అరైంజ్‌ చేశారు అంటూ కార్తీక్‌కు పొగుడుతుంది. దీంతో కార్తీక్‌ ఇదేంటి అత్తా దీప నీకోసం ఇంకా మెమెరబుల్‌ గిఫ్ట్‌ రెడీ చేసింది అని చెప్పగానే.. అప్పుడే వచ్చిన దీప తాను శౌర్యతో వేయించిన డ్రాయింగ్‌ పేపర్‌ సుమిత్రకు ఇస్తూ విషెష్‌ చెప్తుంది. ఆ డ్రాయింగ్‌ ఓపెన్‌ చేసి చూసిన సుమిత్ర ఎమోషనల్ అవుతుంది. పారిజాతం మాత్రం షాక్‌ అవుతుంది. సుమిత్రకు డెలివరీ అయినప్పుడు తాను బిడ్డల్ని మార్చిన సమయంలో ఎలా ఉందో అలాగే ఉందని అనుకుంటుంది. ఇంతలో కార్తీకదీపం2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×