E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode June 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పారిజాతం ప్లాన్ అట్టర్‌ ప్లాప్‌ – అయోమయంలో జ్యోత్స్న  

Karthika Deepam 2 Serial Today Episode June 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పారిజాతం ప్లాన్ అట్టర్‌ ప్లాప్‌ – అయోమయంలో జ్యోత్స్న  
Advertisement

Karthika Deepam 2 serial today Episode: కాంచన, దీప కోసం కొత్త చీరలు, నగలు తెప్పిస్తుంది. అవి చూసిన దీప ఎవరికి అత్తయ్య అని అడగ్గానే.. నీకే అని చెప్తుంది. దీంతో దీప ఆశ్చర్యంగా నాకా అని అడగ్గానే.. అవును ఇప్పుడు నువ్వు ఆఫీసుకు వెళ్తున్నావు.. పెద్ద పెద్ద వారితో కలిసే పని ఉంటుంది. నువ్వు ఇలా సింపుల్‌గా ఉంటే బాగోదు అని చెప్పగానే.. దీప అయితే మరి వీటన్నింటికీ డబ్బులు ఎక్కడివి అని దీప అడిగితే.. మీ మామయ్య ఇచ్చారు అనగానే.. దీప, కార్తీక్‌ షాక్‌ అవుతారు. మామయ్య ఇవ్వడం ఏంటని దీప అడుగుతుంది. దీంతో జరిగిన విషయం మొత్తం కాంచన చెప్తుంది. శ్రీధర్‌ ఎప్పుడూ నీకోసం అంటూ కొంత డబ్బులు ఇచ్చారు అంటూ చెప్తుంది.

ఇంతలో శౌర్య వచ్చి అన్ని అమ్మకేనా..? నాకేం లేవా..? అనగానే.. కాంచన స్వీట్స్‌ ఇస్తుంది. నాకు స్వీట్స్‌ వద్దు.. సైకిల్‌ కావాలి అంటుంది. అయితే కొంటాను అంటూ కాంచన చెప్పగానే.. నువ్వు కొనొద్దు నువ్వు కొంటెం డబ్బా సైకిల్‌ కొంటావు.. తాతయ్యను తీసుకురమ్మను అంటూ చెప్తుంది. కాంచన సరే అంటుంది. తర్వాత శౌర్యను కార్తీక్‌ తీసుకుని వెళ్లిపోతాడు. దీపకు చీరలు తీసుకెళ్లు అని చేతిలో పెట్టగానే.. దీప థాంక్స్‌ అత్తయ్యా అంటుంది. కాంచన తనకు కాదని మామయ్యకు చెప్పమని అంటుంది. నీకు చెప్తే ఆయనకు చెప్పినట్టే అంటూ దీప నవ్వుకుంటూ వెళ్లిపోతుంది. తర్వాత రూంలోకి వెళ్లగానే.. కార్తీక్‌ బంగారు తాళిబొట్టును దీప మెడలో వేస్తాడు. దీప ఎమోషనల్‌ అవుతుంది.

Advertisement

సూరజ్‌ను ఇంట్లోంచి వెళ్లగొట్టడానికి పారిజాతం ప్లాన్‌ చేస్తుంది. ఒక జూనియర్‌ ఆర్టిస్టును అరైంజ్‌ చేస్తుంది. అమ్మాయి క్యారియర్‌తో సూరజ్‌ రూంలోకి పంపించి లవర్‌గా యాక్టింగ్‌ చేయమని చెప్తుంది. అ అమ్మాయి చేతికి క్యారియర్‌ బాక్స్‌ ఇచ్చి సూరజ్‌ రూంలోకి పంపిస్తుంది. అమ్మాయి రూంలోకి వెళ్లగానే.. పారిజాతం కోపంగా ఓరేయ్‌ సూరజ్‌ గా మీ అందరి భరతం పట్టే టైం వచ్చిందిరా నీతో మొదులు పెట్టి.. ఆ దీపతో ఆపేస్తాను.. అంటూ చూస్తుంది. అమ్మాయి లోపలికి వెళ్లి సూరజ్‌తో మాట్లాడుతుంటే.. సూరజ్‌ అమ్మాయిని ఎవరు నువ్వు అంటూ అడుగుతుంటే.. బయటి  నుంచి పారిజాతం వెళ్లి డోర్‌ క్లోజ్‌ చేసి లాక్‌ చేసి ఇంట్లోంకి వెళ్తుంది.

ఇంట్లోకి వెళ్లిన పారిజాతం అందరినీ పలిచి సూరజ్‌ గురించి చెప్తుంది. శివనారాయణ కోపంగా అసలు ఏం జరిగిందో చెప్పు అంటూ కోప్పడగానే.. నేను చెప్తే కాదు.. మీ కళ్లతో మీరు చూడండి.. అంటూ అందరినీ సూరజ్‌ ఉన్న ఇంటి దాకా తీసుకెళ్తుంది. అందరూ చూస్తుంటే.. పారిజాతం వెళ్లి డోర్‌ లాక్‌ తీస్తుంది. రూంలో అమ్మాయి రూం క్లీన్‌ చేస్తున్నట్టు యాక్టింగ్‌ చేస్తుంది. సూరజ్‌ లాప్‌టాప్‌ లో ఏదో వర్క్‌ చేస్తుంటాడు. వాళ్లను చూసిన అందరూ షాక్‌ అవుతారు. పారిజాతం డబుల్‌ షాక్‌ అవుతుంది. ఇదేంటి ఇది వాడి మీద పడి రచ్చ చేస్తుంది అనుకుంటే ఇలా చీపురు పట్టి క్లీన్‌ చేస్తుందేంటి..? అయినా మనం తగ్గేదే లేదు.. ఏదో ఒకటి చేయాల్సిందే అనుకుంటూ అయ్యో చూశారా అండీ ఈ అరాచకం.. మంచోడని మనం రూం ఇస్తే.. అమ్మాయిని తీసుకొచ్చి పెట్టుకున్నాడు అంటూ అరుస్తుంది. సూరజ్‌ను తిడుతుంది. ఈ దరిద్రుడిని ఈ క్షణమే ఇంట్లోంచి గెంటేయండి అంటూ చెప్తుంది. జ్యో మాత్రం ఒరేయ్‌ సూరజ్‌ భలే ఇరుక్కున్నావురా నువ్వు అనుకుంటూ హ్యాపీగా ఫీలవుతుంది.

Advertisement

అప్పుడే రూంలోంచి మామిడి పండు తింటూ కార్తీక్‌ వస్తాడు. కార్తీక్‌ ను చూసిన పారిజాతం, జ్యోత్స్న షాక్‌ అవుతారు. పారిజాతం నవ్వు ఇక్కడున్నావేంట్రా అని అడగ్గానే.. నేనే కాదు పారు నా బంగారం కూడా వచ్చింది అంటూ దీప అని పిలవగానే.. దీప కూడా మామిడి పండు తింటూ వస్తుంది. పారిజాతం, జ్యోత్స్న షాక్‌ అవుతారు. మీరు ఇక్కడున్నారేంటి అని శివనారాయణ అడిగితే మీరేంటి అందరూ బయటకు వచ్చారు అంటూ కార్తీక్‌ అడుగుతాడు. దీంతో పారిజాతం చెప్పిన మాటలు శివనారాయణ చెప్పగానే.. కార్తీక్‌, దీప ఆ అమ్మాయి పనమ్మాయి.. మేమే సూరజ్‌ రూం క్లీన్‌ చేయిద్దామని తీసుకొచ్చాము అని చెప్తారు. దీంతో పారిజాతం, జ్యోత్స్న డబుల్‌ షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×