E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode June 16th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ తో పాటు ఆటోలో వెళ్లిన జ్యోత్స్న 

Karthika Deepam 2 Serial Today Episode June 16th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ తో పాటు ఆటోలో వెళ్లిన జ్యోత్స్న 
Advertisement

Karthika Deepam 2 serial today Episode: సూరజ్‌కు భోజనం తీసుకెళ్లి బెదిరించాలని చూసిన జ్యోత్స్నకు సూరజ్‌ షాక్‌ ఇస్తాడు. తన దగ్గర ఉన్న వీడియోలు చూపించి ఈ వీడియోలన్నీ సోషల్‌ మీడియాలో వైరల్ చేస్తానని బెదరిస్తాడు. నువ్వు వెళ్లి మీ ఇంట్లో వాళ్లకు చెప్పినా పర్వాలేదు.. నేను జైలుకు వెళ్లినా పర్వాలేదు అంటూ సూరజ్‌ చెప్పగానే.. జ్యోత్స్న షాక్‌ అవుతుంది. కోపంగా సూరజ్‌ను తిడుతుంది. దీంతో సూరజ్‌ నవ్వుతూ నీలాంటి తిక్కదానికి నాలాంటి తిక్కలోడే కరెక్ట్‌.. దేశం మొత్తం వెతికినా నాలాంటి తిక్కలోడు నీకు దక్కడు.. అంటాడు.

దీంతో జ్యోత్స్న కోపంగా అరేయ్‌ సూరజ్‌ నీకు నా గురించి కొంచమే తెలుసు.. ఇక నుంచి నీకు చుక్కలు చూపిస్తాను చూడు అనగానే.. సూరజ్‌ చందమామ ముందుంటే చుక్కలు అంటావేంటి..? అనగానే.. ఇది చందమామ కాదు.. హైఓల్టేజీ ట్రాన్స్‌ఫార్మర్‌.. షాక్‌ కొట్టి గిలగిల కొట్టుకుని చస్తావు అనగానే.. నాకు కరెంట్‌ షాక్‌ అంటే చాలా ఇష్టం.. థాంక్యూ నా కోసం ఇంత కేరింగ్‌తో ఫుడ్డు తీసుకొచ్చినందుకు అంటూ చెప్పగానే.. జ్యోత్స్న కోపంగా సూరజ్‌కు వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది.

Advertisement

శివనారాయణ, జ్యోత్స్న కలిసి కారులో ఆఫీసుకు వెళ్తుంటే.. బయట రోడ్డు మీద సూరజ్‌ నిలబడి ఉంటాడు.. సూరజ్‌ను చూసిన శివనారాయణ కారులో వెళ్దామని చెప్పగానే.. జ్యోత్స్న అందుకు ఒప్పుకోదు.. దీంతో శివనారాయణ కోపంగా జ్యోత్స్నను కూడా కిందకు దింపేసి సాయంగా ఉండి సూరజ్‌ను ఆఫీసుకు తీసుకురమ్మని చెప్పి కారులో వెళ్లిపోతారు కార్తీక్‌, శివనారాయణ. వాళ్లు వెళ్లిపోయాక సూరజ్‌ ఆటోలో వెళ్తుంటే.. జ్యోత్స్న ఆటోలో రానని కారు బుక్‌ చేయమని చెప్తుంది. నా బడ్జెట్‌ షేరింగ్‌ ఆటోనే.. అంటూ సూరజ్‌ ఆటోలో వెళ్తుంటే.. జ్యోత్స్న కూడా ఆటోలో వెళ్తుంది. ఆటోలో కుదుపులకు జ్యోత్స్న, సూరజ్‌ మీద పడుతుంటుంది. కోపంగా ఆటో స్లోగా వెళ్లమని డ్రైవర్‌ను తిడుతుంది. సూరజ్‌ అలాగే వెళ్లమని తనకు హాయిగా ఉందని చెప్పడంతో జ్యోత్స్న కోపంగా సూరజ్‌ చేతిలోని హ్యాండ్‌ స్టిక్‌ను బయటకు విసిరి వేస్తుంది. నా స్టిక్‌ ఎందుకు పడేశావని అడగ్గానే.. కాళ్లు చేతులు మంచిగా పని చేస్తున్నా ఈ నాటకాలు ఎందుకు ఆడుతున్నావు అంటూ జ్యోత్స్న తిడుతుంది. దీంతో సూరజ్‌ థాంక్యూ అంటాడు. దేనికని జ్యో అడిగితే నీకు తర్వాత తెలుస్తుందిలే అంటాడు.

కట్‌ చేస్తే.. ఆఫీసు దగ్గర కార్తీక్‌, దీప ఇద్దరూ సూరజ్‌, జ్యో ల గురించి ఆలోచిస్తుంటారు. సూరజ్‌ ఇంకా రాలేదని ఆఫీసు దగ్గర ఎదురుచూస్తుంటారు. అప్పుడే జ్యోత్స్న తన భుజాలను సూరజ్‌ కు సపోర్ట్‌గా ఇస్తూ లోపలికి నడిపిస్తూ తీసుకొస్తుంది. అది చూసిన కార్తీక్‌, దీప షాక్‌ అవుతారు. వాళ్లు దగ్గరకు రాగానే.. కార్తీక్‌ నా జీవితంలో చూడలేను అనుకున్నది చూసేశాను అంటూ నీ చేతిలో స్టిక్‌ ఏది అని అడగ్గానే.. ఆటోలో వస్తుంటే.. ఒక కుక్క దాన్ని లాగేసింది బ్రదర్‌ అని చెప్పగానే.. కార్తీక్‌ అనుమానంగా చూస్తుంటాడు.

Advertisement

తర్వాత అందరూ ఆఫీసులో వర్క్‌ చేసుకుంటూ ఉండగానే.. మేనేజర్‌ ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి జ్యోత్స్నకు పరిచయం చేసి పెద్ద ఫుడ్‌ ఆర్డర్‌ వచ్చింది తానే దగ్గర ఉండి తీసుకొచ్చినట్టు చెప్తాడు. దీంతో జ్యోత్స్న బిల్డప్‌ కొడుతుంది. దీప, సూరజ్‌ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఆర్డర్‌ వచ్చిందని జ్యోత్స్న ఇన్‌డైరెక్టుగా దీప, సూరజ్‌లను తిడుతుంది. ఇంతలో వచ్చిన కస్టమర్‌ కు రేటు విషయంలో జ్యోత్స్న చెప్పిన ఆఫర్‌ నచ్చక వెళ్లిపోతుంటే.. దీప పిలిచి ఆయనతో డీల్‌ చేసుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×