E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode June 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌ : జ్యోత్స్నకు షాక్ అండ్ వార్నింగ్ ఇచ్చిన సూరజ్ 

Karthika Deepam 2 Serial Today Episode June 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌ : జ్యోత్స్నకు షాక్ అండ్ వార్నింగ్ ఇచ్చిన సూరజ్ 
Advertisement

Karthika Deepam 2 serial today Episode: సూరజ్‌ తమ అవుట్‌ హౌస్‌లో ఉంటాడని శివనారాయణ చెబితే జ్యోత్స్న, పారిజాతం అడ్డుపడతారు. దీంతో సూరజ్‌ కూడా తనకు అక్కడ ఉండటం ఇష్టం లేదని చెప్తాడు. ఎందుకని దశరథ అడగ్గానే.. నా బాద్యత మీరు తీసుకోవడం నాకు ఇష్టం లేదు సార్‌ అని చెప్తాడు. సూరజ్‌ మాటలకు జ్యోత్స్న హ్యాపీగా ఫీలవుతుంది. ఎక్కడ ఈ దరిద్రుడు ఈ కాంపౌండ్‌లో ఉంటాడేమో అనుకున్నాను అని మనసులో అనుకుంటుంది. శివనారాయణ మాత్రం నీ బాధ్యత తీసుకోవడం లేదని హెల్ప్‌ చేస్తున్నానని చెప్తాడు. నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు.. నీకు ఇక్కడ నచ్చని రోజు వెళ్లిపోవచ్చు అని చెప్పినా..

సూరజ్‌ అయినా కూడా ఉండనని చెప్తాడు. దీంతో కార్తీక్‌ ఏంటి బ్రదర్‌ నువ్వు మితిమీరినా మొహమాటం మొదటికే మోసం అంటూ సూరజ్‌ను కన్వీన్స్‌ చేయాలని చూస్తాడు. పారిజాతం అతనికి ఇష్టం లేనప్పుడు నువ్వెందుకు బలవంతం చేస్తావు అంటూ అడ్డుపడుతుంది. దీంతో కార్తీక్‌ తాను చేసేది తప్పు కాదని మా తాతను, మా అత్త కూతురును కాపాడిన వ్యక్తిని నేను సపోర్ట్‌ చేయడం తప్పే కాదని ఏం బ్రదర్‌ మీరు ఉంటారు ఉంటున్నారు.. ఓకే చెప్పండి అనగానే.. వీడు కచ్చితంగా ఉండను అంటాడు అని జ్యోత్స్న, వీడికి కాస్త తిక్క ఉంది వీడు అసలు ఉండడు ఇక్కడ అని పారిజాతం మనసులో అనుకుంటారు. సూరజ్‌ మాత్రం కార్తీక్‌ బలవంతం చేయడంతో సరే అంటాడు. దీంతో పారిజాతం షాక్‌ అవుతుంది. అవుట్‌ హౌస్‌లో అడుగుపెట్టిన దీప కార్తీక్‌ గాడికి పెళ్లాం అయింది. వీడు జ్యోత్స్నకు మొగుడు అవ్వడు కదా.. అని మనసులో అనుకుంటూ భయపడుతుంది.

Advertisement

తర్వాత అందరూ భోజనం చేస్తుంటే.. సూరజ్‌ గుర్తుకు వస్తాడు. మనం భోజనం చేసిన తర్వాత సూరజ్‌ను పిలవండి తను తింటాడు అని చెప్పగానే.. దానికన్నా భోజనం తీసుకెళ్లి ఇస్తే బాగుంటుంది కదా అంటూ పారిజాతం చెప్పగానే.. ఈ ఐడియా ఏదో బాగుంది. అయితే నువ్వే తీసుకెళ్లి ఇవ్వు అంటూ శివనారాయణ చెప్పగానే.. జ్యోత్స్న తాను తీసుకెళ్లి ఇస్తానని చెప్తుంది. ఇప్పుడు చూడు గ్రాణి వాడిని తెల్లారేసరికి ఇక్కడి నుంచి పారిపోయేలా చేస్తాను అంటుంది. మరోవైపు కార్తీక్‌ వాళ్లు ఇంట్లో భోజనం చేస్తుంటారు. కాంచన కోపంగా దీప గురించి మాట్లాడుతుంది. నా పుట్టింటి మీద నాకంటే ఎక్కువ ప్రేమను ఎందుకు తెచ్చుకుందో అంటూ తిడుతుంటే.. కార్తీక్‌ వెంటనే ఎందుకంటే దీపకు పుట్టిల్లు లేదు కాబట్టి. అమ్మానాన్నలు లేరు కాబట్టి.. సుమిత్ర అత్తయ్య, దశరథ మామయ్యలనే అమ్మానాన్నలను చూసుకుంటుంది అంటూ అన్నట్టు నాన్న ఫోన్‌ చేశాడా అని అడగ్గానే.. సుమిత్ర మౌనంగా ఉండిపోతుంది. తాత, నాన్నమ్మకు ఫోన్‌ చేయడు.. నాన్నమ్మే తాతకు ఫోన్‌ చేస్తుంది అని చెప్పగానే.. కార్తీక్‌ ఆశ్చర్యంగా చూస్తుంటాడు. శౌర్య ఇంకా చెప్తుంటే.. అందరూ నవ్వుకుంటారు.

అవుట్‌ హౌస్‌లో ఉన్న సూరజ్‌కు భోజనం తీసుకెళ్తుంది జ్యోత్స్న. అక్కడ సూరజ్‌ నార్మల్‌గానే వంట చేసుకుంటూ డాన్స్‌ చేస్తుంటాడు. జ్యోత్స్న కోపంగా ఏంట్రా ఇది విరిగిపోయిన కాలు, చేతులు ఎక్కడికి పోయాయి.. కాళ్లు విరిగిపోవడం, చేయి విరిగిపోవడం డ్రామా.. అంటూ నిలదీస్తుంది. ఎవరిని నమ్మించడానికి ఈ వేషాలు వేస్తున్నావు అంటూ తిడుతుంటే.. సూరజ్‌ కోపంగా ఆగవే అంటూ జ్యోత్న్సను తిడతాడు. జ్యోత్స్న షాక్‌ అవుతుంది. సూరజ్‌ అంతా డ్రామానే జ్యోత్స్న పంపించిన రౌడీలను కూడా తాను మేనేజ్‌ చేసినట్టు నిజం చెప్తాడు. నువ్విచ్చిన దానికంటే ఎక్కువే డబ్బులు ఇస్తానన్నాను అంతే నేను చెప్పినట్టు చేశారు అంటూ చెప్పగానే.. జ్యోత్స్న షాక్‌ అవుతుంది. వెంటనే తేరుకుని నా వాళ్లను నమ్మించి మోసం చేసినందుకు నా మీదకే రౌడీలను పంపినందుకు నీ మీద కేసు పెట్టిస్తా..? నీ చాప్టర్‌ అయిపోయిందిరా నిన్ను దీపే కాదు.. ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడురా..? జస్ట్‌ టూ మినిట్స్‌లో నీ లైఫ్‌ సెటిల్‌ చేస్తాను. అంటూ వెళ్తుంటే.. సూరజ్‌ ఒక వీడియో చూపిస్తాడు. అందులో ఒక రౌడీ తనకు జ్యోత్స్న డబ్బులు ఇచ్చి సూరజ్‌ను చంపేయమని చెప్పిందని చెప్తాడు. ఆ వీడియో చూసిన జ్యోత్స్న భయంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×