E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode June 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నకు ఐలవ్యూ చెప్పిన సూరజ్  

Karthika Deepam 2 Serial Today Episode June 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నకు ఐలవ్యూ చెప్పిన సూరజ్  
Advertisement

Karthika Deepam 2 serial today Episode: జ్యోత్స్న పనికి శివనారాయణ కోపంగా తిడతాడు. ఇక నుంచి తన ఫ్యామిలీలో తన వాళ్లు మాత్రమే ఉంటారని జ్యోత్స్న ఉండదని చెప్తాడు. ఎవరైనా జ్యోత్స్న గురించి అడిగితే ఇదివరకు ఉండేదని ఇప్పుడు లేదని ఆ మనవరాలిని దీపలో చూసుకుంటున్నానని చెప్తాను అంటాడు. దీంతో జ్యో, పారిజాతం షాక్‌ అవుతారు.  దీప, కార్తీక్‌, దశరథ ఎమోషనల్‌ అవుతారు. పారిజాతం మాత్రం ప్రతి తప్పుకు ఒక క్షమాపణ ఉంటుంది కదండి అని చెప్పగానే..

జ్యోత్స్న చదివిన పాఠాలు వేరేగా ఉన్నాయి.. మనం ఎదగాలంటే ఎదుటి వాళ్లను తొక్కాలని అనుకుంటుంది. ఇలాంటి వాళ్లను క్షమించడం అంటే క్షమించడం అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. ఇలాంటి మనుషులను మనుషుల జాబితాలోంచి తీసేయడమే మేలు ఇప్పుడు నేను చేసేది ఇదే నా కుటుంబ సభ్యుల జాబితాలో ఇక మీద జ్యోత్స్న అనే మనిషిని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తను ఉన్నా లేనట్టే సూరజ్‌ ఏం జరిగిందో అందరికీ తెలిసేలా చేసినందుకు నా తరపు నుంచి నీకు థాంక్స్‌ చెప్తున్నాను అంటూ జ్యోత్స్నను కోపంగా చూస్తూ శివనారాయణ వెళ్లిపోతాడు.

Advertisement

సుమిత్ర కూడా శివనారాయణ బాగానే  చేశారు. ఇదే దీనికి సరియైన  శిక్ష అంటుంది. కాంచన మాత్రం శిక్ష అని మీరంటున్నారు కానీ జరగే ప్రతి దానికి బాధపడేది మేమే కదా దీప వెళ్లు అంటూ బాధపడుతుంది. కార్తీక్‌ కూడా సూరజ్‌ను వెల్లిపోమ్మని తర్వాత మాట్లాడుకుందాం అంటాడు. సూరజ్‌ అలాగే అంటాడు. సుమిత్ర కోపంగా దీన్ని మీరు ఎవ్వరూ కూడా మాట్లాడకండి అత్తయ్యగారు మీరు కూడా మాట్లాడకండి అంటూ చెప్పి వెళ్లిపోతుంది.  అందరూ వెళ్లిపోయాక సూరజ్‌, జ్యోత్స్నను చూసి బాధగా ఉందా..? మీరు ఉసిగొల్పిన కుక్కలు ఒక్కోసారి మిమ్మల్ని కూడా కరవొచ్చు అంటూ చెప్పి వెళ్లిపోతాడు. కోపంగా వెనకే వెళ్లిన జ్యోత్స్న సూరజ్‌ను కొడుతుంది. అయినా సూరజ్‌ నవ్వుతుంటాడు. దీంతో జ్యోత్స్న ఏంట్రా దెబ్బ తగలలేదా..? తిరిగి కొట్టలేవా..? అని అడగ్గానే..

కొట్టినందుకే కదా ఇంత దూరం వచ్చావు అంటాడు సూరజ్‌. దీంతో జ్యోత్స్న కోపంగా వార్నింగ్‌ ఇస్తుంది. నిన్ను చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తుంది. సూరజ్‌ మాత్రం జ్యోత్స్కు ఐ లవ్యూ చెప్తాడు. దీంతో జ్యోత్స్న షాక్‌ అవుతుంది. సూరజ్‌ మాత్రం థాంక్స్‌ చెప్పి వెళ్లిపోతాడు. ఇంతలో పారిజాతం వచ్చి ఏంటే వీడేమంటున్నాడు అని అడగ్గానే.. జ్యోత్స్న కోపంగా కొడితే థాంక్స్‌ చెప్తున్నాడు అనగానే.. పారిజాతం కోపంగా తేడాగాళ్లు అందరూ నీకే తగులుతారేంటే..? ఇన్ని రోజులు ఆ కార్తీక్‌ గాడు.. ఇప్పుడు వీడు అంటూ తిడుతుంటే.. అయినా వీడు ఉంటే కదా..? వీళ్లందరినీ ఏం చేయాలో ఆలోచిస్తాను.. అందరూ నన్ను వదిలేశారు కదా..? నేనేం చేయాలో నాకు తెలుసు అంటూ కోపంగా వెళ్లిపోతుంది జ్యోత్స్న.

Advertisement

కిచెన్‌లో ఉన్న కార్తీక్‌, దీపల దగ్గరకు వెళ్లిన జ్యోత్స్న తనను ఇంట్లో చెడ్డదాన్ని చేసి ఇంట్లోంచి వెళ్లగొట్టేలా చేయాలని చూస్తున్నారా..? అని అడగ్గానే.. కార్తీక్‌ నవ్వుతూ మేమేం నిన్ను చెడ్డదాన్ని చేయలేదు. నువ్వు చేసిన పనులన్నీ అందరి ముందు బయటపెట్టాము అంతే.. అని చెప్పగానే.. దీప దీనికి ఇవన్నీ అర్థం కావు బావ కానీ దీనిక థాంక్స్‌ చెప్పాలి అంటుంది. దేనికి థాంక్స్‌ అని కార్తీక్‌ అడగ్గానే.. దీని వల్లే నేను నా కుటుంబానికి దగ్గరయ్యాను కదా అందుకే అంటూ ఇద్దరూ కలిసి జ్యోత్స్న బుగ్గలు గిల్లితూ థాంక్స్‌ చెప్తారు. జ్యోత్స్న కోప్పడుతుంటే.. దీప కూల్‌గా త్వరలోనే నీ పెళ్లి కూడా చేస్తామని కార్తీక్‌, దీప చెప్పగానే.. జ్యో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

రూంలో కూర్చుని బాధగా ఆలోచిస్తున్న సుమిత్ర దగ్గరకు వెళ్లిన దీప, సుమిత్రను ఓదారుస్తుంది. పిల్లలు చేసే తప్పులకు అమ్మానాన్న జీవితాంతం బాధ్యత వహించలేరు అమ్మ అంటూ చెప్పగానే.. సుమిత్ర బాధగా జ్యోత్స్న చేసిన తప్పుకు తాను క్షమాపణ చెప్తున్నాను అనగానే.. దీప బాధపడుతుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×