E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode July 9th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  గుడిలో శివనారాయణకు షాక్ ఇచ్చిన మాలిని 

Karthika Deepam 2 Serial Today Episode July 9th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  గుడిలో శివనారాయణకు షాక్ ఇచ్చిన మాలిని 
Advertisement

Karthika Deepam 2 serial today Episode:  సూరజ్‌, జ్యోత్స్నకు ఫోన్‌ చేసి తన షర్ట్‌ ఉతకమని లేదంటే జ్యోత్స్న శారీ కాల్చేస్తానని బెదిరిస్తాడు. దానికి జ్యోత్స్న కోపంగా ఈ విషయం మా ఇంట్లో వాళ్లకు చెప్తాను అంటుంది. చెప్తే చెప్పు.. నేను కూడా చెప్తాను అంటూ సూరజ్‌ అనగానే.. ఏం చెప్తావు అని జ్యోత్స్న అడగ్గానే.. తన రూంలోకి పనిమనిషి ఎలా వచ్చింది. బయట నుంచి ఎవరు లాక్‌ చేసింది. ఎవరు క్యారియర్‌ బాక్స్‌ ఇచ్చింది అంతా తన దగ్గర ఫ్రూప్‌ ఉందని అదంతా ఇంట్లో వాళ్లకు చెప్తానని అంటాడు. సూరజ్‌ మాటలకు పారిజాతం భయపడుతుంది. వీడు ఇంకా ఆ విషయాలు మర్చిపోలేదు అంటూ భయపడుతుంది. జ్యోత్స్న మాత్రం ఏమైనా చేసుకోరా నేను నీ షర్ట్‌ ఉతకను అంటూ కాల్‌ కట్‌ చేస్తుంది.

శౌర్య హోం వర్క్‌ చేయకుండా కాలీగా కూర్చుని ఉంటుంది. ఎందుకు హోం వర్క్‌ చేయడం లేదని కాంచన అడిగితే తాను ఇక చదువుకోనని జాబ్‌ చేస్తానని చెప్తుంది. శౌర్య మాటలకు కాంచన, దీప, కార్తీక్‌ షాక్‌ అవుతారు. ఫోర్త్‌ క్లాస్‌ చదివే నీకు జాబ్‌ ఎవరిస్తారు అంటూ ప్రశ్నిస్తుంది కాంచన. శౌర్య మాత్రం మీ నాన్న ఇస్తారు అని చెప్తుంది. నీకెందుకు ఆయన జాబ్‌ ఇస్తాడని కాంచన అడిగితే ఎందుకు ఇవ్వడు.. ఫిఫ్త్‌ క్లాస్‌ చదివిన మా అమ్మకు సీఈవో జాబ్‌ ఇచ్చినప్పుడు ఫోర్త్‌ చదివిన నాకు కనీసం మేనేజర్‌ జాబ్‌ అయినా ఇవ్వడా..? అంటూ చెప్పగానే.. కాంచన కోపంగా ఇందుకే పిల్లలను పిల్లల దగ్గర ఉంచాలని చెప్పేది అంటూ కోప్పడుతుంది. శౌర్య మాత్రం తన స్కూల్‌ లో మిస్‌ కూడా మా అమ్మ సీఈవో అంటే నవ్వేసింది అందుకే నేను మేనేజర్‌ అవుదామని డిసైడ్‌ అయ్యాను అంటూ చెప్పగానే.. కాంచన తిడుతుంది. కార్తీక్‌ వెళ్లి పడుకోమని చెప్తాడు శౌర్య వెళ్లిపోతుంది.

Advertisement

మరోవైపు సూరజ్‌, పారిజాతం జంతికలు తింటుంటే జ్యోత్స్న షర్ట్‌ ఉతుకుతుంది. పారిజాతం మాత్రం పప్పు వలకడం ఏంటో జ్యోత్స్న షర్ట్‌ ఉతకడం ఏంటో అంటూ మాట్లాడుతుంటే.. పప్పు కావాలనే వలికింది. మీకు కన్ను కొట్టి వెంటనే పప్పు నా మీద వేసింది కదా అంటూ సూరజ్‌ చెప్పగానే.. పారిజాతం షాక్‌ అవుతుంది. అదేం లేదు బాబు కంట్లో ఏదో నలక పడితే అలా అన్నాను అంతే అని కవర్‌ చేసుకుంటుంది. సరేలేండి అది వదిలేయండి.. మీకు జ్యోత్స్న గారు కన్ను కొట్టలేదు.. నేను చూడలేదు.. కానీ షర్ట్‌ మంచిగా ఉతికి శారీ తీసుకోమనండి.. అంటాడు.   జ్యోత్స్న షర్ట్‌ ఉతికాను చూసుకో అంటూ సూరజ్‌ రూంలోకి వెళ్లి శారీ తీసుకుని వెళ్తుంది. షర్ట్‌ చినిగిపోయి ఉంటుంది అది చూస్తున్న సూరజ్‌ దగ్గరకు వెళ్లిన జ్యోత్స్న దెబ్బ అదుర్స్‌ కదూ అంటూ వెళ్లిపోతుంది.

కాంచను శ్రీధర్‌ వీడియో మెసేజ్‌ చేస్తాడు. కాంచన ఓపెన్‌ చేయగానే.. అందులో శ్రీధర్‌ తన ఆపరేషన్‌ సక్సెస్‌ అయిందని.. చాలా బాగున్నానని రేపే ఇండియా వస్తున్నానని ఉంటుంది. అది చూసిన కాంచన చాలా సంతోషంగా హ్యాపీగా ఫీలవుతుంది. కార్తీక్‌, దీప కూడా చాలా హ్యాపీగా ఫీలవుతారు. కాంచన రేపు అందరూ ఇంట్లోనే ఉండాలని చెప్తుంది. కార్తీక్, దీప సరే అంటారు.

Advertisement

మరుసటి రోజు గుడికి వెళ్తారు శివనారాయణ, పారిజాతం, సుమిత్ర, కార్తీక్‌, సూరజ్‌. అక్కడ జరుగుతున్న అన్నదానం చూసి ఆశ్చర్యపోతారు. ఇంత గ్రాండ్‌గా అన్నదానం ఎవరు చేస్తున్నారు అంటూ పూజారిని అడుగుతూ.. చాలా బాగా చేస్తున్నారు ఇంతకీ ఎవరతను అంటూ పూజారిని అడిగితే చెప్పడం ఎందుకు అక్కడ హోమం చేస్తున్నారు చూడండి అని చూపించగానే.. అక్కడ దక్షిణమూర్తి, మాలిని హోమం చేస్తున్నారు. వాళ్లను చూసిన శివనారాయణ, సుమిత్ర, పారిజాతం, కార్తీక్‌ వాళ్లు షాక్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×