E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode July 6th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  అందరి ముందు ఇంట్లోనే సూరజ్ ను కొట్టిన శివనారాయణ   

Karthika Deepam 2 Serial Today Episode July 6th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  అందరి ముందు ఇంట్లోనే సూరజ్ ను కొట్టిన శివనారాయణ   
Advertisement

Karthika Deepam 2 serial today Episode: సూరజ్‌ ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తూ.. జ్యోత్స్న దగ్గరకు వెళ్లి హాయ్‌ డియర్‌ ఎలా ఉన్నావు అని అడగ్గానే.. జ్యోత్స్న కోపంగా తిట్టుకుంటూ.. మనసులో మాత్రం నీ కథ చెప్తాను అని అనుకుంటూ సూరజ్‌ అంటూ గౌరవంగా పిలుస్తుంది. దీంతో సూరజ్‌ షాక్‌ అవుతాడు. నన్నే పిలుస్తున్నావా…? అంటూ అడగ్గానే.. అవును  నిన్నే పిలుస్తున్నాను అనగానే.. సూరజ్‌ ఏంటో చెప్పు అనగానే.. ఇంత వర్క్‌ ఇచ్చారు కదా..? నాకు హెల్ప్‌ చేయవా..? అని అడుగుతుంది. సూరజ్‌ సరే అంటూ హెల్ప్‌ చేస్తుంటే.. భలే దొరకావురా బకరాలా..? అంటూ ఫోన్‌ చూస్తుంది. దీంతో సూరజ్‌ నేను హెల్ప్‌ చేస్తాను అన్నాను.. నిన్ను ఫోన్‌ చూడమనలేదు అనగానే.. హెల్ప్‌ చేస్తాను అని మళ్లీ ఈ మెలికేంటి అంటుంది జ్యోత్స్న. ఎవరికి ఎలా బుద్ది చెప్పాలో నాకు బాగా తెలుసు అనుకుంటూ పని చేస్తాడు.

మరుసటి రోజు ఫైళ్లు అన్ని తీసుకెళ్లి శివనారాయణకు ఇచ్చిన జ్యోత్స్న వర్క్‌ అంతా కంప్లీట్‌ చేశాను అని చెప్తుంది. ఫైళ్లు చెక్‌ చేస్తున్న శివనారాయణ టిఫిన్‌ చేశావా అమ్మ అని అడగ్గానే.. జ్యోత్స్న చేశాను తాత అంటుంది. శివనారాయణ వెటకారంగా నిన్న అడిగింది దీపను అంటాడు. దీంతో దీప షాక్‌ అవుతుంది. జ్యోత్స్న కూడా షాక్‌ అవుతూ.. తాత లోపల మార్పు బాగానే కనిపిస్తుంది అని మనసులో అనుకుంటుంది. ఇంతలో శివనారాయణ ఫైల్స్‌ చూస్తూ.. తప్పుగా వర్క్‌ చేశావని బ్రాంచ్‌ కోడ్‌ అడుగుతాడు. బ్రాంచ్‌ కోడ్‌ కూడా జ్యోత్స్న తప్పు చెప్తుంది. అదే విషయం దీపను అడిగితే దీప కరెక్టుగా చెప్తుంది. దీంతో శివనారాయణ నీ మట్టి బుర్రకు ఏం తెలియదా..? నువ్వు చదువుకున్న డిగ్రీ తీసుకెళ్లి డస్ట్‌ బిన్‌లో వేయ్‌ అంటాడు. మిగతా ఫైల్స్‌ చూస్తూ.. నువ్వే చూడు ఎన్ని తప్పులు ఉన్నాయో.. అంటూ తిడుతుంటాడు.

Advertisement

జ్యోత్స్న మాత్రం సూరజ్‌ గాడు బాగానే చేశాను అన్నాడు.. వీడు నన్ను ఇలా ఇరికించాడా..? అని సూరజ్‌ను తిట్టుకుంటుంది. శివనారాయణ కోపంగా తిడుతుంటే.. పారిజాతం అడ్డు పడుతుంది. పారిజాతాన్ని కూడా తిడుతూ కాఫీ తీసుకురాపో అంటాడు. పారిజాతం వెళ్లి కాఫీ తీసుకొచ్చి ఇవ్వగానే.. తనకు కాదని.. దీపకు ఇవ్వమని చెప్తాడు. ఆ మాటకు దీపతో పాటు అందరూ షాక్‌ అవుతారు. అప్పుడే సూరజ్‌ వచ్చి మరిన్ని రెచ్చగొట్టే మాటలు చెప్తూ.. జ్యోత్స్నను మరింత రెచ్చగొడతాడు. దీంతో శివనారాయణ మరింత కోపంగా తిడుతూ.. ఇవి కూడా కరెక్టుగా చేయకపోతే.. అంటూ ఆపేస్తాడు.. పారిజాతం చేయకపోతే అని అడగ్గానే.. శివనారాయణ కోపంగా చెప్పను అంటూ వెళ్లిపోతాడు.  సూరజ్‌ ఫైల్స్‌ తీసుకుని వెళ్లిపోతాడు. వెనకే జ్యోత్స్న వెళ్లి సూరజ్‌ను తిడుతుంది. కావాలనే నన్ను ఇరికించావు కదా..? అంటూ నిలదీస్తుంది. సూరజ్‌ గట్టిగా కౌంటర్‌ ఇచ్చి వెళ్లిపోతాడు.

తర్వాత రెస్టారెంట్‌ ఓనర్స్‌ మీటింగ్‌ ఉందని సిటీలోని రెస్టారెంట్‌ ఓనర్లు శివనారాయణ ఇంటికి వస్తారు. వాళ్లందరికీ దీప తమ కొత్త సీఈవో అని పరిచయం చేస్తాడు శివనారాయణ. దీంతో జ్యోత్స్న, పారిజాతం షాక్‌ అవుతారు. అందరికీ కూల్‌డ్రింక్స్‌ తీసుకురమ్మని శివనారాయణ చెబితే వద్దని డైరెక్ట్‌ పాయింట్‌ వస్తామని ఈ సంవత్సరం బెస్ట్‌ రెస్టారెంట్‌ పోటీ పెడుతున్నామని.. ఈసారి కొత్త రెస్టారెంట్‌ పోటీలోకి వస్తుందని చెప్తారు. కొత్త రెస్టారెంటా..? ఎవరిది అని శివనారాయణ అడగ్గానే.. నాదే అంటూ అక్కడకు దక్షిణమూర్తి వస్తాడు. దక్షిణమూర్తిని చూసిన శివనారాయణ కోపంతో రగిలిపోతుంటే..  దక్షిణమూర్తి వచ్చి మీ రెస్టారెంట్‌కు ఎదురుగానే నేను రెస్టారెంట్‌ ఓపెన్ చేశాను.. సౌత్‌ ఇండియన్స్‌ బెస్ట్‌ చెఫ్స్‌ మా దగ్గర ఉన్నారు.. అందుకే ఈ పోటీలో పాల్గొన్నాలని మేము నిర్ణయించుకున్నాము అని చెప్పగానే.. ఇద్దరి మధ్య మాటల యుద్దం మొదలవుతుంది.

Advertisement

ఇద్దరు మాట్లాడుకుంటుండగానే.. దక్షిణమూర్తి ఎవరికోసమో ఇళ్లంతా చూస్తుంటాడు. శివనారాయణ అనుమానంగా వీడు చూపు వెతికేది సూరజ్‌ కోసమేనా అని అనుమానపడతాడు. తర్వాత రెస్టారెంట్‌ ఓనర్స్‌ వెళ్లిపోయాక దక్షిణమూర్తి అలాగే ఉంటాడు. ఇంతలో శివనారాయణ సూరజ్‌ను పిలిచి కొడతాడు. కొట్టి దక్షిణమూర్తి వైపు చూసి ఇక మీరు వెళ్లొచ్చు అని చెప్పగానే.. దక్షిణమూర్తి వెళ్లిపోగానే.. కార్తీక్‌ భయంగా సూరజ్‌ ఎందుకు కొట్టావని అడుగుతాడు. దీంతో సూరజ్‌ తాను చెప్తానని సార్‌ అనుమానం తీర్చుకోవడానికి నన్ను కొట్టారు అంతేనా సార్‌ అనగానే. శివనారాయణ అవును అంటాడు. తనకు దక్షిణమూర్తికి ఏదైనా రిలేషన్‌ ఉందేమోనని తెలుసుకోవడానికి నన్ను కొట్టారు అని సూరజ్‌ చెప్పగానే.. శివనారాయణ సారీ చెప్తాడు. ఇప్పుడ అనుమానం తీరింది అంటూ చెప్తాడు. సూరజ్‌ వెళ్లిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×