E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode July 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ ను అనుమానించిన శివనారాయణ   

Karthika Deepam 2 Serial Today Episode July 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ ను అనుమానించిన శివనారాయణ   
Advertisement

Karthika Deepam 2 serial today Episode: జ్యోత్స్న, సూరజ్‌ స్కూటీ మీద ఆఫీసుకు వెళ్తుంది. సూరజ్‌ తాను చెప్పింది ఏమైందని అడుగుతాడు. దీంతో జ్యోత్న్స కోపంగా తిడుతూ.. నేనేం చేయాలో నాకు తెలుసు.. నన్ను బలవంతంగా ఏదో మాట్లాడకు అంటుంది. జ్యోత్స్న స్కూటీ మీద తిరిగి కూర్చుని వెళ్తుంటే.. పక్క నుంచి బైక్‌ మీద వెళ్తున్న ఒక వ్యక్తి ఏంటి మొగుడు పెళ్లాల గొడవ.. నాకు తెలిసి ఒక లాయరు ఉన్నాడు మాట్లాడాలా..? అంటాడు. జ్యోత్స్య ఆ వ్యక్తిని తిడుతుంది. కొంత దూరం వెళ్లాక జ్యోత్స్న స్కూటీ ఆపమని చెప్పి తనకు దాహంగా ఉందని వాటర్‌ బాలిల్‌ తీసుకురమ్మని చెప్తుంది. వాటర్‌ కోసం సూరజ్‌ వెళ్లగానే.. పిన్ను తీసి చూస్తూ.. నీ తిక్క ఎలా కుదుర్చాలో నాకు తెలుసు అనుకుంటుంది. ఇంతలో సూరజ్‌ వచ్చి స్కూటీ స్టార్ట్‌ చేయబోతే ముందరి టైర్‌ పంక్చర్‌ అయి ఉంటుంది. దీంతో జ్యోత్స్నను స్కూటీ మీద కూర్చోబెట్టుకుని స్కూటీ నెట్టుకుంటూ వెళ్తుంటాడు సూరజ్‌.

ఆఫీసులో దీప, కార్తీక్ లు ఇద్దరూ కూర్చుని ఆఫీసు విషయాలు మాట్లాడుకుంటుంటారు. సూరజ్‌, జ్యోత్స్న ఇంకా ఎందుకు రాలేదని అనుకుంటారు. జ్యోత్న్స, సూరజ్‌ను ఎంత ఇబ్బంది పెడుతుందోనని దీప అంటే.. బ్రదర్‌ అంత దూరం రానివ్వడులే అంటాడు కార్తీక్‌. ఇంతలో జ్యోత్స్న, సూరజ్‌ వస్తారు. స్కూటీ దిగిన జ్యోత్స్న తన బ్యాగులోంచి ఐదు వందలు తీసి సూరజ్‌కు ఇచ్చి వెళ్లిపోతుంది.. జ్యోత్స్న వెళ్లిపోతుంటే.. తన బ్యాగులోంచి లిప్‌స్టిక్‌ కింద పడిపోతుంది. అది కూడా సూరజ్‌ తీసుకుని అన్ని అర్థం అయ్యేలా చెప్తాను జ్యోత్స్న నీకు అనుకుంటాడు సూరజ్‌. ఆఫీసులోకి వచ్చిన జ్యోత్స్ను కార్తీక్‌ పలకరించగానే.. జ్యోత్స్న కోపంగా మాట్లాడి వెళ్లిపోతుంది. దీంతో కార్తీక్‌ చూస్తుంటే.. దారిలో ఏదో జరిగినట్టు ఉంది అని దీపకు చెప్తుంటాడు. అప్పుడే సూరజ్‌ లోపలికి రాగానే.. కార్తీక్‌ హాయ్‌ బ్రదర్‌ దారిలో ఏవో అద్బుతాలు జరిగాయట ఏం జరిగాయి అని అడగ్గానే.. సూరజ్‌ ఆవిడ గురించి నాతో మాట్లాడకండి బ్రదర్‌ నాకు చాలా పనులు ఉన్నాయి అంటూ వెళ్లిపోతుంటే..

Advertisement

కార్తీక్‌ బ్రదర్‌ ఆగు అంటూ దగ్గరకు వెళ్లి ఆ రెడ్‌ సింబల్‌ ఏంటి..? అని అడగ్గానే.. ఏంటోలే బ్రదర్‌ అనగానే.. కార్తీక్‌ వెంటనే జ్యోత్స్నను నువ్వు సూరజ్‌ స్కూటీ మీద వెనక కూర్చున్నావు కదా అని అడుగుతాడు. స్కూటీ మీద వెనక కాకపోతే ముందు కూర్చుంటారా..? దీప దొరికిపోయారు త్వరగా రా అంటూ పిలుస్తాడు. సూరజ్‌ ఆశ్చర్యంగా ఏంటి బ్రదర్‌ అని అడగ్గానే.. దీన్నే ఇంగ్లీష్‌లో కిస్‌ అంటారు తెలుగులో ముద్దు అంటారు.. ఎందుకు లేట్‌ అయిందో.. ఇప్పుడు మాకు అర్థం అయింది. ఎలాగూ.. లేట్‌ అయింది ఏదో ఒక పార్క్‌కు వెళ్లి రావాల్సింది అనగానే.. జ్యోత్స్న కోపంగా సూరజ్‌ మా బావ ఏం చెప్తున్నాడో వింటున్నావా..? అసలు ఏం జరిగింది చెప్పు అనగానే.. సూరజ్‌ సిగ్గుపడుతుంటాడు. కార్తీక్‌ మాత్రం బ్రదర్‌ మీరు దొరికిపోయారు.. మేమైతే విషయం ఎవ్వరికీ చెప్పం కానీ మాకు పార్టీ కావాలి అని అడగ్గానే.. జ్యోత్స్న కోపంగా సూరజ్‌ను తిడుతుంది. సూరజ్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వెనకే జ్యోత్స్న కూడా వెళ్లిపోతుంది. దీప ఏమైంది బావ అని కార్తీక్‌ను అడిగితే.. జ్యోత్స్నను ఏడిపించడానికి మనోడు ఏదో ట్రై చేశాడు అని చెప్తాడు. సూరజ్‌ వెనకాలే వెళ్లిన జ్యోత్స్న కోపంగా తిడుతుంది. సూరజ్‌ లిప్‌స్టిక్‌ ఇస్తాడు. అది చూసి జ్యోత్స్న షాక్‌ అవుతుంది.

జ్యోత్స్నతో దీప మాట్లాడుతుంటే.. దక్షిణమూర్తి మనవరాలా అనుకుంటూ వస్తాడు. దక్షిణమూర్తిని చూసిన దీప, జ్యోత్స్న షాక్‌ అవుతారు. మీరు ఇక్కడికి వచ్చారేంటని దీప అడిగితే.. దక్షిణమూర్తి తాను తన మనవరాలి కోసం వచ్చానని చెప్తాడు. జ్యోత్స్నను క్యాబిన్‌లో కాకుండా ఇక్కడెందుకు ఉన్నావని అడుగుతాడు. జరిగింది చెప్తాడు ఆఫీస్‌ బాయ్‌. దక్షిణమూర్తి కోపంగా నా మనవరాలు, కాంచన కోడలికి అసిస్టెంట్‌గా ఉండటం ఏంటి..? అంటూ కోప్పడుతుంటే.. అప్పుడే శివనారాయణ వస్తాడు. దక్షిణమూర్తిని తిడతాడు.. మళ్లీ ఎందుకు వచ్చావని అడుగుతాడు. దీంతో మాట్లాడాలని వచ్చాను అంటూ చెప్పగానే.. దక్షిణమూర్తిని తన చాంబర్‌లోకి తీసుకెళ్తాడు. ఇద్దరి మధ్య మాటల యుద్దం జరుగుతుంది. శివనారాయణకు పోటీగా రెస్టారెంట్‌ బిజినెస్‌ స్టార్ట్‌ చేస్తున్నట్టు దక్షిణమూర్తి చెప్పి వెళ్లిపోతాడు. శివనారాయణ అనుమానంగా నా దగ్గర పని చేసేవాళ్లు ఎవరైనా వీడి కోసం పని చేస్తున్నారా..? అనుకుంటూ అనుమానంగా బయటకు వెళ్తుంటే.. బయట సూరజ్‌తో దక్షిణమూర్తి మాట్లాడుతుంటాడు. వాళ్లిద్దరి చూసిన శివనారాయణ షాక్‌ అవుతాడు. సూరజ్‌, దక్షిణమూర్తితో మాట్లాడి ఆఫీసులోకి వస్తుంటే.. శివనారాయణ నువ్వు దక్షిణమూర్తి మనిషివా..? అని అడుగుతాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×