E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   
Advertisement

Karthika Deepam 2 serial today Episode: వంటల పోటీలో దీపతో జ్యోత్స్న చేయి కలుపుతుంది. ఇద్దరూ కలిసి కుకింగ్‌ చేస్తుంటారు. అది చూసిన కార్తీక్‌, పారిజాతం, షాక్‌ అవుతారు. సూరజ్‌ మాత్రం ఎవరిని ఎవరితో కలపాతో తనకు బాగా తెలుసని మనసులో అనుకుంటాడు. అప్పుడే శివనారాయణకు ఫోన్‌ రావడంతో బయటకు వెళ్తాడు. సూరజ్‌, కార్తీక్‌ దగ్గరకు వెళ్తాడు.

అయితే సూరజ్‌ అక్కడే సీటులో ఉన్నాడనుకున్న పారిజాతం మెల్లగా దగ్గరకు జరిగి సూరజ్‌ను తిడుతుంది. అక్కడ సూరజ్‌ లేడన్న విషయం పారిజాతానికి తెలియదు. అయినా ఏమీ సమాధానం చెప్పడం లేదేంట్రా వెధవా అంటూ తిడుతుంటే.. శివనారాయణ వచ్చి నిలబడి చూస్తుంటాడు. పారిజాతం సూరజ్‌ను తిడుతూ  ఈ పోటీలో మనం గెలుస్తామనుకున్నావా..? అసలు గెలవము.. ఓడిపోతాం చిత్తుచిత్తుగా ఓడిపోతామని అంటుంది. ఆ మాటలకు శివనారాయణ కోపంగా పారిజాతం అంటాడు. తిరిగి శివనారాయణను చూసిన పారిజాతం భయంతో వణికిపోతుంది. శివనారాయణ కోపంతో పారిజాతాన్ని తిడతాడు.

Advertisement

ఇంతలో కుకింగ్‌ టైం అయిపోయిందని చెప్పగానే..  అందరూ కుకింగ్‌ ఆపేస్తారు. టైంలోపే దీప కూడా కుకింగ్‌ చేస్తుంది. ఇక జడ్జెస్‌ వెళ్లి వంటలు టేస్ట్‌ చేస్తారు. ఫస్ట్‌ రౌండ్‌లో ఇద్దరూ సమానంగా పాయిట్స్‌ తెచ్చుకుంటారు. రెండో రౌండ్‌లో ఒక జడ్జికి మాలిని రెస్టారెంట్‌ వాళ్ల కుకింగ్‌ నచ్చితే ఇంకొక జడ్జికి దీప వంటలు నచ్చుతాయి. ఇక మూడో జడ్జి తీర్పు కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. మూడో జడ్జి మరోసారి టెస్ట్‌ చేసి తన ఒపీనియన్‌ చెప్తాను అనడంతో అందరూ మరింత టెన్షన్‌గా చూస్తుంటారు. ఇద్దరి కుకింగ్‌ టేస్ట్‌ చేసిన మూడో జడ్జి దీప వంటలే బెస్ట్‌గా ఉన్నాయని ఈ పోటీలో జ్యోత్స్న రెస్టారెంట్‌ విజయం సాధించిందని చెప్పగానే.. కార్తీక్‌, దీప, జ్యోత్స్న, సుమిత్ర, శివనారాయణ, సూరజ్‌ ఎగిరి గంతేసినంత ఆనందపడతారు. అందరూ ఒకరినొకరు అభినందించుకుంటారు. తర్వాత ట్రోపీ ప్రధానం మాలిని చేతుల మీదుగా జరుగుతుంది. దీప, జ్యోత్స్న వెళ్లి ట్రోపీ తీసుకుంటారు.

తర్వాత సూరజ్‌ వెళ్లి జ్యోత్స్నను అభినందిస్తాడు. ఇదే నిజమైన సంతోషం అంటూ చెప్పగానే.. జ్యోత్స్న కూడా తాను చాలా హ్యాపీగా ఉన్నట్టు జీవితంలో ఎప్పుడూ ఇలా ఉండలేదు అన్నట్టు నటిస్తుంది. జ్యోత్స్న మాటలకు సూరజ్‌ నిజంగా నమ్మి.. ఈ పోటీలో గెలిపిస్తే.. నేను అడిగింది ఇస్తానన్నావు.. ఇప్పుడు అడగమంటావా..? నేను అడిగింది ఇస్తావా..? అంటూ సూరజ్‌ అడగ్గానే.. వెళ్లి అడుగు అంటుంది జ్యోత్స్న సూరజ్‌ ఆశ్చర్యంగా వెళ్లి అడగడమేంటి..? ఎవరిని అడగాలి అనగానే.. అదే దీపను గెలిపించావు కదా వెళ్లి దీపనే వెళ్లి అడుగు అని చెప్తూ.. జ్యోత్స్న కోపంగా సూరజ్‌ను తిట్టి వెళ్లిపోతుంది.

Advertisement

ఇంట్లో శివనారాయణ తన దగ్గర దీప, జ్యోత్స్నను కూర్చోబెట్టుకుని ఇద్దరినీ అభినందిస్తాడు. ఈ గెలుపు ఏ ఒక్కరిదో కాదు అందరిదీ నేను పెట్టుకున్న నమ్మకాన్ని నా దీప కాపాడింది. తన మీద నమ్మకాన్ని జ్యోత్స్న సంపాదించుకుంది అంటూ ఎమోషనల్‌ అవుతాడు. కార్తీక్‌ వెంటనే వీళ్లు పోటీలోకి దిగకపోతే మీరు పోటీలోకి దిగుతానని చెప్పారు.. అంటే మీరు వంటలు బాగా చేస్తారా..? తాత అనగానే.. అవన్నీ ఇప్పుడు ఎందుకులే మీకోసం పార్టీ ఏర్పాటు చేశాను ఎంజాయ్‌ చేయండి అంటూ శివనారాయణ వెళ్లిపోతాడు. సుమిత్ర లోపలికి వెళ్లి దీప, కార్తీక్‌ను పిలుస్తుంది. ఇద్దరూ లోపలికి వెళ్లిపోయాక జ్యోత్స్నను పారిజాతం నువ్వు దీపతో కలిసిపోయావా..? అంటూ అడగ్గానే.. తాత కోసం అలా నటించానని జ్యోత్స్న చెప్తుంది. సూరజ్‌ జ్యోత్స్నను పిలిస్తే కోపంగా బయటకు వెళ్లిపోతుంది జ్యోత్స్న వెనకే వెళ్లిన సూరజ్‌ కోపంగా జ్యోత్స్ను తిడుతూ.. ఈ గెలుపు నీకు ఎంత గౌరవం తీసుకొచ్చిందో తెలుసా..? అంటూ చెప్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×