E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode July 1st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీపకు అసిస్టెంట్ గా జ్యోత్స్న  నియామకం  

Karthika Deepam 2 Serial Today Episode July 1st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీపకు అసిస్టెంట్ గా జ్యోత్స్న  నియామకం  
Advertisement

Karthika Deepam 2 serial today Episode: కంపెనీ సీఈవో గా సెలెక్ట్‌ అయిన దీపకు జ్యోత్స్నను అసిస్టెంట్‌గా ప్రకటిస్తాడు శివనారాయణ. దీంతో పారిజాతం, జ్యో షాక్‌ అవుతారు. దీపకు జ్యోత్స్న అసిస్టెంట్‌ ఏంటి..? అని శివనారాయణను అడిగితే.. శివనారాయణ కోపంగా నువ్వు నోరు మూసుకుని ఉండకపోతే  నీ కోసం కూడా పెద్ద లిస్ట్‌ ఉంది రెడీ చేయమంటావా అంటాడు. దీంతో పారిజాతం సైలెంట్‌ అవుతుంది. ఇంతలో జ్యోత్స్నకు అసిస్టెంట్‌గా శివనారాయణ ఇచ్చిన కండీషన్స్‌ కార్తీక్‌ చదువుతుంటాడు. పారిజాతం, జ్యోత్స్న షాక్‌ అవుతారు. జ్యోత్స్నకు జీతం ఎంత ఇవ్వాలి అనే విషయం కూడా దీపే నిర్ణయిస్తుంది అని నియమం ఉందని చదువుతాడు.

దీంతో పారిజాతం మనసులో కోపంగా జీతం లేని పనిమనిషికి.. జీతం ఉన్న  పనిమనిషి అయింది నా మనవరాలు.. కర్మ అని బాధపడుతుంది. మిగతా నియమ, నిబంధనలు చదువుతుంటాడు కార్తీక్‌. ఒకవేళ ఈ నియమ నిబంధనలు నచ్చకపోతే జ్యోత్స్న ఆఫీసు నుంచి వెళ్లిపోవచ్చు.. అయితే ఆఫీసు నుంచి వెళ్లిపోతే ఇంట్లో కూడా స్థానం ఉండదు.. అని చెప్తాడు. దీంతో శివనారాయణ విన్నావు కదా..? అవన్నీ నీకు సమ్మతమేనని సంతకం పెట్టు లేదంటే బయటకు వెళ్లు అనగానే.. పారిజాతం బాధగా మనవరాలికి మరీ ఇంత కఠినమైన శిక్ష వేయడం తప్పండి అంటుంది.  శివనారాయణ మాత్రం సంతకం పెడతావా..? వెళతావా..? అని అడగ్గానే.. జ్యోత్స్న సంతకం పెడుతుంది. సవాల్‌ను స్వీకరిస్తున్నాను. అని చెప్పగానే.. శివనారాయణ గుడ్‌ ఈరోజు నుంచే బాధ్యతలు తీసుకోవచ్చు అంటూ కార్తీక్‌ను తీసుకుని వెళ్లిపోతాడు.

Advertisement

తర్వాత కోపంగా క్యాంటీన్‌లోకి వెళ్లి కూర్చుంటుంది జ్యోత్స్న వెనకాలే వెళ్లిన సూరజ్‌ ఏంటి సీఈవోగారు.. సారీ సీఈవో గారి డీఏ గారు ఏంటి ఆలోచిస్తున్నారు.. అంటూ వెటకారంగా మాట్లాడుతూ.. ఒక్క తప్పు నీ పొజిషన్‌ను మార్చేసింది. ఒక సంతకం నీ తలరాతనే మార్చేసింది. కాళ్లు నేలమీద వదిలేసి ఆకాశంలో ఎగురుతున్నట్టు ఫీలయ్యావు.. ఇప్పుడు రెక్కలు తెగిన పక్షిలా పాతాళంలోకి పడిపోయావు.. అంటూ చెప్తుంటే.. జ్యోత్స్న కోపంగా సూరజ్‌ ఎవ్వర్రా నన్ను ఆపేది అంటుంది. దీంతో సూరజ్‌ కూడా నువ్వేనే నిన్ను ఆపుకునేది. నీ అహంకారం, నీ పొగరు, నీ బలుపు ఇవన్నీ మమ్మల్ని కొంతకాలం ఇబ్బంది పెట్టొచ్చు  కానీ నిన్ను పూర్తిగా నాశనం చేస్తాయి అనగానే.. జ్యోత్స్న కోపంగా చెప్పావు కానీ వెళ్లిపోరా..? మా గ్రానీ చేసిన చిన్న తప్పు నన్ను ఆఫీసులో అసిస్టెంట్‌ను చేసింది. నన్ను ఎంత కసిగా తొక్కాలనుకుంటే అంత పైకి ఎదుగుతాను అంటూ చెప్తుంటే.. ఇలాగే ఉంటే ఇక దిగజారిపోతావు అని చెప్తుండగానే..

కార్తీక్‌ ఫోన్‌ చేసి డీఏను ఇక్కడకు తీసుకురా సీఈవో పిలుస్తున్నారు అని చెప్తాడు. సూరజ్‌ అదే విషయం జ్యోత్స్నకు చెబితే రాకపోతే ఏం చేస్తుంది అని అడిగితే కండీషన్స్‌ తెలుసు కదా అంటాడు సూరజ్‌. దీంతో జ్యోత్స్న దీప దగ్గరకు వెళ్తుంది. ఎందుకు పిలిచారు అని కార్తీక్‌ను అడుగుతుంది. నీ కుర్చీలో కూర్చుని పని మొదలుపెట్టు అనగానే.. దీప దగ్గరకు వెళ్తుంటే.. అక్కడ కాదు నీ కుర్చీ అంటూ బయట చూపిస్తాడు కార్తీక్‌. ఈరోజు నుంచి నువ్వు సీఈవో గారికి అసిస్టెంట్‌ కానీ నీకు ఎవ్వరూ అసిస్టెంట్‌ ఉండరు అని చెప్తాడు. మరి కాఫీ, టీలు బ్రదర్‌ అంటూ సూరజ్‌ అడిగితే.. కార్తీక్‌ ఏదో చెప్పబోతుంటే.. దీప బెల్‌ మోగిస్తుంది. కార్తీక్‌ వెంటనే డీఏ గారు వెళ్లండి బెల్‌ సౌండ్‌ వినిపిస్తుంది కదా..? సీఈవో గారు అవసరం ఉన్నప్పుడు ఈ బెల్‌ మోగిస్తారు అని చెప్పగానే.. పారిజాతం కోపంగా ఈ బెల్‌ ఐడియా ఇచ్చింది ఎవరు..? అని అడిగితే.. సూరజ్‌ నేనే ఇచ్చాను అంటూ చెప్తాడు. కార్తీక్‌ మాత్రం డీఏ గారు బెల్‌ రెండు సార్లు మోగితే వెళ్లాలి లేదంటే చైర్మన్‌ గారి నుంచి కాల్‌ వస్తుంది. అని చెప్పగానే..

Advertisement

జ్యోత్స్న కోపంగా దీప దగ్గరకు వెళ్లి ఎందుకు పిలిచావు అని అడుగుతుంది. దీప కూల్‌గా ఈ బెల్‌ పని చేస్తుందా లేదా అని నొక్కాను అంటుంది. జ్యోత్స్న కోపంగా వెళ్లిపోతుంటే.. కార్తీక్, దీప బెల్‌ నొక్కుతూ.. జ్యోత్స్ను ఆటపట్టిస్తారు. దీప మళ్లీ బెల్‌ నొక్కగానే.. జ్యోత్స్న వస్తుంది. ఈ సారి మాత్రం పనుండే బెల్‌ నొక్కాను అంటుంది. ఏంటో చెప్పండి అని జ్యోత్స్న అడగ్గానే.. ఒక్కటి తగ్గింది అంటుంది దీప. అప్పుడే ఆఫీస్ బాయ్‌ వచ్చి మేడం కాఫీ అంటాడు. దీప ఇప్పుడు అర్థం అయిందా..? ఆ ఒక్కటి ఏంటో..? అనగానే.. సరే చెప్పండి మేడం అంటుంది జ్యోత్న్స. దీంతో దేవుడికి దండం పెట్టుకుని పని మొదలు పెట్టు అని దీప చెప్పగానే.. జ్యోత్స్న వెళ్లిపోతుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×