E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode July 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ కోసం వేసిన ఐడియాకు తామే బలైన పారు, జ్యో

Karthika Deepam 2 Serial Today Episode July 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ కోసం వేసిన ఐడియాకు తామే బలైన పారు, జ్యో
Advertisement

Karthika Deepam 2 serial today Episode:  బయట ఉన్న పారిజాతం దగ్గరకు వెళ్లిన జ్యోత్స్న సూరజ్‌ గాడిని ఇంట్లోంచి వెళ్లగొట్టేందుకు ఐడియా చెప్తానన్నావు ఏదైనా ఆలోచించావా..? అంటూ అడగ్గానే.. ఆలోచించాను అని పారిజాతం చెబితే ఏం ఆలోచించావు చెప్పు అంటూ జ్యోత్స్న అడిగితే అందరూ ఐడియా చెప్పాక చేస్తారు.. నేను అమలు చేశాక ఐడియా చెప్తాను.. అంటూ కారు బ్రేకులు ఊడబీకాను.. అని బ్రేకులు చూపిస్తుంది పారిజాతం. ఎలా తీశావు అంటూ జ్యోత్స్న అడిగితే యూట్యూబ్‌లో వీడియోలు చూసి తీసేశాను అని పారు చెప్తుంది. అంటే ఇప్పుడు ఈ కారుకు బ్రేకులు లేవు నడిపితే పోతారు అని ఇద్దరు సంతోషిస్తారు. ఆ సూరజ్‌ గాడిని ఈ కారు డ్రైవ్‌ చేసేలా చేయాలి అప్పుడే యాక్సిడెంట్‌ అవుతుంది. పోతే ప్రాణాలు పోతాయి.. లేదంటే కాలో చేయ్యో పోతాయి.. ఇప్పుడు సూరజ్‌ గాడిని కారు ఎక్కించాలి. ఇదే మన తక్షణ కర్తవ్యం అని ఇద్దరూ డిసైడ్‌ అవుతారు.

అనసూయ, దీపను టిఫిన్‌ చేయమని చెబితే దీప ఫోన్‌లో బిజీగా ఉంటుంది. తర్వాత చేస్తాను అత్తయ్య అని చెప్తుంది. అనసూయ మీ అమ్మ చాలా బిజీ అయిపోయింది అంటూ శౌర్యతో చెబితే మా అమ్మ ఏమైనా నీలాగా కాలీగా కూర్చుందా ఏంటి..? కంపెనీకి సీఈవో ఇప్పుడు అంటూ చెప్తుంటే.. అప్పుడే కార్తీక్‌ వస్తాడు. కార్తీక్‌తో అనసూయ నీ భార్య చాలా బిజీ అయిపోయింది. ఎప్పుడూ ఫోనే మాట్లాడుతుంది. కనీసం నిన్నైనా పట్టించుకుంటుందా..? అంటూ కార్తీక్‌ను అడిగితే లేదు.. ఈ మధ్య చాలా బిజీ అయిపోయింది. ఫోన్‌ మాట్లాడుతూనే ఉంటుంది. నువ్వైనా కాస్త చెప్పొచ్చు కదా పెద్దమ్మా అనగానే.. అనసూయ దీపను తిడుతుంటే.. దీప వచ్చి ఏంటి బావ ఇవాళ పొద్దున్నే నన్ను ఇరికించావు అని అడుగుతుంది. దీంతో కార్తీక్‌ ఊరికే అలా చేశాను అంటూ చెప్పగానే.. అందరూ నవ్వుకుంటారు.

Advertisement

సూరజ్ కాఫీ తాగుతూ బయటకు రాగానే పారిజాతం, జ్యోత్న్స తమ నాటకం మొదలుపెడతారు. సూరజ్‌ కారు ఎక్కేలా చేస్తారు. ఇద్దరి మాటలు నమ్మి కారు స్టార్ట్‌ చేసిన సూరజ్‌ అంతా బాగానే ఉంది కదా స్టార్ట్ అయింది కదా..? అని చెప్పగానే.. చూశావా సూరజ్‌ ఎంత స్పీడో అంటూ మెచ్చుకున్నట్టు బిల్డప్‌ ఇస్తుంది పారిజాతం. సూరజ్‌ మాత్రం కారు స్టార్ట్‌ అవుతుంది కదా ఇక వెళ్లండి అంటాడు. కారు స్టార్ట్‌ అవ్వడమే కాదు నడిపితేనే కదా తెలిసేది అని జ్యో చెబితే.. కారు సౌండ్‌లో ఏం తేడా వినిపించడం లేదని సూరజ్‌ చెప్తాడు. సౌండ్‌ బట్టి కారు కండీషన్‌ చెప్పాడంటే.. బాబు గతంలో గ్యారేజ్‌ నడిపి ఉంటాడు అనగానే.. సూరజ్‌ మీరు అలా మాట్లాడితే నేను తట్టుకోలేను అంటాడు. జ్యో, పారిజాతం తమ మాటలతో సూరజ్‌ను కన్వీన్స్‌ చేసి కారు డ్రైవ్‌ చేసుకుని వెళ్లేలా చేస్తారు. సూరజ్‌ కారు తీసుకుని వెళ్లగానే.. పారిజాతం, జ్యో హ్యపీగా ఫీలవుతారు. ఒరేయ్‌ కార్తీక్‌ గా నీ బ్రదర్‌ పని అవుట్‌ అని పారిజాతం గట్టిగా గెంతులు వేస్తుంది.

కార్తీక్‌, దీప ఆఫీసుకు వెళ్తుంటే.. కాంచన, మాలిని గురించి అడుగుతుంది. కాంచన మాటలకు కార్తీక్‌, దీప షాక్ అవుతారు. కాంచన భయంగా ఇంకా మాలిని గురించి చెబుతూ ఆవేశపడుతుంది. దీంతో కార్తీక్‌, మాలిని వల్ల గతంలో ఏం జరిగిందో చెప్పమని అడిగితే కాంచన కోపంగా మీరు ఆవిడతో జాగ్రత్తగా ఉంటారని చెప్పాను గతం గురించి చెప్పడానికి కాదు.. ఆ మాలిని బోణులో ఉన్న పులి లాంటిది.. అది ఆకలితో ఉన్న ఆడపులి. ఇప్పుడే వేటకు బయలుదేరింది మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ చెప్పి కాంచన వెళ్లిపోతుంది.

Advertisement

కారులో వెళ్లిన సూరజ్‌ తిరిగి సేఫ్‌గా ఇంటికి తిరిగి వస్తాడు. సూరజ్‌ రావడం చూసిన పారు, జ్యో షాక్‌ అవుతారు. జ్యో కోపంగా బ్రేక్‌ తీసేశాను అన్నావు అంటూ కోప్పడుతుంది. పారిజాతం అనుమానంగా బాబు నీకు బ్రేకులు పడ్డాయా..? అని అడగ్గానే.. సూరజ్‌ అనుమానంగా ఏంటి అడుగుతున్నారు.. అనగానే.. ఏం లేదు.. ఎందుకు ఇంతసేపు వెళ్లావు అంటూ జ్యో అడుగుతుంది. ఇంతలో కార్తీక్‌ వస్తాడు. సూరజ్‌, కార్తీక్‌ కలిసి అదే కారులో జ్యో, పారు వెళ్లేలా చేస్తారు. జ్యో కారు నడుపుతూ బ్రేక్స్‌ పడటం లేదని వెళ్లి చెట్టుకు గుద్దేస్తుంది. ఆ సౌండ్ విని  లోపలి నుంచి కార్తీక్‌, సూరజ్‌ పరుగెత్తుకుంటూ వస్తారు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×