E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode July 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  శివనారాయణకు ఓడించేందుకు జ్యోత్స్న ప్లాన్ 

Karthika Deepam 2 Serial Today Episode July 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  శివనారాయణకు ఓడించేందుకు జ్యోత్స్న ప్లాన్ 
Advertisement

Karthika Deepam 2 serial today Episode: పారిజాతం కోపంగా దక్షిణమూర్తి మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడు.. అనగానే.. రెచ్చగొట్టని మామయ్యగారు నా మెట్టినింటి పవర్‌ వాళ్లకు తెలియాలి అంటే పోటీలో వాళ్లను చిత్తుచిత్తుగా ఓడించాలి అంటుంది సుమిత్ర.. సుమిత్ర చెప్పగానే.. శివనారాయణ వెంటనే కార్తీక్‌కు అసోసియేషన్‌ వాళ్లకు ఫోన్‌ చేసి మనం పోటీకి రెడీగా ఉన్నామని చెప్పు.. దీప కంపెనీ సీఈవో నువ్వే కాబట్టి బాధ్యత అంతా నీదే అని చెప్పగానే.. దీప సూరజ్‌ వైపు చూస్తుంది. సూరజ్‌ ఓకే అన్నట్టు చూస్తాడు. సుమిత్ర, దీప దగ్గరకు వెళ్లి ఇది పోటీ కాదు.. నా ఇంటి ఆత్మగౌరవం దాన్ని నువ్వు గెలిపించాలి అని చెప్తుంది. శివనారాయణ కూడా అవునమ్మా దక్షిణమూర్తి మీద నేను ఓడిపోయానంటే చచ్చిపోయినట్టే అంటాడు. దీంతో పారిజాతం అంత మాట ఎందుకండి అంటే.. కొన్ని పంతాలు ప్రాణం కన్నా ఎక్కువే.. అంటూ తిడతాడు.

మాలినితో శివనారాయణ పోటీకి ఒప్పుకోడమ్మా అని దక్షిణమూర్తి చెప్పగానే.. బాబాయ్ మనస్తత్వం తెలిసే మీతో ఫోన్‌ చేయించాను మామయ్య.. అని చెప్పగానే.. శివనారాయణ మాటల మనిషి కాదు.. ఈ పోటీలో ఓడిపోతే ఇక నేను తట్టుకోలేను అంటాడు దక్షిణమూర్తి. మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది మామయ్యగారు అంటుంది మాలిని. వాడికి గొడవలు పోటీలు అంటే నచ్చవు.. అన్నింటికీ దూరంగా ఉంటారు అనగానే.. కానీ ఇప్పుడు యుద్దానికి దిగాడు కదా మామయ్య అనగానే.. నా భయం మొత్తం నీ గురించే అమ్మా.. వాడి వల్ల నాకంటే నీకే ఎక్కువ నష్టం జరిగింది. నా కూతురు నా అల్లుడు నా దగ్గర ఉంటే ఆ శివనారాయణకు ఈ దక్షిణమూర్తి అంటే ఏంటో చూపించేవాణ్ని.. నా కూతురు నా బలహీనత అదే వాడి బలం. అందుకే నేను అన్ని వదిలేసి కలవాలని చాలా అడుగుతు ఆ ఇంటివైపు వేశాను. వెళ్లిన ప్రతిసారి అవమానం తప్పా అప్యాయత కూడా కనిపించలేదు.. అంటూ దక్షిణమూర్తి బాధపడుతుంటే.. బాధపడకండి మామయ్య సుమిత్ర మీకు కూతురే కాదు నా ఆడపడచు.. నేను ఎలాగైనా సుమిత్రను ఇంటికి తీసుకొస్తాను అంటూ ఓదారుస్తుంది మాలిని.

Advertisement

ఇంటికి వెళ్లిన కార్తీక్‌, దీప ఇంట్లో ఎవ్వరూ లేరని కంగారుపడుతుంటారు. ఇవాళ నాన్న వస్తా అన్నారు.. మనం మర్చిపోయాము.. అంటూ కాంచనను పిలవగానే.. కాంచన వచ్చి శ్రీధర్‌ రాలేదని.. ఫ్లైట్‌ క్యాన్సిల్‌ అయిందట అని చెప్తుంది. ఇంతలో శౌర్య వచ్చి తాతయ్య రాకపోతే నాన్నమ్మ వచ్చింది అని చెప్తుంది. అప్పుడే అనసూయ వస్తుంది. అనసూయను చూసి దీప హ్యాపీగా పీలవుతుంది. అందరూ యోగక్షేమాలు మాట్లాడుకున్న తర్వాత అందరూ కలిసి భోజనం చేయాలని వెళ్తారు.

రూంలో పడుకోబోయే ముందు జ్యోత్స్న, శివనారాయణ మాటలు గుర్తు చేసుకుని అసలు ఏంటి తాత కూడా అంతలా రెచ్చిపోయారు. అందరూ చాలా బాగా యాక్టింగ్‌ చేశారు. అసలు మాలిని ఎవరు…? అంటూ పారిజాతాన్ని అడుగుతుంది. దీంతో పారిజాతం, మాలిని గురించి దక్షిణమూర్తి గురించి మొత్తం చెబుతుంది. దీంతో జ్యోత్స్న ఈ టైంను మనం వాడుకుని తాత ఓడిపోయేలా చేయాలని అందుకోసం బావను నేను కంట్రోల్‌ చేస్తాను.. దీపకు సాయం చేయకుండా సూరజ్‌ గాడిని ఆపేయాలి. అందుకోసం బాగా ఆలోచించాలి.. ఐడియా ఎలా ఉండాలంటే.. మనం ఎవ్వరం చెప్పకుండా వాడికి వాడు వెళ్లిపోయేలా చేయాలి అనుకుని ఇద్దరు డిసైడ్‌ అవుతారు.

Advertisement

అనసూయ ఉదయమే ఇంట్లోంచి వెళ్లిపోతాని చెబితే కాంచన ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. దీప వచ్చి వెళ్లిపోని అంటుంది. దీప మాటలకు అందరూ షాక్‌ అవుతుంది. కార్తీక్‌ అదేం దీప అలా మాట్లాడుతున్నావు అంటే అవును నేను పరాయిదాన్ని కాబట్టి వెళ్లిపోతుంది అంటూ దీప ఎమోషనల్ అయితే.. అనసూయ దీపను తిడుతుంది. మీ నాన్న కట్టించిన ఇల్లు ఉంది కదా అక్కడ ఉంటాను. అక్కడ ఉంటే నాకు నా తమ్ముడితో ఉన్నట్టు ఉంటుంది అంటూ అనసూయ ఎమోషనల్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×