E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today February 26th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  దాసును కలిసి నిజం అడిగిన జ్యోత్స్న

Karthika Deepam 2 Serial Today February 26th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  దాసును కలిసి నిజం అడిగిన జ్యోత్స్న
Advertisement

Karthika Deepam 2  serial today Episode:   

కాశీని తిడుతుంది స్వప్న. పాముకు పాలు పోసి పెంచినా విషమే కక్కుతుంది అన్నట్టు నువ్వు కూడా అలాంటి వాడివే.. ఇప్పుడు నీకు హెల్ప్‌ చేస్తే తర్వాత నన్నే బాధపెడతావు అంటూ మండిపడుతుంది. అయితే కాశీ మాత్రం దీప, కార్తీక్‌, సుమిత్ర, దశరథల గురించి చెప్తాడు. కార్తీక్‌ బావను దీప అక్క ఎన్నోసార్లు బాధపెట్టింది అయినా బావ మాత్రం అక్కకు లైఫ్‌ ఇచ్చారు. అలాగే సుమిత్ర పెద్దమ్మ కోపంగా పెద్దనాన్నను కాదని ఇంట్లోంచి వెళ్లిపోయింది. కానీ తర్వాత కలిసిపోయారు అని కాశీ చెప్తూనే.. తనకు ఒక్క చాన్స్ ఇవ్వమని అడుగుతాడు. అయితే స్వప్న మాత్రం కాశీని నమ్మదు ఇంత బతిమాలుతున్నావు అంటే మరేదో ప్లాన్‌ ప్రకారం వచ్చావేమో అంటుంది.

దీంతో కాశీ నేను కరెక్టుగా లేనప్పుడు నన్ను నమ్మావు.. కానీ ఇప్పుడు నేను మారిపోయాను అంటే కూడా నమ్మడం లేదేంటి అంటూ కాశీ బాధపడతాడు. స్వప్న మాత్రం ఈ పరిస్ధితి తెచ్చుకుంది నువ్వే అంటూ తిడుతుంది. అయినా కాశీ వినకుండా ఇద్దరం కలిసి బిజినెస్‌ పెడదాం.. బాగా సంపాదిద్దాం అంటాడు. దీంతో స్వప్న మరింత కోపంగా బిజినెస్ అంటే నమ్మకం. నువ్వు రెస్టారెంట్‌లో పీఏగా పెట్టుకుంటూనే, ఎవరితోనే చేతులు కలిపి మా నాన్న మీద నేరం మోపిన మహానుభావుడివి, ఇప్పుడు నీతో కలిసి బిజినెస్ చేస్తే ఎవరితోనే చేతులు కలిపి ఫుడ్ పాయిజిన్ చేసి నా మీద కూడా పగతీర్చుకుంటావని.. నిన్ను జీవితంలో అసలు క్షమించను అంటూ స్వప్న వెళ్లిపోతుంది.

Advertisement

ఇక జ్యోత్స్న , దాస్‌ను కలుస్తుంది. ఇన్ని రోజులు దీప గురించి అందరికీ నిజం చెప్పాలనుకున్నావు కానీ అదే నీ జీవిత లక్ష్యం అనేవాడివి ఇప్పుడేమో నీ జీవిత సాపల్యం దక్కింది అంటున్నావేంటే నిజం చెప్పేశావా అని అడుగుతుంది. దీంతో దాసు నీకు అలా అనిపిస్తుందా.. అంటూ అడగ్గానే.. జ్యో కోపంగా  అనిపించడం ఏంటి.. కళ్ల ముందే కనిపిస్తోంది. దీప దశరథ కూతురైతే మా డాడీ ఎలా ఉంటారో ఇప్పుడు అలాగే బిహేవ్ చేస్తున్నాడు. అంటే ఆయనకు నిజం తెలిసింది అనే కదా..? అంటూ జ్యో ప్రశ్నించగానే.. ఆ విషయం నీకు అన్నయ్య చెప్పాడా? అంటూ దాసు అడగ్గానే.. అయితే నేను నిజంగా దశరథ కూతురునా అంటూ ఎదురు ప్రశ్నిస్తుంది జ్యో..

రిపోర్ట్స్‌ను బట్టి నువ్వే దశరథ అన్నయ్య కూతురివి అంటాడు దాస్. నేను రిపోర్ట్స్ నమ్మనని అంటుంది జ్యోత్స్న. డాక్టర్ అబద్ధం చెప్పదు కదా అంటాడు దాస్. దీంతో ఇద్దరి మధ్య మాటల వాగ్వాదం జరుగుతుంది… వీలైనంత త్వరగా నీ గూటికి నువ్వు చేరుకుంటే నీకే మంచిదని సలహా ఇస్తాడు దాస్. నేను దశరథ కూతురినా? నీ కూతురినా? అంటూ జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. నువ్వు ఏది నమ్ముతున్నావని దాస్ అడుగుతాడు. నిజం ఏంటో నువ్వే కనిపెట్టు అంటాడు దాసు. అప్పుడే పారిజాతం వచ్చి పిల్ల బాతు బచ్చా అంటూ  వార్నింగ్ ఇస్తుంది.

Advertisement

మరోవైపు దీపతో ఉన్న కార్తీక్‌ దశరథ ఎక్కడ నిజం చెప్పేస్తాడోనని భయపడుతున్నట్టు చెప్తాడు. ఇదంతా చూస్తుంటే జ్యోత్స్న వెళ్లి ఖచ్చితంగా దాస్ మావయ్యని కలుస్తుంది అంటాడు కార్తీక్. దీంతో నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నానని అంటుంది దీప. నా టార్గెట్ ఒక్కటే.. నువ్వే ఆ ఇంటి వారసురాలివి అని నిజం చెప్పి ఈ ఇంట్లో కూర్చోబెట్టాలి. కానీ ఈలోపు జ్యోత్స్న, పారిజాతంలు ఏం చేస్తారోనని భయంగా ఉందని అంటాడు కార్తీక్.

ఉదయాన్నే పారు, జ్యోత్స్నలు కలిసి యోగా చేసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి కార్తీక్ వచ్చి మీరిద్దరూ ఇంత ఉదయాన్నే ధ్యానం చేస్తున్నారని అడుగుతాడు కార్తీక్. ఆ వెంటనే శివన్నారాయణ రావడంతో పారుకు మనశ్శాంతి పోయిందట అని చెబుతాడు కార్తీక్.  ఇంతటితో నేటి కార్తీకదీపం 2 సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×