E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode April 6th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌ : జ్యోత్స్నతో చాలెంజ్ చేసిన కార్తీక్  

Karthika Deepam 2 Serial Today Episode April 6th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌ : జ్యోత్స్నతో చాలెంజ్ చేసిన కార్తీక్  
Advertisement

Karthika Deepam 2  serial today Episode: కార్తీక్ తో మాట్లాడుతున్న జ్యోత్స్న దగ్గరకు దాస్‌ వెళ్తాడు. ఈ ఇంట్లో ఒక మహరాణిలా బతకాలన్నదే తన కోరిక అని జ్యోత్స్న చెప్పగానే.. ఇప్పటికైనా నా మాట వింటే అలాగే బతుకుతావని దాస్‌ అనగానే.. జ్యోత్స్న తిడుతుంది. నాకు ఒక డ్రెస్‌ కొనాలంటే నీ జీవితమే సరిపోదు అంటూ తిడుతుంది. ఎవరైతే నా బావను నాకు కాకుండా చేసిందో అదే ఈ ఇంటి వారసురాలు అయిపోయింది. ఇంతలో నిజం చెప్తాను అంటూ నువ్వు దిగావు అంటూ తిట్టగానే.. అయితే చంపేస్తావా..? అని దాస్‌ అడగ్గానే.. ఇది నా ఇల్లు దశరథ, సుమిత్ర మా ఇల్లు.. నేను శివనారాయణ గారి మనవరాలిని..

ఇది నా ఆస్తి. వారసురాలిని అని ఎవతో వస్తే పూలు చల్లి స్వాగతిస్తారా..? నేను బ్యాగులో నాలుగు బట్టలు వేసుకుని పద నాన్న అని నీతో వచ్చేస్తాను అనుకున్నావా..? అంటూ జ్యోత్స్న అడగ్గానే.. రాకపోతే ఏం చేస్తావు అంటాడు దాస్‌. దీంతో జ్యోత్స్న ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పగానే.. అయితే నేను ఇప్పుడే వెళ్లి అందరికీ నిజం చెప్పేస్తాను అంటూ దాస్‌ బెదిరిస్తే అంతకన్నా ఎక్కువగా జ్యో బెదిరిస్తుంది. తాను ఇప్పుడే బిల్డింగ్‌ మీద నుంచి దూకేస్తాను అంటూ చెప్పగానే.. కార్తీక్‌, దాస్‌ షాక్‌ అవుతారు. తాను చనిపోయిన వెంటనే సుమిత్ర గుండె ఆగి చస్తుంది. ఆ బాధతో దశరథ, శివనారాయణ బెంగతో చనిపోతారు అంటూ బెదిరించగానే.. దాస్‌ భయపడుతూ తన కూతురును చూస్తుంటే తనకు భయంగా ఉంది అంటూ కార్తీక్‌ కు చెప్పగానే.. అంతా తాను చూసుకుంటానని దాస్‌ను అక్కడి నుంచి పంపిస్తాడు కార్తీక్‌.

Advertisement

శ్రీధర్‌, కాంచన, దీప ఇంట్లో కూర్చుని కేక్‌ కటింగ్‌ సమయంలో జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటుంటారు. కార్తీక్‌ ఎందుకో ఈ మధ్య అర్థం కావడం లేదని అంటుంది కాంచన. దీంతో దీప అత్తయ్య అన్ని గమనించినట్టు ఉంది అని మనసులో అనుకుంటుంది. శ్రీధర్‌ తాను గమనించానని చెప్తాడు. ఏదో కంగారుగా ఉన్నాడని చెప్తాడు. కార్తీక్‌ ఏమైనా నీతో చెప్పాడా అని శ్రీధర్‌ అడగ్గానే.. తెలిసినా తెలియదనే చెప్తుంది. భార్యాభర్తలు ఒక్కటే అంటూ కాంచన తిడుతుంది. వీళ్ల మధ్య ఏవేవో కథలు నడుస్తుంటాయి అంటూ కాంచన అంటుంది. దీంతో శ్రీధర్‌ కాంచనను కూల్‌ చేసి వెళ్లిపోతాడు. దీప మాత్రం కార్తీక్‌ గురించి ఆలోచిస్తుంది.

మరోవైపు కార్తీక్ తో యుద్దం అన్నావుగా బావ మొదలుపెట్టు అంటుంది. దీంతో అది ఎప్పుడో మొదలైంది మరదలా..? అది ఇప్పుడే ఆపేయాలి. అని కార్తీక్‌ చెప్పగానే.. ఆపాలంటే నిజం చెప్పాలి.. నిజం చెప్పాలి అంటే నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి. నన్ను నీ భార్యగా చేసుకుంటే నేను నిజాలు అన్ని చెప్పి అంతా ఆపేస్తాను.. అని చెప్పగానే.. నాకు పెళ్లైంది.. దీపను తప్పా ఇంకెవరినీ నా భార్యగా ఊహించుకోలేను అని కార్తీక్‌ చెప్పగానే.. నువ్వెలా దీపను ఫీల్ అవుతున్నావో నేను ఈ ఇంటి వారసురాలిగా ఫీలవుతున్నాను అంటుంది జ్యోత్స్న. దీంతో కార్తీక్‌ వెళ్లి నిజం చెప్తాను అంటాడు. అయితే జ్యోత్స్న చనిపోతానని బెదిరించగానే.. చనిపోమ్మని కార్తీక్‌ చెప్పగానే.. జ్యో షాక్‌ అవుతూ.. అయితే దీపను చంపి చనిపోతానని అంటుంది. దీంతో కార్తీక్ నీ నోటితోనే నువ్వు ఈ ఇంటి వారసురాలు కాదని చెప్పేలా చేస్తాను అంటూ చాలెంజ్‌ చేస్తాడు కార్తీక్‌.

Advertisement

తర్వాత పారిజాతం దగ్గరకు వెళ్లిన జ్యోను తిడుతుంది పారు. నీ జాతకం మొత్తం తెలుసు నీకు ఇంకా కార్తీక్‌ గాడి మీద ఆశ చావలేదు కదా..? అంటూ ప్రశ్నిస్తుంది. ఇంతలో శివనారాయణ, దశరథ, సుమిత్ర వస్తారు. ఈ పార్టీతో అందరినీ కలిపావు అంటూ శివనారాయణ జ్యోను మెచ్చుకుంటాడు. మరోవైపు దీప, కాంచనకు కాఫీ ఇస్తూ కార్తీక్‌ ఇంకా రాలేదని ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదని చెప్తుంది. ఇంతలో కార్తీక్‌ వస్తాడు. కిచెన్‌లోకి వెళ్లి ఉప్పు తీసుకొచ్చి దీపకు దిష్టి తీస్తాడు. ఇంతలో కార్తీకదీపం 2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×