E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode April 25th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ కు నిజం చెప్పిన వైరా  

Karthika Deepam 2 Serial Today Episode April 25th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ కు నిజం చెప్పిన వైరా  
Advertisement

Karthika Deepam 2  serial today Episode: శ్రీధర్‌, కావేరీ స్వప్న పెళ్లి గురించి ఆలోచిస్తుంటారు. స్వప్నకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనట్టు ఉంది. మీరు వెళ్లి వసంత్‌కు చెప్పండి అని కావేరి అంటుండగానే.. వసంత్‌ వస్తాడు. నువ్వేదో క్యాపుకు వెళ్తున్నావు అన్నారు వెళ్లలేదా అని శ్రీధర్‌ అడగ్గానే.. వెళ్లలేద మామయ్య అంటాడు వసంత్‌. ఎందుకు వెళ్లలేదు అని అడగ్గానే.. అది స్వప్న తోనే చెప్తాను అంటూ వసంత్‌, స్వప్నను పిలుస్తాడు. స్వప్న వస్తుంది. ఎల్లుండి మంచిరోజంట లేట్ చేయకుండా మనం ఎంగేజ్‌మెంట్‌ చేసుకుందా అని వసంత్‌ చెప్పగానే.. కావేరీ మాత్రం అప్పుడేనా మేము ఏ నిర్ణయం తీసుకోలేదు అని చెప్తుంది.

దీంతో వసంత్‌, స్వప్నను అడగ్గానే.. స్వప్న మౌనంగా ఉండిపోతుంది. నువ్వు  ఓకే అంటే రెండు రోజల్లో మన ఎంగేజ్‌మెంట్‌ అవుతుంది అనగానే.. వసంత్‌, శ్రీధర్‌ను అడిగితే నా కూతురు ఇష్టమే నా ఇష్టం అంటాడు. ఇంతలో కాశీ వచ్చి స్వప్నకు ఇష్ట లేదు అని చెప్తాడు. దీంతో స్వప్న కోపంగా నాకు ఇష్టం లేదని చెప్పానా..? అంటూ కోపంగా ఈ పెళ్లి ఇష్టమే అని స్వప్న చెప్పగానే.. వసంత్‌ హ్యాపీగా ఈ విషయం మా ఇంట్లో వాళ్లకు చెప్పాలి అంటూ వెళ్లిపోతాడు. దీంతో కావేరీ, స్వప్నను తిడుతుంది. స్వప్న ఈ విషయాలు మొదటిసారి పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పి ఉంటే బాగుండు.. నా రెండో పెళ్లిలో నా ఇష్టం కంటే బాధ్యత ఎక్కువ ఉంది. నిశ్చిర్థానికి ఏర్పాట్లు చేయండి నాన్న అంటూ చెప్పి వెళ్లిపోతుంది.

Advertisement

మరోవైపు ఏడుస్తున్న దాస్‌ దగ్గరకు వెళ్లిన జ్యోత్స్న చూసి నవ్వుతుంది. నువ్వు ఏడుస్తున్నావా..? నాటకాలు ఆడుతున్నావా అంటుంది. దీంతో దాస్‌ ఏడుస్తూనే.. నువ్వు కిడ్నాప్‌ అయ్యావు అని తెలిసి ఎంత బాధపడ్డానో తెలుసా జ్యోత్స్న అంటాడు దాస్‌. జ్యోత్స్న మాత్రం కోపంగా నువ్వు అసమర్థుడివి.. పిల్లల  ఇష్టాల కోసం ఏం చేయని ఒక చేతకాని తండ్రివి. కూతురు ఏడుస్తుంటే ఆనందపడే సైకో తండ్రివి అంటూ తిడుతూ.. ఉంటే నేను ఏం చేసినా నీకోసమే జ్యోత్స్న అంటూ చెప్పగానే.. ఏం చేశావు.. అని అడగ్గానే.. నువ్వు సుమిత్ర కూతురువి కాదని నిజం చెప్పి వచ్చేయ్‌ ఏం చేస్తానో తెలుస్తుంది కదా అనగానే.. జ్యోత్స్న నవ్వుతూ.. ఇంత వరకు నువ్వు ఏం చేశావు.. ఇప్పుడు ఏం చేస్తావు అంటూ నేను ఈ యావదాస్తికి వారసురాలిని.. బావతో తాళి కట్టించుకుంటాను.. అంటూ దాస్‌ను తిట్టి అక్కడి నుంచి వెళ్లిపో అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో దాస్‌ సరే వెళ్లిపోతాను కానీ ఇక మీదటైన జాగ్రత్తగా ఉండు.. పెళ్లి చేసుకో మారిపో అంటూ చెప్పగానే.. మంచిది నువ్వు బయలుదేరు అంటూ తిడుతుంది జ్యోత్స్న. దాస్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

ఇక కార్తీక్‌తో దీప బాధపడుతుంది. నీకు బుల్లెట్‌ తగిలిందని తెలిశాక బయటకు చెప్పుకోలేక నీతో మాట్లాడలేక మనసులోనే బాధపడుతున్నాను. నీకు ఏమైనా అయితే మేము మళ్లీ అనాథలం అవుతాము కదా.? ఇదంతా చూస్తుంటే నేను ఊహించలేని ప్రమాదం ఏదో భవిష్యత్తులో జరిగుతుందేమోనని భయంగా ఉంది అంటుంది. దీంతో కార్తీక్‌ ఎందుకు భయపడుతున్నావు దీప ఏమీ అవ్వలేదు కదా అంటూ చెప్తుండగానే.. కార్తీక్‌కు వైరా గాడు ఫోన్‌ చేసి నీ కారణంగా రెండు సార్లు మోసపోయాను అంటూ కోపంగా తిడుతుంటే.. కార్తీక్‌ కూడా వైరాకు వార్నింగ్‌ ఇస్తాడు. దీంతో వైరా అసలు నిజం చెప్తాడు. నేనే కాదు నీ మరదలు కూడా పెద్ద దొంగరా..? అని చెప్పగానే.. తనేం చేసిందని కార్తీక్‌ అడగ్గానే..

Advertisement

ఈ కిడ్నాప్‌ ప్లానంతా జ్యోత్స్న చేసింది. నీ మరదలు చాలా పెద్ద కిలాడిరా…? మా వాళ్లు ఎంత అడిగినా ఇస్తారు. ముప్పై కోట్లు అడుగు.. నీకు ఇరవై, నాకు పది అంటూ ఎలా ఫోన్‌ చేయాలి. ఎలా మాట్లాడాలి.? మొత్తం స్కెచ్చంతా నీ మరదలిది.. కానీ చేతికి డబ్బు రాగానే.. నన్నే లేపేయాలని చూసింది. ఆ కోపంతోనే జ్యోత్స్నను చంపేయాలని చూశాను. మధ్యలో నువ్వు అడ్డు పడ్డావు. అసలు మీ ఫ్యామిలీనే నా వల్ల డేంజర్‌ కాదు.. నీ ఫ్యామిలీకి నీ మరదలే డేంజర్‌ అసలు అది నీ ఫ్యామిలే కాదు దాన్ని మీరు ఎలా భరిస్తున్నారో అంటూ వైరా చెప్తుంటే కార్తీక్‌, దీప షాకింగ్‌ గా వింటుంటారు. వైరా కాల్‌ కట్‌ చేశాక.. జ్యోత్స్న ఏదో ఒకటి చేసి బుద్ది చెప్పాలని ప్లాన్‌ చేస్తారు కార్తీక్‌, దీప. మరోవైపు శివనారాయణ దగ్గరకు వెళ్లి తన మీద ఉన్న కోపాన్ని తగ్గించాలని చూస్తుంది పారిజాతం ఇంతలో కార్తీకదీపం 2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×