E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode April 21st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌ : దీపను ఇంట్లోంచి గెంటేసిన సుమిత్ర

Karthika Deepam 2 Serial Today Episode April 21st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌ : దీపను ఇంట్లోంచి గెంటేసిన సుమిత్ర
Advertisement

Karthika Deepam 2  serial today Episode: జ్యోత్స్న కిడ్నాప్‌ గురించి తెలిసి సుమిత్ర ఏడుస్తుంది. వాడు మళ్లీ ఫోన్‌ చేసే లోపు మనం డబ్బు రెడీ చేసుకోవాలి. ఈ విషయం పోలీసులకు మాత్రం తెలియకుండా చూసుకోవాలి అని చెప్తుండగానే.. దాస్‌ పోలీసులను తీసుకుని ఇంటికి వస్తాడు. దాస్‌ను పోలీసులను చూసి అందరూ షాక్‌ అవుతారు. కార్తీక్‌ మామయ్య పోలీసులను తీసుకుని వచ్చావేంటి అని అడగ్గానే.. జ్యోత్స్న కిడ్నాప్‌ అయిందన్నావు కదా అల్లుడు అందుకే అంటాడు దాస్‌. మీ మనవరాలు ఎప్పుడు కిడ్నాప్‌ అయింది అంటూ పోలీస్‌ అడగ్గానే.. శివనారాయణ సార్‌ మీరు కాస్త బయట ఉండండి మేము మాట్లాడుకున్నాక మీ దగ్గరకు వస్తాను అని చెప్పగానే.. పోలీస్‌ బయటకు వెళ్తాడు. శివనారాయణ కోపంగా దాస్‌ను తిడతాడు. నువ్వెవరురా పోలీసులను తీసుకురావడానకి అంటూ గద్దించగానే.. దీప అడ్డు వెళ్తుంది.

దీంతో సుమిత్ర కోపంగా ఓసేయ్‌ ముందు నువ్వు బయటకు వెళ్లవే అంటూ దీపను తోసేస్తుంది. దీంతో కార్తీక్‌ అడ్డుపడతాడు. సుమిత్ర ఏడుస్తూనే.. నీ భార్యకు నా కూతురంటే ఇష్టం లేదురా.. ఇష్టం లేని వాళ్లు నా కూతురు క్షేమంగా రాకూడదని కోరుకుంటారు అంటూ సుమిత్ర తిడుతుంటే.. దీప ఏడుస్తుంది. పారిజాత వచ్చి దీప, జ్యోత్స్న అప్పుడప్పుడు ఏదో మాటలు అనుకుంటారు కదా అనగానే.. మీరు దీపను సమర్థించకండి.. అలా సమర్థిస్తే.. మీరు కూడా పక్కకు వెళ్లండి అనగానే.. దశరథ, సుమిత్ర తను మా పిన్ని అనగానే.. మీ పిన్ని మీద గౌరవం ఉంది కానీ ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్తున్నాను. అంటూ దీపను ఇష్టమొచ్చినట్టు తిడుతుంది. జ్యోత్స్న లేదని ఏడుస్తుంది. దాస్‌ అడ్డు రాగానే.. దాస్‌ను కూడా తిడుతుంది.. కార్తీక్‌ను తిడుతుంది. జ్యోత్స్నకు ఏమీ కాదని కార్తీక్‌ చెప్పగానే.. జ్యోత్స్నను తీసుకుని వచ్చి  ఆ మాట చెప్పు ఇక పోలీసులు వచ్చారు కదా నా కూతురు ఇక రాదురా..? వాడు చంపేస్తాడు అని ఏడుస్తుంది. ఇంతలో శ్రీధర్‌ వచ్చి నా మేనకోడలికి ఏమీ కాదమ్మా అనగానే.. నీకెవరు చెప్పారు అంటూ శివనారాయణ అడగ్గానే.. దాస్‌ ఫోన్‌ చేశాడని చెప్పగానే.. శివనారాయణ కోపంగా దాస్‌ను తిడుతుంటే.. కార్తీక్‌, శ్రీధర్‌, దాస్‌లను తీసుకుని బయటకు వెళ్తాడు.

Advertisement

వాళ్ల వెనకాలే వెళ్లిన పారిజాతం దాస్‌ దగ్గరకు వెళ్లి జ్యోత్స్న కోసం నువ్వెందుకు బాధపడుతున్నావు అని అడగ్గానే.. ఇంతకు ముందు నా కూతురని అభిమానం ప్రేమ పెంచుకున్నాను కదమ్మా కాస్త బాధగా ఉంది అని చెప్పగానే.. నాకైతే ఇదంతా ఒక నాటకంలా అనిపిస్తుంది. జ్యోత్స్న గురించి నాకు పూర్తిగా తెలుసు.. అది డబ్బు కోసం ఈ నాటకం ఆడుతుందేమోనని డౌటుగా ఉందని చెప్తుండగానే.. వెనకాలే వచ్చిన శివనారాయణ విని కోపంగా పారిజాతాన్ని తిడతాడు. ఈ ఇంట్లో ఏం జరుగుతుంది నువ్వు ఏం మాట్లాడుతున్నావు కాస్తైనా బుద్ది ఉండాలి అంటూ తిడతాడు.  దీంతో పారిజాతం నన్ను తప్పుగా అర్తం చేసుకోకండి అనగానే.. మరెందుకు తప్పుడు కూతలు కూస్తున్నావు.. అంటూ నిలదీయగానే.. ఏదో నోరు జారింది అంటూ పారిజాతం చెప్పగానే.. నీ నోట్లో నుంచి ఇలాంటి మాటలు వస్తున్నాయి అంటే నీకు ఏదో తెలిసింది అంటూ శివనారాయణ అనుమానిస్తుంటాడు. ఇంతలో లోపలి నుంచి దశరథ కిడ్నాపర్‌ వీడియో పంపించాడు త్వరగా రండి అంటూ పిలవగానే.. శివనారాయణ వెళ్లిపోతాడు.

లోపల అందరూ వీడియో చూస్తారు. వీడియో జ్యోత్స్న ఏడుస్తూ అమ్మా, నాన్న వీళ్లు నన్ను కొడుతున్నారు.. త్వరగా నన్ను సేవ్‌ చేయండి అంటూ బాధపడుతుంది. జ్యోత్స్న యాక్టింగ్‌ చూసి సుమిత్ర ఏడుస్తుంది. అప్పుడే ఇంటికి వచ్చిన పోలీస్‌ మీరు ఏమీ భయపడకండి అంటూ చెప్తుండగానే.. వైరా మళ్లీ ఫోన్‌ చేస్తాడు. మీరు చాలా సేపు ఫోన్ మాట్లాడండి.. ఫోన్‌ ట్రేస్‌ చేస్తాము అని చెప్పగానే.. సరే అంటూ ఫోన్‌ లిఫ్ట్ చేసి డబ్బు రెడీగా ఉంది అని చెప్పగానే.. అయితే ఎక్కడికి పంపించాలో తర్వాత కాల్ చేస్తాను అనగానే.. దశరథ మేము జ్యోత్స్నతో మాట్లాడాలి అనగానే.. ఎందుకు నా ఫోన్‌ ట్రేస్‌ చేయడానికా.. ఇక మీ కూతురు అయిపోయింది అంటూ కాల్‌ కట్‌ చేస్తాడు. సుమిత్ర భయంతో ఏడుస్తుంది.  మరోవైపు వైరా ముందు జాగ్రత్తగా అమౌంట్‌ రాకపోయినా పోలీసులకు నేను దొరికిపోయినా ఈవిడను చంపేసి డెడ్‌బాడీని పార్శిల్‌ చేయండి అంటూ వార్నింగ్‌ ఇస్తాడు.

Advertisement

మరోవైపు ఇంటికి వెళ్లిన శ్రీధర్‌, దీప ఇంటికి వెళ్తారు. కాంచనకు నిజం చెప్తారు. 24 గంటల్లో జ్యోత్స్నను తీసుకురాకపోతే సుమిత్ర చనిపోయేలా ఉంది అంటూ చెప్తాడు. కాంచన కంగారుపడుతుంది. ఇంతలో కార్తీకదీపం 2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×