E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode April 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ కోసం ఎమోషనల్ అయిన పారిజాతం

Karthika Deepam 2 Serial Today Episode April 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ కోసం ఎమోషనల్ అయిన పారిజాతం
Advertisement

Karthika Deepam 2  serial today Episode: కలివిడి కార్యక్రమం అయిపోయాక దీప, సుమిత్ర కాళ్లు మొక్కబోతుంటే.. దూరంగా జరుగుతుంది సుమిత్ర. పర్వాలేదు దీప నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది అనగానే దీప బాధపడుతుంది. ఇంతలో పారిజాతం దీప పెళ్లి రోజు కానుకగా నెక్లెస్‌ ఇవ్వాలనుకుంటుంది. దీంతో దీప వద్దని అంటుంది. శివనారాయణ తీసుకోమ్మా.. పారిజాత ఇవ్వాలనుకోవడం గ్రేట్‌ అంటాడు. ఇంతలో పారిజాతం తాను తీసుకొచ్చిన నెక్లెస్‌ ను జ్యోత్న్స చేత దీప మెడలో వేయిస్తుంది. జ్యోత్స్నఅయిష్టంగానే నెక్లెస్‌ వేస్తుంది. నీ స్థానంలో నేనుంటే నీలాగే బాధపడేదాన్ని.. నీలాగే కోప్పడేదాన్ని అంటుంది. దీంతో పారిజాతం కోపంగా ఏం మాట్లాడుతున్నావే.. అని అడగ్గానే.. జ్యోత్స్న మాత్రం సారీ బావ మీరు పెరట్లో మాట్లాడుకోవడం అంతా విన్నాను.. అదేమీ పట్టించుకోకూడదని వెనక్కి వచ్చేశాను. అయినా నేను విన్న ఆ విషయం  ఏంటంటే.. బావ నా మెడలో తాళి కట్టినట్టు అత్తకు కల వచ్చిందట అని చెప్పగానే..

అందరూ షాక్‌ అవుతారు. అది ఎక్కడ నిజం అవుతుందేమోనని దీప భయపడుతుంది.. అందుకే దీప నన్ను తిట్టింది అని చెప్పగానే.. దశరథ, కాంచనను జ్యోత్స్న చెప్పింది నిజమేనా అని అడుగుతాడు. కాంచన అవునని చెప్తుంది. దీంతో పారిజాతం కోపంగా నోర్మూయవే.. కాంచన కల నిజం అయితే నాకు కల వచ్చింది. జ్యోత్స్న అన్ని సర్దుకుని ఎక్కడికో వెళ్లింది అన్నట్టు కల వచ్చింది అని చెప్తూ.. కోపంగా తిడుతుంది. ఇంతలో కార్తీక్‌ కల్పించుకుని ఇక ఆపేయండి.. కొందరికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. అవి తీరుస్తాను.. వచ్చింది కల అని మీరనుకుంటున్నారు. పీడ కల అని నేను అనుకుంటున్నాను.. దీప మెడలో తాళి కట్టాక నా జీవితం ఏం సుఖంగా లేదు.. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా నా పక్కన ధైర్యంగా నిలబడింది నా భార్య అంటూ కార్తీక్‌ ఎమోషనల్‌ అవుతుంటే పారిజాతం బాధపడుతుంది.

Advertisement

నన్ను నడిపించడమే కాదు.. గెలిపించింది కూడా.. నేను హాస్పిటల్‌లో చావుబతుకుల్లో ఉన్నప్పుడు కొంత మంది బ్లడ్‌ ఇవ్వడానికి కూడా వెనుకాడారు. అలాంటి టైం తను ముందుకు వచ్చి బ్లడ్‌ ఇచ్చి నన్ను కాపాడింది దీప. ఇలాంటి మనిషిని ఈ జన్మకే కాదు ప్రతి జన్మకు భార్యగా ఉండాలని కోరుకుంటాను. ఇలా చెప్పుకుంటూ పోతే దీప గురించి చాలా చెప్పొచ్చు.. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయంటారు.. మా పెళ్లి కూడా స్వర్గంలోనే జరిగింది. మళ్లీ భూమ్మీద పుట్టాం. జంటగా బతుకుతున్నాం.. మేము బతికినంత కాలం ఇలాగే ఉంటాము అని కార్తీక్‌ చెప్పగానే.. పారిజాతం ఎగిరిగంతేస్తుంది. ఏం చెప్పావు మనవడా అంటూ ఎమోషనల్‌ అవుతుంది. దీంతో దాస్‌, పారిజాతాన్ని పక్కకు తీసుకెళ్లి నీ ప్రేమ చూస్తుంటే మామూలు వాళ్లకే అనుమానం వచ్చేలా ఉంది అంటూ చెప్తాడు.

తర్వాత అందరూ కలిసి టిఫిన్‌ చేస్తుంటే.. కార్తీక్‌ వడ్డిస్తుంటాడు. ఇంతలో దీపకు పొలమారితే కార్తీక్‌ వెళ్లి తల మీద నుమురుతూ నీళ్లు అందిస్తాడు. అది చూసిన పారిజాతం ఎమోషనల్‌ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. దీంతో శివనారాయణ ఏంటి పారిజాతం చట్నీలో కారం ఎక్కువైందా..? అని అడగ్గానే.. లేదండి కార్తీక్‌ను చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి… భర్తంటే వీడు.. అంటూ పొగుడుతుంది. పెద్ద చదువులు చదివి కూడా ఆస్థి మొత్తం వదిలేసుకున్నాడు. సాదారణ వ్యక్తిలా ఇండ్లీ బండితో జీవితం ప్రారంభించాడు అంటూ కార్తీక్‌ గురించి గొప్పగా చెప్తుంది. కార్తీక్‌ అడ్డు చెప్పినా పారిజాతం ఆగకుండా జ్యోత్స్న లాంటి పిల్లబాతు బచ్చాకు నీ గొప్పతనం తెలియదు.. అంటూ కార్తీక్‌ గురించి చెప్తూ ఎమోషనల్‌ అవుతుంది.

Advertisement

దీంతో శివనారాయణ పారిజాతం ఆ ఆవేశం ఏంటి…? అంటాడు. దీంతో పారిజాతం నేనింతేనండి అంటూ చెప్పగానే.. శివనారాయణ కూడా నువ్వు చెప్పేది నిజమే కార్తీక్‌ లాంటి వాడు దొరకడం దీప అదృష్టం అని చెప్తాడు. ఇంతలో కార్తీకదీపం 2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×