E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode April 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పారిజాతం ఎమోషనల్ తో ఆడుకున్న కార్తీక్  

Karthika Deepam 2 Serial Today Episode April 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పారిజాతం ఎమోషనల్ తో ఆడుకున్న కార్తీక్  
Advertisement

Karthika Deepam 2  serial today Episode: జ్యోత్స్న గురించి తను చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుంది దీప. కార్తీక్‌ వచ్చి ఏం ఆలోచిస్తున్నావు అని అడగ్గానే.. జ్యోత్స్నకు నిజం తెలుసని నాకెందుకు చెప్పలేదు అని దీప అడుగుతుంది. నేను నీ గురించే కాదు నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించాలి అంటాడు. దీప గట్టిగా అడగ్గానే.. జ్యోత్స్న గురించి మొత్తం చెప్తాడు కార్తీక్‌. దీపను చంపడానికి కేక్‌లో విషం కలిపింది. మేడ మీద నుంచి తోసేసి చంపేయాలనుకుంది అంతా చెప్పాక.. అయితే జ్యోత్స్న చెప్పింది నిజమే బావ. నిన్ను తప్ప ఎవరినీ భర్తగా ఊహించుకోలేకపోతుంది అని దీప చెప్పగానే.. నీకు బాగా దిష్టి తగిలినట్టు ఉంది. నిమ్మకాయ దిష్టి కాదు.. దండనే వేయాలి అనగానే.. జ్యోత్స్న చెప్పింది నిజమే బావ అనగానే..

కార్తీక్‌ డౌటుగా నువ్వు త్యాగాలు చేయడానికేం రెడీ కాలేదు కదా అని అడగ్గానే.. నేను నిన్ను ఎందుకు వదులుకుంటాను బావ.. పారిజాతం గారు జ్యోత్స్నను మార్చాలనుకుని ఉంటే ఎప్పుడే మార్చేసేవారు అంటూ చెప్పగానే.. వెంటనే కార్తీక్‌, పారుకు కాల్ చేస్తాడు.  జ్యోత్స్న చేసిన పనికి దీప గుక్కపెట్టి ఏడుస్తుందని చెప్పగానే.. పారిజాతం కోపంతో రెచ్చిపోతుంది. నేను నిజాలు చెబితే అందరూ గుండె పగిలి చస్తారు అనగానే.. కార్తీక్‌ మరింత రెచ్చిపోయి దీప గురించి సెంటిమెంట్‌ డైలాగులు చెప్తాడు. కార్తీక్‌ మాటలకు పారిజాతం ఏడుస్తుంది…? కార్తీక్‌ ఇంకా తన మాటలతో రెచ్చగొట్టగానే.. పారిజాతం ఎమోషనల్‌గా దీప కోసం ఏమైనా చేస్తాను అంటుంది.

Advertisement

దీంతో కార్తీక్‌ ఈరోజు జ్యోత్స్న చేసిన పనికి దీప భోజనం కూడా చేయకుండా ఏడుస్తుంది.. అక్కడేమో జ్యోత్స్న హాయిగా నిద్రపోతుంది అంటూ రెచ్చగొట్టగానే.. జ్యోత్స్న నిద్ర పోదురా..? నేను దాని గుండెల్లో నిద్రపోతాను అంటూ కోపంగా కాల్‌ కట్‌ చేసి జ్యోత్స్న రూంలోకి వెళ్తుంది. రూంలో జ్యోత్స్న కోపంగా దీప కొట్టిన విషయం గుర్తు చేసుకుని ఇరిటేట్‌ అవుతుంది. పారిజాతాన్ని చూసి జ్యోత్స్న కోపంగా తిడుతుంది. రూంలోకి ఎందుకు వచ్చావు అని అడగ్గానే..ఈరాత్రికిమనం నిద్రపోకూడదు కదా అని చెప్పగానే.. నీకు ఏదో ఇన్మఫర్మేషన్‌ అందినట్టు ఉంది అని జ్యోత్స్న అడగ్గానే.. అది నీకు కన్మఫర్మేషన్‌ అయినట్టు ఉంది అంటూ జ్యోత్స్నను తిడుతుంది.  తన మాటలతో పారిజాతం, జ్యోత్స్నకు నిద్ర లేకుండా చేస్తుంది.

తర్వాత జ్యోత్న్నకు కార్తీక్‌ తాళి కడుతున్నట్టు కాంచనకు కల వస్తుంది. దీంతో నిద్రలోంచి ఉలిక్కిపడి నిద్ర లేస్తుంది. కోపంగా లేదు అలా జరగడానికి వీల్లేదు అంటూ అరుస్తుంది. శౌర్య నిద్ర లేచి నాన్నమ్మ ఏమైంది అని అడగ్గానే..మీ నాన్నకు జ్యోత్స్నకు పెళ్లి అయినట్టు కల వచ్చిందే.. అని మనసులో అనుకుని ఏమీ లేదు పీడకల వచ్చింది నువ్వు పడుకో అని చెప్పగానే.. నిద్రలో లేస్తే మంచినీళ్లు తాగాలని మా అమ్మ చెప్పి అంటూ నీళ్లు ఇవ్వగానే.. కాంచన చేతిలోంచి నీళ్ల గ్లాస్‌ కిండ పడి పగిలిపోతుంది. దీంతో కాంచన షాక్‌ అవుతుంది.

Advertisement

తర్వాత పొద్దున్నే కాంచన తనకు వచ్చిన కల గురించి శ్రీధర్‌కు చెప్తుంది. కార్తీక్‌ వచ్చి ఏం కల వచ్చింది అని అడగ్గానే.. నువ్వు జ్యోత్స్న మెడలో తాళి కట్టినట్టు కల వచ్చిందట అని శ్రీధర్‌ చెప్పగానే.. దీప, కార్తీక్‌ షాక్‌ అవుతారు. నిన్ను వాడికి చెప్పమన్నానా..? అంటుంది కాంచన. పడుకుంటే ఎన్నో కలలు వస్తుంటాయి. అవన్నీ నిజం అవుతాయా..? అంటూ కార్తీక్‌ చెప్పగానే.. కాంచన అది నిజంగా జరుగుతున్నట్టు వచ్చిందిరా అని చెప్పగానే.. దీప షాక్‌ అవుతుంది. ఇంతలో కార్తీకదీపం 2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×