E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode April 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌ : చచ్చిపోతానని కార్తీక్ ను బెదిరించిన జ్యోత్స్న

Karthika Deepam 2 Serial Today Episode April 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌ : చచ్చిపోతానని కార్తీక్ ను బెదిరించిన జ్యోత్స్న
Advertisement

Karthika Deepam 2  serial today Episode: తాళి తీసి కార్తీక్‌ చేతిలో పెట్టి ఈ తాళి నా మెడలో కట్టి నన్నే నీ పెళ్లి కానుకగా తీసుకో బావ. ఇందులో అద్బుతం ఏంటో తెలుసా..? నీ మొదటి పెళ్లి రోజు నాడే రెండో పెళ్లి అంటూ జ్యోత్స్న కోపంగా చెప్తుంది. దీంతో కార్తీక్‌ కోపంగా చూస్తుంటాడు. ఏంటి బావ ఆలోచిస్తున్నావు.. నేను ఇదంతా ఇప్పటికిప్పుడు అనుకోలేదు.. రాత్రే ప్లాన్ చేసుకున్నాను.. మేళాలు, ముహూర్తాలు, లేవని ఆలోచించొద్దు బావ అవన్నీ నా మనసు ముందు ఆగిపోవాల్సిందే. నువ్వే నా మెడలో తాళి కట్టు అన్ని సమస్యలకు ఇదో పరిష్కారం.. ఇదే మన పెళ్లి కానుక అని దీపకు పరిచయం చేయ్‌ తను చాలా సర్‌ఫ్రైజ్‌ అవుతుంది అంటూ చెప్పగానే.. కార్తీక్‌ తిడతాడు. తాళి నీ దగ్గర పెట్టుకో.. ఒ పుల్ల ఐస్‌క్రీమ్‌ తీసుకుని ఇంటికి వెళ్లిపో.. నేను మాత్రం షేర్‌ ఆటోలో వెళ్లిపోతాను అంటూ కార్తీక్‌ వెళ్లబోతుంటే..

కారులోంచి గన్‌ తీసుకొచ్చి తనను తాను చంపుకుంటానని నాకేమైనా అయితే మీ అత్త బతకదు.. ఇది బొమ్మ తుపాకి కాదు బావ.. అంటూ తాళి కడతావా..? ట్రిగర్‌ నొక్కుతావా..? అంటూ బెదిరిస్తుంది. చనిపోయేంత ధైర్యం నీకు లేదు జ్యోత్స్న.. నీకు మంచి సంబంధం చూస్తాను పెళ్లి చేసుకో జ్యోత్స్న అనగానే.. మూడే మూడు అంకెలు లెక్క పెడతాను తాళి కట్టకపోతే చస్తాను అంటూ మూడు లెక్క పెట్టి ట్రిగర్‌ నొక్కుతుంది. కార్తీక్‌ షాకింగ్‌ గా జ్యోత్స్న అంటాడు. కట్‌ చేస్తే కాశీ కారు క్లీన్‌ చేస్తూ ఉంటాడు. స్వప్న టీ తాగుతూ వచ్చి పక్కన కూర్చుని కాఫీ తాగుతుంటుంది. అప్పుడే కాశీకి స్వప్ప వాళ్లు అమ్మ కాఫీ ఇస్తుంది.

Advertisement

కాశీ కాఫీ తాగుతూ.. స్వప్నతో జీవితం గురించి మాట్లాడుతుంటాడు. కలిసి బతికేటప్పుడు కొన్ని అభిప్రాయబేధాలు వస్తాయి. లేదా కొన్ని తప్పులు చేయోచ్చు. ఒకరి తప్పుల్ని ఒకరు క్షమించడమే కదా జీవితం అంటే అని చెప్పగానే. మనకు నచ్చని ఆలోచని గొడవల మధ్య నుంచి విడుదల అవ్వడం. అసలు ప్రేమకు అర్థం ఏంటి..? ఎదుటి వాళ్లు కోరుకుంది ఇవ్వమే కదా.. నీ నుంచి నాకు స్వేచ్చ కావాలి. అదే నువ్వు ఇవ్వనంటున్నావు.. నేను కోరుకున్నదే నాకు ఇవ్వలేనప్పుడు ప్రేమను ఎలా ఇస్తావు.. అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో కాశీ ఆలోచనలో పడిపోతాడు.

మరోవైపు దశరథ ఆలోచిస్తుంటాడు. జరిగేదంతా చూస్తుంటే.. కార్తీక్‌ను దీపను వేరు చేసేందుకు జ్యోత్స్న ఏం ప్లాన్‌ చేయడం లేదు కదా అని ఆలోచిస్తుంటాడు. అప్పుడే శివనారాయణ వచ్చి జ్యోత్స్నకు కాల్ చేశావా అని అడగ్గానే.. చేశాను నాన్న కాల్‌ కలవడం లేదు అని చెప్పగానే.. ఇదంతా చూస్తుంటే.. జ్యోత్స్న ఏదో కావాలని చేసినట్టు ఉంది అంటూ శివనారాయణ అంటాడు. అప్పుడే వచ్చిన సుమిత్ర అంత అవసరం జ్యోత్స్నకు ఏముంది మామయ్య గారు అని అడుగుతుంది. కానీ ఈరోజు కార్తీక్‌ దీప పెళ్లి రోజు అని తెలిసి కూడా కార్తీక్‌ను ఎందుకు గుడికి  తీసుకెళ్లాలి.. అక్కడి నుంచి కార్తీక్‌ను పంపించేసి పారిజాతాన్ని తీసుకుని హాస్పిటల్‌కు వెళ్లొచ్చు కదా అంటూ అనుమానం వ్యక్తం చేస్తే.. అయితే జ్యోత్స్న తప్పు చేస్తే దాన్ని నేనే క్షమించను.. ఇంటికి రాని చెప్తాను.. అంటూ కోప్పడుతుంది.

Advertisement

మరోవైపు స్వప్న ఇంటికి వెళ్లిన వసంత్‌ స్వప్నకు గాజులు వేయబోతుంటే.. కాశీ చూస్తూ ఇప్పుడు తెలుస్తుంది నీ మనసు ఏంటో అని మనసులో అనుకుంటాడు. స్వప్న మాత్రం ఈరోజు మంచిరోజు కాదని తర్వాత వేసుకుంటానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.  మరోవైపు కార్తీక్‌ ఇంకా ఇంటికి రాలేదని కాంచన తిడుతుంది. దీపను కార్తీక్‌ కు ఫోన్‌ చేసి వెంటనే రమ్మను అంటూ ఆర్డర్‌ వేస్తుంది. సరే అంటూ దీప లోపలికి వెళ్తుంది. మరోవైపు జ్యోత్స్న తనను తాను కాల్చుకుంటుంటే.. కార్తీక్‌ ఆపేసి జ్యోత్స్నను తిడతాడు. ఇంతలో కార్తీక్‌కు దీప కాల్‌ చేస్తుంది. జ్యోత్స్న ఫోన్‌ తీసుకుని దీపను తిడుతుంది. కార్తీక్ ను పంపమని అడిగితే పంపను.. కార్తీక్‌ నీ బావ కాదు.. నా బావ అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. కార్తీక్ కోపంగా జ్యోత్స్న చేతిలో తాళి లాక్కుని పడేసి.. బలవంతంగా కారులో ఎక్కించుకుని ఇంటికి బయలుదేరుతాడు కార్తీక్‌. ఇంతలో కార్తీకదీపం 2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×