E-Paper
Advertisement

Illu Illaalu Pillalu Dheeraj : కన్నడ టు తెలుగు.. ధీరజ్ ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Illu Illaalu Pillalu Dheeraj : కన్నడ టు తెలుగు.. ధీరజ్ ఒక్కరోజు రెమ్యూనరేషన్..?
Advertisement

Illu Illaalu Pillalu Dheeraj : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి.. లేటెస్ట్ గా వచ్చినా జనాలను బాగా ఆకట్టుకుంది. మధ్యతరగతి కుటుంబంలో పిల్లలను పెంచిన ఒక తండ్రికి ఎదురైన పరిస్థితులు.. అలాగే లేచిపోయి పెళ్లి చేసుకొని అనాధగా ఉన్న వ్యక్తి ఒక కుటుంబాన్ని ఎలా పెంచుకున్నాడు. అతని పిల్లల కోసమే ఏదైన చేస్తాడు. ఆ సీరియల్ మెయిన్ క్యారక్టర్ రామరాజు.. ఆయనకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు.. అందులో చిన్న కొడుకు ధీరజ్.. తండ్రిని ఎదురించి తన కాళ్ల మీద నిలబడతాడు. తండ్రి కొడుకుల మధ్య ప్రేమను ఈ సీరియల్లో చక్కగా చూపించారు. ధీరజ్ పాత్రలో నటుడు నితిన్ ఆద్వి నటించారు.. ఆయన బ్యాగ్రౌండ్, ఒక్కరోజుకు తీసుకొనే రెమ్యూనరేషన్ ఎంతో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

నితిన్ ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

కన్నడ యాక్టర్ నితిన్ అద్వి తెలుగులో వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఈయన మొదటగా స్టార్ మా లో ప్రసారం అయిన కుంకుమ పువ్వు అనే సీరియల్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సీరియల్ తో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత కొన్ని షోలలో సందడి చేశాడు. ప్రస్తుతం స్టార్ మా సక్సెస్ ఫుల్ సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు లో నటిస్తున్నాడు. ధీరజ్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగులో సక్సెస్ అవుతున్న ఈ కుర్రాడు రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే సంపాదిస్తున్నాడు. ఒక్కరోజుకు దాదాపుగా 25 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని టాక్.. నెలలో 25 రోజులు షూటింగ్ ఉంటే లక్షల్లో సంపాదిస్తున్నాడు.. సీరియల్స్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

Advertisement

Also Read :గెటప్ శ్రీను, చంద్ర నిజ స్వరూపం ఇదే..జబర్దస్త్ లో నమ్మలేని నిజాలు..

ధీరజ్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. 

స్టార్ మా లో ప్రసారం అవుతున్న టాప్ సీరియల్స్ లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి.. టాప్ 2 రేటింగ్ లో కొనసాగుతుంది. ఈ సీరియల్ లో ధీరజ్ పాత్రలో నితిన్ నటించాడు. కన్నడ నటుడు అయిన ఈ కుర్రాడు అక్కడ ఇండస్ట్రీలో వరుసగా సీరియల్స్ చేశాడు. ఆ తర్వాత స్టార్ మాలో ప్రసారం సక్సెస్ టాక్ ను అందుకున్న కుంకుమ పువ్వు సీరియల్ లో నటించాడు. ఈ డైలీ సీరియల్ ఆయన నటనకు ఫుల్ మార్క్స్ పడేలా చేసింది.. ఆ తర్వాత ఇల్లు ఇల్లాలు పిల్లలు చేస్తున్నాడు. తెలుగులో ఈ సీరియల్ తర్వాత మరో సీరియల్ చేస్తున్నాడని తెలుస్తుంది. అలాగే కన్నడలో కూడా పలు సీరియల్స్ వాళ్ళు నటిస్తూ బిజీగా ఉన్నాడు.. కన్నడ లో పుట్టి పెరిగిన ఈ హీరో తెలుగులో నటుడుగా మంచి గుర్తింపు పొందడం మామూలు విషయం కాదు. ఈమధ్య తెలుగు బుల్లితెరపై కన్నడ స్టార్ట్ ఎక్కువగా కనిపిస్తున్నారు. వాళ్లు చేస్తున్న సీరియల్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. దాంతో తెలుగు వాళ్ల కన్నా కన్నడ నటీనటులకే మంచి డిమాండ్ ఉంది.. ఇకముందు ఎలాంటి సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులను నితిన్ మెప్పిస్తాడో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×