E-Paper
Advertisement

లగ్జరీ ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి.. ఖరీదు ఎంతంటే?

లగ్జరీ ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి.. ఖరీదు ఎంతంటే?
Advertisement

Film industry:సినిమా సెలబ్రిటీలు ఎంత లగ్జరీగా జీవితాన్ని గడుపుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తమ హోదాకి తగ్గట్టుగా అన్నీ లగ్జరీ బ్రాండ్లను ఉపయోగిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అంతేకాదు అప్పుడప్పుడు అత్యంత ఖరీదైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.. ఈ క్రమంలోనే తాజాగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని.. ఇటు బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన ఒక నటి.. ఇప్పుడు ఏకంగా ఖరీదైన కారును కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకవైపు ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతుంటే.. ఈ ముద్దుగుమ్మ చాలా స్మార్ట్ గా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది..

ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..

ఆమె ఎవరో కాదు ప్రముఖ కన్నడ బ్యూటీ మోక్షిత. తన కెరీర్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఒక ఖరీదైన ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసి తన కలను నెరవేర్చుకున్నాను అంటూ ఆ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది మోహిత. మహీంద్రాకి చెందిన Mahindra XUV400 EV ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసింది. కుటుంబ సభ్యుల సమక్షంలో కొత్త వాహనాన్ని సొంతం చేసుకుంది.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఆమె స్వయంగా షేర్ చేయడంతో.. అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.. ఈ నేపథ్యంలోనే దీని ధర కూడా అందర్నీ ఆశ్చర్యపరుస్తుందని చెప్పవచ్చు.

కారు ఖరీదు, ఫీచర్స్ ఇవే..

Advertisement

కన్నడ నటి మోక్షిత సొంతం చేసుకున్న ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ధర మార్కెట్ ప్రకారం రూ.17 లక్షల నుండీ రూ.20 లక్షల మధ్య ఉంటుందని సమాచారం. ముఖ్యంగా ఆకర్షణీయమైన అమ్మాయిల ఫేవరెట్ కలర్ రెడ్ కలర్ కారును ఆమె సొంతం చేసుకున్నారు . ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ప్రస్తుతం మోక్షిత డ్రైవింగ్ సీట్లో కూర్చొని చాలా హుందాగా ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇకపోతే మోక్షిత కొనుగోలు చేసిన ఈ మహేంద్ర ఫ్లాగ్ షిప్ ఎలక్ట్రిక్ SUV ఒకే ఛార్జ్ పై 456 కిలోమీటర్ల రేంజ్ ను కలిగి ఉంది . కేవలం 8.3 సెకండ్లలో 100 kmph వేగాన్ని అందుకోగలదు. ఇది కేవలం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో మాత్రమే లభిస్తుంది.

also read:పాలనలో త్రిష జోక్యం.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన సీఎం విజయ్!

బిగ్ బాస్ బ్యూటీ కెరియర్..

Advertisement

మోక్షిత కెరియర్ విషయానికి వస్తే .. ప్రస్తుతం జీ కన్నడలో ప్రసాదం అవుతున్న జగద్ధాత్రి అనే సీరియల్ లో లీడ్ రోల్ పోషిస్తుంది . గతంలో కన్నడ బిగ్ బాస్ రియాల్టీ షోలో కనిపించి అక్కడ విపరీతమైన ప్రజాదారణ పొందింది. ఇకపోతే పారు అనే సీరియల్ ద్వారా బుల్లితెర ఆడియన్స్ కి దగ్గరైన మోక్షిత .. బిగ్ బాస్ కన్నడ సీజన్ 11తో పెద్ద బ్రేక్ అందుకుంది. ముక్కుసూటిగా మాట్లాడే తీరు.. నటన శైలి ప్రజలకు ఆమెను మరింత దగ్గర చేశాయి. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమెకు అవకాశాలు, ప్రజాదారణ రెండు రెట్టింపు అయ్యాయని చెప్పాలి.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×