E-Paper
Advertisement

Kissik Talks Show: కప్పు గెలిచిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.. బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల ఎమోషనల్!

Kissik Talks Show: కప్పు గెలిచిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.. బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల ఎమోషనల్!
Advertisement

Kissik Talks Show: బిగ్ టీవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన పాపులర్ డిజిటల్ టాక్ షో ‘కిస్సిక్ టాక్స్’ (Kissik Talks) లో కళ్యాణ్ సందడి చేశారు. గ్లామరస్ యాంకర్ వర్ష హోస్ట్‌గా బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాలతో చేసిన ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాల క్రేజ్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఈ క్రమం లో హౌస్ లోని విశేషాలు, గెలుపు వెనుక ఉన్న అసలైన సీక్రెట్స్ వంటి వాటిపై  కళ్యాణ్ పడాల ఓపెన్‌గా మాట్లాడారు.

కప్పు గెలిచిన ఆ క్షణం.. బాడీ మొత్తం షివరింగ్

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు నాగార్జున గారు తన చేయి ఎత్తిన క్షణాన్ని కళ్యాణ్ గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. “వేదికపై బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల అనే పేరు వినిపించగానే నాకేమీ గుర్తు రాలేదు. ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోయి కింద పడిపోయాను. అసలు ఎందుకు పడిపోయానో, ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. బాడీ మొత్తం విపరీతమైన షివరింగ్‌ వచ్చేసింది” అని చెప్పుకొచ్చారు.

Advertisement

Also read :Kissik Talks Show : బిగ్ బాస్ విన్నర్ పరిస్థితి ఇలా మారిందేంటి..? పాపం బుక్కయ్యాడుగా..

ఈ క్రమంలోనే యాంకర్ వర్ష స్పందిస్తూ.. నువ్వు ట్రోఫీ అందుకుంటున్నప్పుడు స్టేజీ కింద ఉన్న ప్రేక్షకులు, నీ ఫ్యాన్స్ కళ్లల్లో నీళ్లు తిరిగాయని గుర్తు చేయగా.. హౌస్ నుండి బయటకు వచ్చాక ఆ విజువల్స్ చూసి తాను కూడా విపరీతంగా ఎమోషనల్ అయ్యానని కళ్యాణ్ అన్నాడు. విన్నర్ అనౌన్స్ కాగానే హైదరాబాద్‌లోని మెయిన్ సెంటర్స్ అన్నీ అభిమానుల సంబరాలతో నిండిపోయాయని, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, లేడీస్ ఒక పండగలా సెలబ్రేట్ చేసుకున్నారని వర్ష పేర్కొంది.

 మామయ్య బలరాం ఎమోషనల్ బాండింగ్

Advertisement

ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ సపోర్ట్ గురించి చెప్తూ కళ్యాణ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. “నన్ను లైవ్‌లో చూడటం కోసం మా మామయ్య బలరాం గారు స్పెషల్ గా ఈవెనింగ్ ఫ్లైట్ బుక్ చేసుకుని మరీ అన్నపూర్ణ స్టూడియోస్ కి వచ్చారు. కానీ ఆ విషయం నాకు అప్పుడు తెలియదు. మొన్న సంక్రాంతి పండగకి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ విషయం తెలిసి షాక్ అయ్యాను. ఎలాగో రెండు రోజుల్లో ఇంటికి వస్తాను కదా మామ.. అంత దూరం కష్టపడి ఎందుకు వచ్చావు? అని అడిగితే ఆయన కేవలం నవ్వేశారు” అంటూ తనపై మామయ్యకు ఉన్న ప్రేమని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు.

బిగ్ బాస్ గెలుపుకు సూత్రాలు లేవు

చాలామంది బిగ్ బాస్ గెలవడానికి కొన్ని స్ట్రాటజీలు ఉంటాయని భావిస్తారు. కానీ దీనిపై కళ్యాణ్ చాలా ప్రాక్టికల్ గా, జెన్యూన్ గా స్పందించాడు. “బిగ్ బాస్ గెలవడానికి ఎలాంటి రూల్స్, ఫార్ములాలు లేవు. ఏ సీజన్ కి ఆ సీజన్ చాలా ప్రత్యేకం. ఒక సీజన్ లో కంటెస్టెంట్ చూపించే అగ్రెసివ్ ఆటిట్యూడ్ నచ్చితే, మరో సీజన్ లో సైలెన్స్ నచ్చుతుంది. ఈ 9వ సీజన్ లో నాలోని ‘జెన్యూనిటీ’ (Genuineness) ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అంతమాత్రాన ప్రతి సీజన్ లో జెన్యూన్ గా ఉన్నవాళ్లే గెలుస్తారని గ్యారెంటీ లేదు. ఎందుకంటే హిస్టరీ చూస్తే ఎంతో జెన్యూన్ గా ఆడిన వాళ్లు కూడా మధ్యలోనే ఎలిమినేట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి బిగ్ బాస్ విన్నర్ మైండ్ సెట్‌ను మనం ముందే జడ్జ్ చేయలేం”అని క్లారిటీ ఇచ్చాడు.

 హాయ్ నాన్న సాంగ్.. వాష్ రూమ్ సింగింగ్

ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 10 కి సంబంధించిన ప్రోమోస్ హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై కళ్యాణ్ రియాక్ట్ అవుతూ.. *”నాకు ఇప్పటికీ బిగ్ బాస్ ట్రోమా రన్ అవుతూనే ఉంది. పొద్దున్నే లేవగానే ఏవైనా పాటలు వినిపించినా, లేదా రూమ్‌లో సడన్ గా లైట్లు ఆఫ్ అయినా.. నేనింకా హౌస్‌లోనే ఉన్నానేమో అని అనిపిస్తుంది . ఆ జ్ఞాపకాలు అంత త్వరగా పోవు” అన్నాడు.

Also read :బాలయ్య-కొరటాల శివ ‘#NBK112’ ముహూర్తం ఫిక్స్.. ఏపీ రాజధాని వేదికగా క్రేజీ లాంచ్!

ఇక హౌస్ లో ఉన్నప్పుడు నాని నటించిన బ్లాక్‌బస్టర్ ‘హాయ్ నాన్న’ సినిమాలోని ‘నాగాజు బొమ్మ.. నాగాజు బొమ్మ’ అనే సాంగ్‌ను ఎక్కువగా హమ్ చేసేవాడట కళ్యాణ్. దీంతో యాంకర్ వర్ష లైవ్‌లో ఆ పాట పాడమని డిమాండ్ చేయగా.. ‘నేను పాడితే ఇక్కడ ఉన్నవాళ్లంతా పారిపోతారు. నాకంత సీన్ లేదు, మైకుల ముందు పాడటం చాతకాదు “అని తప్పించుకున్నాడు.. అయినా వర్ష వదలకుండా.. *”ఇది మైక్ కాదు, నువ్వు వాష్ రూమ్ లో ఉన్నావని అనుకోని పాడు”అనగా.. *”నేను వాష్ రూమ్ లో కూడా పాటలు పాడను” అంటూ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చి ఇంటర్వ్యూలో నవ్వులు పూయించాడు కళ్యాణ్ .

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×