E-Paper
Advertisement

డైరెక్టర్ పై చేయి చేసుకున్న జబర్దస్త్ బ్యూటీ.. ఎందుకంటే?

డైరెక్టర్ పై చేయి చేసుకున్న జబర్దస్త్ బ్యూటీ.. ఎందుకంటే?
Advertisement

Jabardasth:బుల్లితెర పై గత దశాబ్ద కాలానికి పైగా నిర్విరామంగా మంచి టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంటూ అంతకుమించిన వినోదాన్ని ఆడియన్స్ కి పంచుతూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంటున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు.. ఇప్పటికే ఎంతోమంది ఈ వేదికగా తమ టాలెంట్ ను నిరూపించుకొని సినిమాలలో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో ఐశ్వర్య వల్లింగాల కూడా ఒకరు. అందం, అభినయంతో అద్భుతమైన కామెడీ టైమింగ్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న ఈమె.. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో మంచి క్రేజ్ ను కూడా సొంతం చేసుకుంది. షోలలో ఎప్పుడూ సందడి చేస్తూ.. అందంతో ఆకట్టుకునే ఈ చిన్నది.. ఇటీవల ఒక డైరెక్టర్ పై చేయి చేసుకున్న ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపింది కూడా.. మరి ఆ డైరెక్టర్ ఎవరు? ఎందుకు ఐశ్వర్య చేయి చేసుకోవాల్సి వచ్చింది? అతడు ఈమెతో ఏదైనా తప్పుగా ప్రవర్తించారా? అనే కోణంలో అభిమానులు సైతం ఆరా తీస్తున్నారు.

ప్రేమ , పెళ్లి పై కామెంట్స్..

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య అటు వ్యక్తిగత ఇటు వృత్తిపర విషయాలను పంచుకుంది . సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, ప్రేమ జీవితం, భవిష్యత్తు ప్రణాళికల గురించి ఒక్కొక్కటిగా అభిమానులతో పంచుకుంది. అంతేకాదు గతంలో ఒక సినిమా ప్రమోషన్స్ సమయంలో నటుడు సాయితో కలిసి చేసిన స్కిట్, అందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవ్వడంతో చాలామంది సాయి తో ఈమె ప్రేమలో పడిందని, పెళ్లి కూడా చేసుకుందని కామెంట్లు చేశారు. అయితే ఒక సినిమా ప్రచారంలో భాగంగా చేసిన స్కిట్ మాత్రమే.. దానిని ప్రజలు నిజంగా నమ్మడం ఆశ్చర్యపరిచింది అంటూ తెలిపింది. అలాగే తన ప్రేమ జీవితం గురించి ఇలా మాట్లాడుతూ.. “ప్రస్తుతం తాను సింగిల్ గా ఉన్నానని పెళ్లి వ్యవహారాలన్నీ కూడా తన తల్లికే వదిలేసానని” వెల్లడించింది .

డైరెక్టర్ చెంప చల్లుమనిపించిన ఐశ్వర్య..

Advertisement

అలాగే సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడుతూ..” నేను సినీ పరిశ్రమలో ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొన్నాను. కమిట్మెంట్ పేరుతో ఫోన్ కాల్స్ వచ్చేవి. మొదట్లో కమిట్మెంట్ అంటే పని పట్ల నిబద్ధత అని భావించి.. నేను చాలా కమిట్మెంట్ తో, హార్డ్ వర్క్ చేస్తాను అని చెప్పేదాన్ని. కానీ వారు అడిగిన కమిట్మెంట్ అసలు అర్థం తెలిసిన తర్వాత ఒక సందర్భంలో ఒక డైరెక్టర్ ను కొట్టి అక్కడి నుంచి బయటకు వచ్చాను” అంటూ తెలిపింది ఐశ్వర్య. మొత్తానికైతే ఈ కమిట్మెంట్ కారణంగానే ఒక డైరెక్టర్ చెంప చెల్లుమనిపించింది ఐశ్వర్య. ప్రస్తుతం ఐశ్వర్య చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ALSO READ:పెద్దిపై రామ్ చరణ్ అసంతృప్తి.. విడుదలపై డైరెక్టర్ – నిర్మాతల మధ్య గందరగోళం?

ఆఫర్స్ పై ఐశ్వర్య కామెంట్..

Advertisement

ఇక అవకాశాల గురించి ఆమె మాట్లాడుతూ.. “నేను అవకాశం కావాలని ఎవరిని నోరు తెరిచి అడగను. అయినా సరే నాకు అవకాశాలు వస్తున్నాయి. కొన్నిసార్లు డబ్బింగ్ థియేటర్లలో లేదా నా స్నేహితుల ద్వారా నా క్లిప్స్ చూసి కూడా అవకాశాలు వచ్చిన రోజులు ఉన్నాయి.. నిరంతరంగా టీవీ షోలు , సీరియల్స్ , వెబ్ సిరీస్ చేస్తున్నప్పటికీ ఇంకా సరైన బ్రేక్ రాలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక షూటింగ్స్ ఉన్న రోజు జబర్దస్త్ లేదా శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షో నుంచి పిలుపు వస్తే షెడ్యూల్ సర్దుబాటు చేసుకుని ఈ షోలకు వెళ్లేదాన్ని” అంటూ ఆమె తెలిపింది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×