E-Paper
Advertisement

“జబర్దస్త్‌కి అప్పటి క్రేజ్ లేదు.. అసలు కారణం ఇదే!”

“జబర్దస్త్‌కి అప్పటి క్రేజ్ లేదు.. అసలు కారణం ఇదే!”
Advertisement

Jabardasth Craze: జబర్దస్త్…ఒకప్పుడు దీనికి ఉండే క్రేజ్ వేరు..ముఖ్యంగా గురువారం రాత్రి అయితే  చాలు టీవీల ముందు ఈగర్ గా వెయిట్ చేసేవారి జనాలు.అలా ఎపిసోడ్ ఎప్పుడొస్తుందా ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూసేంత క్రేజ్ ఉండేది.కానీ ఆ క్రేజ్ ఇపుడు అస్సలు లేదని,ఆ క్రేజ్ మొత్తం పోయిందని  ప్రముఖ కమెడియన్ అదిరే అభిచేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తన సినిమా కర్మాఖ్య ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2013లో జబర్దస్త్ మొదలైనప్పుడు  పరిస్థితులు పూర్తిగా వేరుగా ఉండేవని చెప్పాడు. అప్పట్లో టీవీనే అందరికీ మెయిన్ ఎంటర్‌టైన్‌మెంట్. గురువారం రాత్రి ఎపిసోడ్ మిస్ అయితే మళ్లీ చూసే ఛాన్స్ కూడా ఉండేది కాదు. అందుకే షో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు వెయిట్ చేసేవారని గుర్తు చేశాడు.

Advertisement

క్రేజ్ ఎందుకు తగిపోయిందంటే ..

కానీ 2017 తర్వాత మొత్తం సీన్ మారిపోయిందని  చీప్ గా మొబైల్ డేటా రావడం, ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండటంతో టీవీ కంటే మొబైల్‌కే అందరు అతుక్కుపోవడంతో జబర్దస్త్ ని టీవీలో చూసే బదులుగా ఫోన్ లలో చూసుకుందాం లే అనే మూడ్ లోకి వెళ్లిపోయారని తెలిపాడు.

Advertisement

also read :ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ‘రావు బహదూర్’ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది!

అంతే కాదు… 2020లో కరోనా వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత మారిపోయాయని అభి తెలిపాడు. లాక్‌డౌన్ టైమ్‌లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు బాగా పాపులర్ అయ్యాయి. జబర్దస్త్ ఎపిసోడ్లు కూడా డిజిటల్‌లో అందుబాటులోకి రావడంతో ప్రేక్షకులు తమకు నచ్చిన టైమ్‌లో చూసే అలవాటు చేసుకున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు… మధ్యలో పాజ్ చేయొచ్చు… మళ్లీ చూడొచ్చు. దీంతో టీవీ ముందు టైమ్‌కు కూర్చోవాల్సిన అవసరమే లేకుండా పోయిందని చెప్పాడు.

సెకన్ల రీల్‌లోనే జనాలు ఎంటర్‌టైన్

ఇప్పుడు పరిస్థితి మాత్రం మరో లెవెల్ వెళ్లిపోయిందని అభి అభిప్రాయపడ్డాడు.యూట్యూబ్ ఓపెన్ చేసినా కామెడీ… ఇన్‌స్టాగ్రామ్ లో చూసినా కామెడీ… ఫేస్‌బుక్‌లోకి వెళ్లినా కామెడీ… ఇలా ఎక్కడ చూసినా నవ్వించే వీడియోలే కనిపిస్తున్నాయి. కొన్ని సెకన్ల రీల్‌లోనే జనాలు ఎంటర్‌టైన్ అవుతున్నారు. అలాంటప్పుడు గంటపాటు ఒకే షో చూసే ఓపిక చాలామందిలో తగ్గిపోయిందని చెప్పుకొచ్చాడు.

జబర్దస్త్ విషయానికి వస్తే 2013 నుంచి తెలుగు బుల్లితెరపై ఈ కామెడీ ఒక సంచలనం స్ప్రుష్టించింది అనే చెప్పాలి.ఈ ఒక్క షో నుంచే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, చమ్మక్ చంద్ర, అదిరే అభి లాంటి ఎంతోమంది స్టార్ కమెడియన్లు ప్రేక్షకులకు పరిచయమయ్యారు కూడాఇక . తర్వాత వీళ్లలో చాలామంది సినిమాల్లోకి వెళ్లి కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇప్పటికీ ఈ  జబర్దస్త్ స్కిట్‌లకి యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ మనకి కనిపిస్తుంటాయి కూడా.

జబర్దస్త్ వేసిన ముద్ర మాత్రం ఎప్పటికీ

ఓటీటీలు, యూట్యూబ్, రీల్స్, షార్ట్ వీడియోలు… ఇలా  ఎంటర్ టైన్ మెంట్ కి వందల ఆప్షన్లు వచ్చేసిన ఈ రోజుల్లో ఏ ఒక్క షోకైనా ఒకప్పుడు ఉన్నంత క్రేజ్ కొనసాగించడం అంత ఈజీ కాదు. అయినా తెలుగు బుల్లితెర కామెడీ చరిత్రలో జబర్దస్త్ వేసిన ముద్ర మాత్రం ఎప్పటికీ చెరగదనేది కామెడీ లవర్స్ మాట.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×