E-Paper
Advertisement

పేరుకే పెద్ద కమెడియన్..చందాలు వసూలు చేసి కూతురి పెళ్లి చేశానంటూ ఎమోషనల్!

పేరుకే పెద్ద కమెడియన్..చందాలు వసూలు చేసి కూతురి పెళ్లి చేశానంటూ ఎమోషనల్!
Advertisement

Jabardasth Comedian: బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్(Jabardasth) కార్యక్రమానికి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది గత పుష్కరకాలంగా ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం వెండితెరపై ఎంతో బిజీ అవుతున్నారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రైజింగ్ రాజు (Raising Raju)ఒకరు.

జబర్దస్త్ జీవితాన్ని ఇచ్చింది..

ఈయన ప్రముఖ కమెడియన్ హైపర్ ఆదితో కలిసి టీం లీడర్ గా జబర్దస్త్ కార్యక్రమంలో పనిచేశారు హైపర్ ఆది రైజింగ్ రాజు అంటూ ఎన్నో అద్భుతమైన స్కిట్లు చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రైజింగ్ రాజు ఇటీవల కాలంలో బుల్లితెరపై చాలా తక్కువగా కనిపిస్తున్నారని చెప్పాలి. అయితే ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన జీవితంలో ఎదురైనా కష్టాల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. రైజింగ్ రాజుకు జబర్దస్త్ కార్యక్రమం పునర్జన్మను ఇచ్చిందని తెలిపారు.

హైపర్ ఆది దేవుడితో సమానం..

Advertisement

తన ఫ్యామిలీ ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొందని కొన్ని సంవత్సరాలుగా తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని చివరికి తన కూతురి పెళ్లిని కూడా చందాలు తీసుకొని మరి చేశానంటూ ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. ఇలా కూతురు పెళ్లి పూర్తి అయిన తర్వాత కరోనా వచ్చిందని అదే సమయంలో తన అమ్మాయి డెలివరీ కోసం ఇంటికి వచ్చిందని రైజింగ్ రాజు తెలిపారు. ఆ సమయంలో తనకు జబర్దస్త్ లో కూడా పని లేకుండా పోయిందని రైజింగ్ రాజు తెలిపారు. కరోనా సమయంలో పని లేక తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని అలాంటి సమయంలోనే తనకు హైపర్ ఆది(Hyper Aadi) ఒక దేవుడిలా సహాయం చేశారని ఈ సందర్భంగా తెలియజేశారు.

ప్రతి నెల పేమెంట్ వచ్చేది.

Advertisement

కరోనా సమయంలో వయసు పైబడటంతో తనకు స్కిట్లు చేసే అవకాశం మాత్రం కల్పించలేదు. ఇలా తాను స్కిట్లు చేయకపోయినా నాకు రావాల్సిన ప్రతినెల పేమెంట్ హైపర్ ఆది ఇంటికి పంపించేవారని అలా ఆయన డబ్బు ఇవ్వటం వల్ల కరోనా సమయంలో తమ జీవితాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడిచాయి. నా దృష్టిలో హైపర్ ఆది దేవుడితో సమానం అంటూ ఈ సందర్భంగా రైజింగ్ రాజు ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక హైపర్ ఆది టీంలోనే రైజింగ్ రాజు స్కిట్లు చేయటం వల్ల ఇబ్బందులలో ఉన్న తనని ఆదుకుంటూ వచ్చారని తెలిసిన ఆది అభిమానులు తన మంచితనం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: ప్రభాస్ ఫౌజీ సినిమాని రిజెక్ట్ చేసిన యంగ్ హీరో..షాక్ లో హీరో ఫ్యాన్స్?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×