E-Paper
Advertisement

నిశ్చితార్థం చేసుకున్న జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

నిశ్చితార్థం చేసుకున్న జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
Advertisement

Jabardasth: ఈ ఏడాది వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలకు బాగా కలిసి వచ్చింది. ముఖ్యంగా కొంతమంది నిశ్చితార్థం చేసుకుంటే.. మరి కొంతమంది పెళ్లిళ్లు చేసుకుని అభిమానులను సర్ప్రైజ్ చేశారు.. ఇంకొంతమంది తల్లిదండ్రులైతే, మరి కొంతమంది తల్లిదండ్రులం కాబోతున్నాం అంటూ శుభవార్తలు ప్రకటించారు. అలా విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంటి హీరోలు వైవాహిక బంధం లోకి అడుగుపెట్టగా.. డైరెక్టర్ అట్లీ భార్య ప్రియ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అలాగే పుష్ప నటుడు ధనుంజయ్ తండ్రి కాబోతున్నాను అని తన భార్య బేబీ బంప్ ఫోటోలను అభిమానులతో పంచుకోగా .. మరొకవైపు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే మళ్లీ తల్లి కాబోతున్నాను అంటూ తన కూతురి ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న జబర్దస్త్ కమెడియన్..

అంతేకాదు ప్రముఖ హీరోయిన్ రెబా మౌనిక జాన్ గర్భవతి అవుతున్నానని ప్రకటించగా.. గత ఏడాది వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన హీరో నారా రోహిత్ భార్య ప్రముఖ హీరోయిన్ సిరి లెల్లా కూడా తల్లి కాబోతున్నానని బేబీ బంప్ ఫోటోలతో అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ఇలా చాలామంది సెలబ్రిటీలు ఈ ఏడాది శుభవార్త చెప్పగా ఇప్పుడు మరో జబర్దస్త్ కమెడియన్ వైవాహిక బంధం లోకి అడుగుపెడుతున్నారు. ఈ మేరకు నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఫైమాతో లవ్.. కేవలం రీల్ కోసమేనా?

Advertisement

ఎవరో కాదు ప్రముఖ కమెడియన్ ప్రవీణ్. పటాస్ షో ద్వారా పరిచయమైన ప్రవీణ్.. జబర్దస్త్ లో ఆది స్కిట్స్ లో చిన్న చిన్న పాత్రలలో కనిపించి తన కామెడీ టైమింగ్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు అందరి స్కిట్స్ లో మెయిన్ లీడ్ గా చేస్తున్న ఈయన గత కొంత కాలం క్రితం తోటి జబర్దస్త్ నటి ఫైమా తో లవ్ ట్రాక్ నడిపిస్తూ మరింత ఫేమ్ దక్కించుకున్నారు. అయితే అలాంటి ప్రవీణ్ ఇప్పుడు నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇకపోతే ప్రవీణ్ గతంలో ఫైమాను ప్రేమించాడని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ దీనిపై ఫైమా స్పందించింది. కేవలం తాము రీల్ కోసమే జంటగా నటించామని.. తన జీవితంలో ముందునుంచే ప్రవీణ్ అనే మరో వ్యక్తి ఉన్నారని, అతడినే వివాహం చేసుకోబోతున్నానని స్పందించి రూమర్లకు చెక్ పెట్టింది.

ALSO READ:టాక్సిక్ వివాదంపై కియారా క్లారిటీ!

ప్రవీణ్ కాబోయే భార్య ఎవరంటే?

Advertisement

ఇకపోతే ప్రవీణ్ ఈ నిశ్చితార్థాన్ని చాలా సింపుల్ గా ఇంట్లోనే జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిశ్చితార్థపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు కంగ్రాట్యులేషన్స్ అంటూ ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ కూడా కామెంట్ చేసింది. ఫైమాను మర్చిపోయి ప్రశాంతంగా ఉండు.. గాడ్ బ్లెస్స్ యు అంటూ ఒక అభిమాని కామెంట్ చేయగా.. మరి కొంత మంది నీ జీవితంలో సంతోషకర రోజులు మొదలయ్యాయి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ జంట చాలా చూడముచ్చటగా ఉంది అని త్వరలోనే పెళ్లి డేట్ కూడా అనౌన్స్ చేయాలని కోరుతున్నారు. ఇక ప్రవీణ్ వివాహం చేసుకోబోతున్న అమ్మాయి పేరు వంశిత. ఈమె బంధువుల అమ్మాయి అన్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా గత నాలుగేళ్ల క్రితం ప్రవీణ్ కి తోడుగా నిలిచిన తన తండ్రి బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతూ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన ప్రవీణ్ తండ్రిని కూడా కోల్పోవడంతో ఒంటరి అయ్యాడు. ఇకపోతే ప్రవీణ్ కి ఒక అన్న ఉన్నాడు. ఇక ఇలాంటి సమయంలో తన కొత్త కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పెళ్లి పేరుతో వైవాహిక బంధం లోకి త్వరలో అడుగు పెడుతున్నారు ప్రవీణ్.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×