E-Paper
Advertisement

సర్వస్వం అన్నాడు..8 ఏళ్లు వాడుకొని వదిలేసాడు- జబర్దస్త్ బ్యూటీ

సర్వస్వం అన్నాడు..8 ఏళ్లు వాడుకొని వదిలేసాడు- జబర్దస్త్ బ్యూటీ
Advertisement

Jabardasth Thanmay: గత దశాబ్ద కాలానికి పైగా ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ.. బెస్ట్ కామెడీ షో గా దూసుకుపోతున్న జబర్దస్త్ (Jabardasth) షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ షో ద్వారా పరిచయమైన ఎంతోమంది అటు సినీ రంగంలో కమెడియన్లుగా, హీరోలుగా, దర్శకులుగా రాణిస్తున్నారు.. అలా జబర్దస్త్ తొలినాళ్లల్లో లేడీ గెటప్స్ ను అబ్బాయిలు లేదా ట్రాన్స్ జెండర్స్ ఎక్కువగా పోషించేవారు. అలాంటి వారిలో తన్మయ్ (Thanmay) కూడా ఒకరు. జబర్దస్త్ లో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకున్న ఈమె అనూహ్యంగా షోను వీడారు. కొద్ది రోజుల క్రితమే ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు పంచుకున్న తన్మయ్.. తన ప్రియుడి చేతిలో మోసపోయిన విషయాన్ని కూడా బయటపెట్టారు.

దారుణంగా మోసపోయాను – తన్మయ్

ట్రాన్స్ జెండర్ అయిన తన్మయ్ గుంటూరుకి చెందినవారు. ఎంబీఏ చదువుతున్న సమయంలోనే జబర్దస్త్ ఆఫర్ రావడంతో ఈ షోలో అడుగు పెట్టారు. ఇక్కడ తన కామెడీ టైమింగ్ , పంచ్ డైలాగ్ తో మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు.అయితే ఆర్థిక సమస్యల కారణంగా ఎంబీఏ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా రాయలేదు. అంతకుముందు ఐపీసీసీ లో సీపీటీ క్లియర్ చేసినా.. ఆర్థిక స్తోమత లేకపోవడం వల్లే సిఏ కలను కూడా మధ్యలోనే వదిలేసుకున్నారు. జబర్దస్త్ లో కిర్రాక్ ఆర్పీ టీం లో పనిచేసిన తన్మయ్.. కిర్రాక్ ఆర్పీతో పాటే జబర్దస్త్ ను కూడా వీడారు. ఆ తర్వాత అదిరింది అనే షోలో కొంతకాలం చేసి మళ్లీ కనిపించకుండా పోయిన ఈమె.. ఇటీవల ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చి ఎన్నో విషయాలను పంచుకున్నారు.

Advertisement

also read:సర్వస్వం అన్నాడు..8 ఏళ్లు వాడుకొని వదిలేసాడు- జబర్దస్త్ బ్యూటీ

కుటుంబం తప్ప అంతా ఫేక్..

తన్మయ్ మాట్లాడుతూ..” ఒక కుటుంబం తప్ప మిగతా అంతా ఫేక్.. ఫ్రెండ్స్ ఉండరు ఎక్కడ చూసినా నమ్మి మోసపోవడం తప్ప ఇంకేం ఉండదు. ఒకడిని నేను చాలా ప్రేమించాను. ఎనిమిదేళ్లు లవ్ చేసాను. కష్టపడి ఈవెంట్స్ చేసిన డబ్బుతో నా ఫ్యామిలీతో పాటు అతడి ఫ్యామిలీని కూడా చూసుకున్నాను. మా ఇంటి దగ్గరే గుంటూరులోనే ఉంటాడు. కానీ వాడు నన్ను లవ్ చేయలేదు. నా డబ్బును ఇష్టపడి నన్ను దారుణంగా మోసం చేశాడు. అప్పటినుంచి ఈ లవ్ వద్దు అనిపించింది. అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారు.. పిల్లలు పుడతారు.. వాళ్లకి ఒక కుటుంబం ఉంటుంది. ఆడవాళ్ళకి కూడా పెళ్లి ,కుటుంబం ఉంటుంది కదా.. మరి ట్రాన్స్ జెండర్స్ పరిస్థితి ఏంటి? ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సొసైటీ అందరూ కూడా ద్వేషించే వారే. మమ్మల్ని చాలా చులకనగా చూస్తారు.

మూడుసార్లు చచ్చిబతికాను – తన్మయ్

Advertisement

రూపాయి సంపాదించుకుంటూ ఉన్న దానిలోనే బతికే సమయంలో ఎవడో ఒక వెధవ వచ్చి నేనున్నాను అంటాడు. వారి ప్రేమకు వారి సపోర్టుకి అట్రాక్ట్ అయిపోతాం. తల్లిదండ్రులు సహాయం, ఎవరూ మనల్ని పట్టించుకోనప్పుడు అతను చూపించే ప్రేమ కోసం సర్వం త్యాగం చేయాలనిపిస్తుంది.. ట్రాన్స్ జెండర్ లా మారడం కోసం నేను మూడుసార్లు చచ్చి బతికాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకి కూడా పెళ్లి చేసుకోవాలని, పిల్లల్ని కని ఫ్యామిలీని చూసుకోవాలని కోరిక ఉన్నప్పటికీ చిన్నప్పటినుంచి హార్మోన్స్ ఎఫెక్ట్స్ వల్ల ఇలా మారాల్సి వచ్చింది అంటూ తెలిపింది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×