E-Paper
Advertisement

Hyper Aadi: పెళ్లికి క్యాస్ట్ కావాలి కానీ.. అక్రమ సంబంధాలపై హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు!

Hyper Aadi: పెళ్లికి క్యాస్ట్ కావాలి కానీ.. అక్రమ సంబంధాలపై హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Hyper Aadhi: హైపర్ ఆది పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కమెడియన్ గా అందరికీ ఎంతో సుపరిచితమైన ఆది ప్రస్తుతం జబర్దస్త్ షో కి దూరంగా ఉంటున్నప్పటికీ ఇతర బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అదే విధంగా వరుస సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా కమెడియన్ గా కొనసాగుతున్న ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

కులమత బేధాలపై ఆది ఫైర్..

ముఖ్యంగా ఇటీవల కాలంలో చాలామంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడంతో పరువు హత్యలు జరుగుతున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలోనే కులాంతర వివాహాల గురించి పరువు హత్యలు గురించి హైపర్ ఆది మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ .. నాకు కుల భావన మీద చాలా విరక్తి ఉందని, మనుషులను ఇలా కులాల పేరుతో వేరు చేయటం వల్ల సమాజానికి కలిగే ప్రయోజనం ఏమాత్రం లేదని తెలిపారు. మనకు ఏదైనా ఆపద వస్తే మనకు కులం తోడుగా ఉండదు కేవలం మనిషి మాత్రమే అండగా ఉంటారని ఆది తెలియజేశారు. ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు హాస్పిటల్ కి వెళ్లిన తర్వాత మీ కులం ఏంటి అనే ప్రశ్న ఎవరు డాక్టర్ ను అడగరు కానీ పెళ్లి విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రతి ఒక్కరూ కులం గురించి ఆలోచిస్తారని తెలిపారు.

అక్రమ సంబంధాలకు కులం అవసరం లేదా?

Advertisement

పెళ్లి చేసుకోవడానికి ఓకే కులపు వ్యక్తులు కావాలి కానీ అక్రమ సంబంధాలకు మాత్రం అవసరం లేదా? ఎవరితోనైనా అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చా? అంటూ తనదైన శైలిలోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పరువు హత్యలు గురించి కూడా మాట్లాడుతూ .. కులాంతర వివాహం చేసుకున్నారన్న ఒక కారణంతో కన్నబిడ్డలను చంపటం దారుణమని ఇది మన పట్ల పరువును పెంచకపోగా మనుషుల మధ్య దూరాన్ని మాత్రం పెంచుతుందని తెలిపారు. ఇద్దరు మనుషులు జీవితాంతం కలిసి సంతోషంగా ఉండగలరనే నమ్మకం తల్లిదండ్రులకు ఉంటే వారికి అండగా నిలవడమే వారు చేయాల్సిన మొదటి పని అని తెలిపారు.

హింసను ప్రోత్సహించడమే..

Advertisement

ఒక అబ్బాయి లేదా అమ్మాయి ప్రేమించిన వారు ఆర్థికంగా స్థిరంగా లేకపోయినా వారికి కాస్త సమయం ఇవ్వాలని ఆర్థికంగా స్థిరపడిన తర్వాత పెళ్లి చేయటం సరైన మార్గం కానీ పరువు హత్యల పేరుతో హింసను ప్రోత్సహించకూడదు అంటూ ఆది ఈ సందర్భంగా కులమత భేదల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అది చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా విభిన్న రీతిలో కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. హైపర్ ఆది సినిమాలలో కమెడియన్ గా కామెడీలు చేసినా, జీవితం గురించి నిజాలు మాట్లాడారనీ ఆది వ్యాఖ్యలపై కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

Also Read: Bandla Ganesh: సుజిత్ కు కారు ఇచ్చిన పవన్… బండ్లన్న షాకింగ్ కామెంట్స్!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×