E-Paper
Advertisement

Ennenno Janmala Bandham : ‘ఎన్నెన్నో జన్మల బంధం ‘ వేద మళ్ళీ వచ్చేస్తుంది.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?

Ennenno Janmala Bandham : ‘ఎన్నెన్నో జన్మల బంధం ‘ వేద మళ్ళీ వచ్చేస్తుంది.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?
Advertisement

Ennenno Janmala Bandham : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. గతంలో వచ్చిన సీరియల్స్ తో పోలిస్తే ఈమధ్య డిఫరెంట్ స్టోరీలతో సీరియల్స్ రావడంతో జనాలు వీటిని చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఆ మధ్య వచ్చిన ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ జనాల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకోవడంతో భారీ విజయాన్ని సొంతం చేస్తుంది. ఆ సీరియల్ లో డాక్టర్ వేద అందరి మనసుని దోచుకుంది.. ఈమె మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తే బాగుంటుంది అని అనుకున్నారు.. అయితే ఇప్పుడు ఈ సీరియల్ మరోసారి ప్రసారమయ్యేందుకు సిద్ధంగా ఉంది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే నెట్టింట హాట్ టాపిక్ గా మారింది..

వేద మళ్ళీ వచ్చేస్తుందా..?

స్టార్ మా చానల్లో గతంలో ప్రసారమైన సీరియల్స్ మళ్లీ రీ టెలికాస్ట్అవుతుంటాయి అన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఎన్నో సీరియల్స్ మరోసారి బుల్లితెరపై కనిపించి అదే మ్యాజిక్ ని క్రియేట్ చేసుకున్నాయి. తాజాగా స్టార్ మా లో ప్రసారమైన సక్సెస్ఫుల్ సీరియల్ ఎన్నెన్నో జన్మల బంధం మరోసారి ప్రేక్షకులను పలకరించబోతుంది అంటూ ఓ వార్త ఇప్పుడు నెట్టింట ప్రచారంలో ఉంది.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది హీరోయిన్ డాక్టర్ వేద. అయితే వేదాన్ని మరోసారి స్క్రీన్ మీద చూడబోతున్నాము అని చాలామంది అభిమానులు సంతోషపడుతున్నారు. మరి త్వరలోనే ఈ సీరియల్ మళ్లీ ప్రారంభం కాబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలో నిజం ఎంత ఉంది అన్నది మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా కూడా వేద మరోసారి కనిపించడంతో జనాలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Advertisement

Also Read :Podarillu Today Episode : మహా పై కన్నా సీరియస్.. కన్నీళ్లు తెప్పించే సీన్.. శైలుకు సారీ చెప్పిన కేశవ..

‘ఎన్నెన్నో జన్మల బంధం’ స్టోరీ..

స్టార్ మా లో ప్రసారమైన సక్సెస్ఫుల్ సీరియల్స్ అలో ఎన్నెన్నో జన్మల బంధం ఒకటి. ఇందులో హీరోయిన్ గా బెంగాలీ ముద్దుగుమ్మ దెబ్జానీ మోదక్ నటించారు.. ఇక హీరోగా కన్నడ హీరో నిరంజన్ నటించారు. వీరిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ జనాలు అనే విపరీతంగా ఆకట్టుకుంది. బ్రాహ్మణ ఫ్యామిలీ అలాగే తమిళ ఫ్యామిలీలతో సంబంధం కుదరడం సీరియల్ కి హైలైట్ గా మారింది. ఒకరి కుటుంబం అంటే మరొకరికి పడకపోయినా సరే చివరికి కొడుకు కూతురు పెళ్లిళ్ల వల్ల ఇద్దరు కలిసిపోతారు. యష్ భార్య తన కూతుర్ని వదిలేసి వెళ్లిపోవడంతో తను తన భార్య మీద కోపాన్ని పెంచుకుంటాడు. కూతురి కోసమే వేదని పెళ్లి చేసుకుంటాడు.. ఇక వేద తన మంచితనంతో యష్ ని దగ్గర చేసుకుంటుంది. యష్ జీవితంలోకి మళ్లీ తన భార్య వచ్చి కూతురు కావాలి అంటూ డిమాండ్ చేస్తుంది.. ఆ తర్వాత యష్ వేద ఇద్దరు కలిసి తన భార్యకు బుద్ధొచ్చేలా చెప్తారు. మొత్తానికి వేద యష్ లు కలిసిపోతారు దాంతో సీరియల్ ఎండ్ అవుతుంది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ మరోసారి రాబోతుందని జనాలు వెయిట్ చేస్తున్నారు. ఈ సీరియల్ త్వరలోనే మళ్లీ ప్రసారం కానుందని తెలుస్తుంది దీనిపై స్టార్ మా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×