E-Paper
Advertisement

Intinti Ramayanam Trp Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. డిసెంబర్ నెల హైలెట్ ఎపిసోడ్స్…

Intinti Ramayanam Trp Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. డిసెంబర్ నెల హైలెట్ ఎపిసోడ్స్…
Advertisement

Intinti Ramayanam Trp Rating : బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటిలో ఎక్కువగా వినిపించేది సీరియల్స్. కాయకష్టం చేసుకుని ఇంటికి వచ్చిన జనాలు సీరియల్స్ చూసి కాస్త తమ అలసటను పోగొట్టుకుంటున్నారు. ఈమధ్య తెలుగు చానల్స్ ప్రసారం చేస్తున్న సీరియల్స్ జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. దాంతో సీరియల్ టిఆర్పి రేటింగ్ కూడా బాగా పెరుగుతుంది. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ఎన్నో సీరియల్స్ ప్రసారమవుతున్నాయి. అందులో కుటుంబ విలువలను తెలిపేలా కొన్ని సీరియల్స్ జనాలను బాగా కదిలిస్తున్నాయి. వాటిలో ఇంటింటి రామాయణం ఒకటి. ఒక ఉమ్మడి కుటుంబంలో జనాలు ఎలాంటి ప్రవర్తనతో ఉంటారు. ఆ ఇంటి పెద్ద ఇంటి వాళ్లకి ఎలా కంట్రోల్ చేస్తాడు అన్నది ఈ సీరియల్ స్టోరీ.. గత నెలలతో పోలిస్తే ఈనెల టిఆర్పి రేటింగ్ బాగా పెరిగినట్లు తెలుస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు ఈనెల హైలెట్ ఎపిసోడ్స్ ఏవో ఒకసారి చూసేద్దాం..

డిసెంబర్ హైలెట్ ఎపిసోడ్స్…

రాజేంద్రప్రసాద్ కుటుంబం చక్రధర్ వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.. ఆ కుటుంబం పై పగ తీర్చుకునేందుకు చక్రధర్ వాళ్ళ ఆస్తులను గౌరవ మర్యాదలను దూరం చేస్తాడు. మొదటినుంచి చక్రధర్ పై అనుమానం ఉన్న అవని అతని ఆస్తులు పోవడానికి కారణమని అనుకుంటుంది. ఇక ఆమె అనుమానం నిజమవుతుంది. తన భర్తను కాపాడిన తన తల్లిని తనతో పాటే ఉండమని వేడుకుంటుంది అవని. అవని తల్లి మీనాక్షి ఇంటికి రావడంతో చాలామంది సంతోషంగా ఉంటారు. కానీ పల్లవి మాత్రం మీనాక్షి తనని కొట్టిందని ఇంట్లోంచి పంపించాలని ఎన్నెన్నో ప్లాన్లు చేస్తుంది. చక్రధర్ మీనాక్షికి మొదటి భర్త కాబట్టి పల్లవి ఏం చేసినా సరే సపోర్ట్ చేయకపోవడంతో పాటుగా క్షమాపణలు కూడా చెప్పిస్తాడు. అవనికి చక్రధర్ తన తండ్రి అని తెలుస్తుంది. ఆస్తులు పోవడానికి కారణం చక్రధర్ అని తెలుసుకున్న అక్షయ్ ఆ విషయాన్ని ఇంట్లో చెప్తాడు. ఇక తన ఫ్రెండు అభి సాయంతో చక్రధర్ ఫ్రాడ్లని బయట పెడతాడు. అతని జైలుకు పంపిస్తాడు.

Advertisement

జైల్లో ఉన్న చక్రధర్ అవని తన కూతురన్న నిజాన్ని పల్లవికి చెప్తాడు.. పల్లవి తమ ఆస్తిని ఎలాగైనా సరే కాపాడుకోవాలని మీనాక్షిని బయటికి పంపించాలి లేదా పైకి పంపించాలని కట్టుకుంటుంది. పల్లవి ఎన్ని ప్లాన్ వేసినా చివరికి అది ప్లైల్ అవుతుంది. ఇక రాజేంద్రప్రసాద్ ఆస్తులు మళ్లీ తిరిగి రావడంతో శ్రేయ ఆస్తిని పంచాలని రచ్చ చేస్తుంది. వీళ్లకు కుటుంబ విలువలు కష్టమేంటో తెలియాలి అని రాజేంద్రప్రసాద్ తన సొంత ఊరికి తీసుకెళ్తాడు. అక్కడ ప్రెసిడెంట్ ఏకలింగం పరిచయమవుతాడు. రాజేంద్రప్రసాద్ ఆ ఊరి కోసం చేస్తున్న అన్ని పనులను స్వాధీనం చేసుకుంటాడు. తన లాభాలను పెంచుకునేందుకు ఆస్తులు కూడా పెట్టుకునేందుకు చూసుకుంటాడు. ఆ విషయం తెలుసుకున్న రాజేంద్రప్రసాద్ అతన్ని నిలదీస్తాడు అవని ఏకంగా అతని చెంప పగలగొడుతుంది. దాంతో అవనిపై కక్ష పెంచుకుంటాడు ఏకలింగం. ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్లో అవనీని చంపేందుకు పల్లవితో కలిసి ఏక లింగం ప్లాన్ చేస్తాడు. మరి రానున్న ఎపిసోడ్లో అవన్నీ చంపేస్తాడా లేదా పల్లవి చేసిన పనికి ఇంట్లోంచి బయటికి వెళ్తున్న అన్నది చూడాలి..

Also Read:నర్మదకు ప్రేమ దూరం.. రామరాజు మాటతో ప్రేమ కన్నీళ్లు.. నిజం చెప్పేసిన వేదవతి..

డిసెంబర్ టీఆర్పీ రేటింగ్..

Advertisement

గత నెలలతో పోలిస్తే ఈ నెల టిఆర్పి రేటింగ్ కాస్త మెరుగ్గా ఉందని ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్లను చూస్తే తెలుస్తుంది. ఎన్నో సస్పెన్స్ లతో స్టోరీ మలుపులు తిరుగుతుంది. దాంతో ఈ సీరియల్ రోజురోజుకీ ఆసక్తిగా మారుతుంది. జనాలను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ ఫ్యామిలీ డ్రామా స్టోరీ టిఆర్పి రేటింగ్ కూడా బాగానే ఉంది. నవంబర్ నెలతో పోలిస్తే ఈనెల ఇంకాస్త ఎక్కువగానే ఉందని తెలుస్తుంది. దీని టిఆర్పి రేటింగ్ 11.40గా ఉంది. ఇప్పుడు అవని చంపుతాడా లేదా అన్న ట్విస్ట్ సీరియల్ టిఆర్పి రేటింగ్ మరింత పెరిగే అవకాశం ఉంది.. మరి వచ్చే నెలలో ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్ ఏ మాత్రం పెరుగుతుందో చూడాలి..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×