E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: చక్రధర్ ను కలిసిన పల్లవి.. మైండ్ బ్లాక్ అయ్యే నిజం..శ్రీయ సాయం చేస్తుందా..?

Intinti Ramayanam Today Episode: చక్రధర్ ను కలిసిన పల్లవి.. మైండ్ బ్లాక్ అయ్యే నిజం..శ్రీయ సాయం చేస్తుందా..?
Advertisement

Intinti Ramayanam Today Episode November 27th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ కి అభి ఫోన్ చేసి అన్ని చేసింది చక్రధరని రుజువైంది.. మేము అతని అరెస్ట్ చేసేందుకు అతని ఇంటికి వెళ్తున్నాము అని అంటాడు. అక్షయ్ ఇంట్లోని వాళ్ళందరిని తీసుకొని అక్కడికి బయలుదేరుతారు.. చక్రధర్ ని అరెస్ట్ చేసేందుకు అభి అన్ని సిద్ధం చేస్తాడు.. నువ్వు ఇంకా తప్పించుకోవడం కుదరదు అని చక్రధర్ ని అరెస్ట్ చేస్తారు.. నువ్వు ఎన్ని మోసాలు చేసావో ఇప్పుడే తెలుస్తుంది ఈ ఇంట్లో ఏమేమి ఉన్నాయో వెతకండి అని అవి కానిస్టేబుల్ తో చెప్తారు. అంత వెతికి అవని ఇంటి డాక్యుమెంట్స్ ఆఫీస్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వస్తారు.. ఇవన్నీ చేసింది నువ్వా ఇవి ఇన్ని రోజులు నువ్వు మంచి వాడివి అని అనుకున్నామని ముగ్గురు చక్రధర్ ని కొట్టాలని అనుకుంటారు..అభి నేను చూసుకుంటాను అని అంటాడు.. చక్రధర్ అన్ని మోసాలకు పాల్పడ్డాడా అని రాజేంద్ర ప్రసాద్ కుటుంబం ఫీల్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి తన తండ్రిని అవని అరెస్ట్ చేయించిందని చాలా కోపంగా ఉంటుంది. ఇంట్లోనే వాళ్ళందరి మీద అంతకంత పగ తీర్చుకోవాలని అనుకుంటుంది. అప్పుడే వచ్చిన అవని మాత్రం మీ నాన్న ఏమైనా మంచివాడు అనుకున్నావా మంచి వాడిని అరెస్ట్ చేశారు కదా అని బాధపడ్డానికి.. ఒక దుర్మార్గుడు ఎంతో మంది కుటుంబాలను నాశనం చేశాడు. అలాంటి వాడిని అరెస్ట్ చేయడం కాదు చంపేసిన తప్పులేదు అని అంటుంది.. ఇకమీదటైనా నువ్వు బుద్ధిగా ఉండు లేదంటే మీ నాన్న దగ్గరికి నువ్వు కూడా వెళ్తావని వార్నింగ్ ఇస్తుంది.. మా నాన్న గురించి తప్పుగా మాట్లాడతావా మీ నాన్న ఎవరో తెలుసుకొని అతని అరెస్ట్ చేసేలా చేస్తాను అని పల్లవి అంటుంది.

Advertisement

ఉదయం లేవగానే పల్లవి తన తండ్రిని కలవడానికి పోలీస్ స్టేషన్కు వెళుతుంది.. అయితే పల్లవి తన తండ్రిని జైల్లో చూసి బాధపడుతూ ఉంటుంది.. డాడ్ మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. మీరు ఎలాంటి వారు ఇప్పుడు ఎలా ఉన్నారు అని పల్లవి అడుగుతుంది. ఇంత అయినా కూడా మీరు ఆ డాక్యుమెంట్స్ ని ఎందుకు మీ దగ్గర పెట్టుకున్నారు. ఆ డాక్యుమెంట్స్ లేకుండా అంటే నువ్వు దొరికే వాడివి కాదు కదా అని పల్లవి అంటుంది.. డాక్యుమెంట్స్ నా దగ్గర లేకున్నా సరే నన్ను అరెస్ట్ చేసే వాళ్ళు.. వడ్డీ వ్యాపారి వాడి మీదకు రాకుండా తెలివిగా తప్పించుకునేందుకు మనం మాట్లాడిందంతా.. మన ప్లాన్ గురించి అంత వీడియో తీసి రికార్డ్ చేసి పెట్టుకున్నాడు..

అయిన కూడా నేను బాధపడుతుంది నేను అరెస్టు అయినందుకు కాదు ఆ మీనాక్షి, అవని గురించి.. వాళ్ల గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు అని పల్లవి అడుగుతుంది. ఆ మీనాక్షి అవని ఎవరో కాదు. మీనాక్షి నా మొదటి భార్య ఈ విషయం మీ అమ్మకు కూడా తెలియదు అని చెప్పగానే పల్లవి షాక్ అవుతుంది.. ఏంటి డాడీ మీరు చెప్పేది ఏం మాట్లాడుతున్నారు అని పల్లవి అడుగుతుంది. ఆ మీనాక్షి మీద మోజుతోనే నేను మీనాక్షిని పెళ్లి చేసుకున్నాను.. తర్వాత డబ్బుల కోసం మీ అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను.. ఈ విషయం మీ అమ్మకు తెలియదు కానీ ఆ మీనాక్షికి మాత్రం నేను పెళ్లి చేసుకున్నానని తెలిసిపోయింది..

Advertisement

ఒకసారి నన్ను అడిగింది.. ఈ విషయం గురించి బయట పెట్టకున్నామంటే నీ పిల్లల పేరు మీద నేను ఆస్తి మొత్తం రాసిస్తానని అన్నాను. అలాగే తనకు ఆస్తి మొత్తాన్ని రాసి ఇచ్చాను అని చక్రధర్ అంటాడు.. ఆ మీనాక్షిని చంపేసి ఉంటే మనకు ఆస్తి మిగిలేది. నువ్వు ఎలాగైనా సరే ఆ మీనాక్షి దగ్గర నుంచి డాక్యుమెంట్స్ ని తీసేసుకో అప్పుడు అవి మన దగ్గర ఉంటే ఆస్తి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చక్రధరంటాడు. అయితే పల్లవి అక్కడి నుంచి ఇంటికి వస్తుంది. అవని వంటగదిలో ఉండడం చూసి ఇది నాకు అక్కనా అనే బాధపడుతూ ఉంటుంది..

Also Read :నగల దొంగ కోసం ప్లాన్.. నిజం తెలుసుకున్న బాలు.. ఫకీర్ గా బాలు..

పల్లవి అలాగే చూస్తూ ఉండడం చూసినా మీనాక్షి షాక్ అవుతుంది.. పల్లవి అవనిని ఏదైనా చేస్తుందేమో అని కంగారు పడుతూ ఉంటుంది.. అయితే పల్లవి ఎప్పుడు నేను చూడను చూసిన కమల్ ఏంటి అలా చూస్తున్నావు మింగేసే దానిలాగా అని అడుగుతాడు.. ఏం లేదు అని లోపలికి వెళ్ళిపోతుంది.. మీనాక్షి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది.. నిన్ను పల్లవి చూడడం నేను చూశానమ్మా నిన్ను ఏదైనా చేపిస్తుందేమో… నాన్న నేను అరెస్ట్ చేయించావు కదా నీ మీద పగతో రగిలిపోతున్నట్లు ఉంది నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని మీనాక్షి అంటుంది. ఎన్ని ప్లాన్ వేసినా తన మెడకే చుట్టుకొని అవి రివర్స్ అవుతున్నాయి అమ్మ నువ్వేం కంగారు పడకు అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×