E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: కమల్ దెబ్బకు పల్లవికి షాక్.. మీనాక్షికి కన్నీళ్లు..అవనికి గుడ్ న్యూస్..

Intinti Ramayanam Today Episode: కమల్ దెబ్బకు పల్లవికి షాక్.. మీనాక్షికి కన్నీళ్లు..అవనికి గుడ్ న్యూస్..
Advertisement

Intinti Ramayanam Today Episode November 22nd : నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి తన తండ్రిని కలిసి మా ఇంట్లో వాళ్ళు ఎలాగైనా సరే మీరే పని చేశారని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు వాడిని పట్టుకొని ఇక్కడ లేకుండా చేస్తేనే మన సేఫ్ అవుతాం డాడ్ అని పల్లవి అంటుంది. నేను అదే పనిలో ఉన్నాను అమ్మ పడు నాకు తెలియకుండా ఆ ఇంటిని అడ్రస్ ని మార్చేసాడు. వాడి ఫోన్ నెంబర్ కూడా పనిచేయట్లేదు. వాడి కోసం నా మనుషులు వెతుకుతున్నారు ఎక్కడ కనిపించిన సరే వాడిని ఇక్కడ లేకుండా చేసేస్తాను అని చక్రధర్ పల్లవి తో అంటాడు..వాడు గనక దొరికితే మనం కచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందే.. ఒకవేళ నేను దొరికిన సరే ఆ ఇంట్లో వాళ్ళందరినీ రోడ్డున పడేసి మరి జైలుకు వెళ్తాను అని చక్రధర్ అంటాడు.. పల్లవి ఇక తన ఇంటికి వచ్చేస్తుంది. ఆ వీధిలోని వాళ్ళు మా ఇంట్లో సౌభాగ్యవ్రతం చేసుకుంటున్నాము అని పిలవడానికి పార్వతి ఇంటికి వస్తారు. మేము మా ఇంట్లో సర్వైకల్ అని చేసుకుంటున్నాము మీరు తప్పకుండా రావాలి అని అడుగుతారు. అవని ప్రతి ఆడవాళ్లు కోరుకునేది తమ సౌభాగ్యం గురించే కదా మేము కచ్చితంగా వస్తాము అని అంటుంది.. పల్లవి మీనాక్షికి భర్త లేడు ఎలా సౌభాగ్య్రతానికి వస్తుంది అని అంటుంది. ఇక వాళ్లు కూడా ఆమెను అవమానించి ఎలా మాట్లాడుతారు. నీ చెంప పగలగొట్టినా నీకు ఇంకా బుద్ధి రాలేదా ఎవరు ముందు ఎలా మాట్లాడాలో అర్థం కాలేదా అని అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అవని, మీనాక్షి మాట్లాడుకుంటున్న విషయాన్ని అక్షయ్ వినలేదని అవని రిలాక్స్ ఉంది. అక్షయ్ అత్తయ్య గారు మీరు మీ వారి గురించి చెప్పకపోయినా పర్లేదు నేను మీకు ఎప్పుడూ సపోర్ట్ గానే ఉంటాను. ఆ దుర్మార్గుడు మిమ్మల్ని బాధ పెడుతున్నాడు అంటే చెప్పండి నేను వాడు అంతు చూస్తానని మీనాక్షికి ధైర్యం చెప్తాడు.. ఇక రాత్రి అవ్వగానే కమల్ బిర్యానీ తీసుకొని పల్లవి దగ్గరికి వస్తాడు. నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం బావ నాకు కూడా పెట్టవా అని పల్లవి అడుగుతుంది. కమల్ పల్లవికి ఊరించి మరీ మొత్తం తినేస్తాడు. అది చూసిన పల్లవి షాక్ అవుతుంది. ఏంటి బావ మొత్తం తినేసావు నాకు లేకుండా అని కమల్ ని పల్లవి అడుగుతుంది..

Advertisement

నేనేం మరీ అంత శాడిస్ట్ ని కాదు అందులో ఇంకొక పార్సల్ ఉంది నువ్వే తినేసేయ్ అని అంటాడు. అయితే పల్లవి ఆదాన్ని ఓపెన్ చేసి ఇది పెరుగన్నం బిర్యానీ కాదు అని అంటుంది.. అవును నేను ఒక బిర్యానీ ఒక పెరుగన్నం తెచ్చుకున్నాను. అయితే బిర్యానీ తినేసాను కడుపు నిండింది ఇంకా పెరుగన్న మిగిలిందిగా నువ్వు తినే అనేసి అంటాడు.. ఇలా చేస్తావని నేను అసలు ఊహించలేదు బావ అని పల్లవి నిరాశపడుతుంది. పల్లవి ఇక బయటికి రాగానే కాలుజారి కింద పడిపోతుంది.. అమ్మ అని అరవగానే మీనాక్షి పరిగెత్తుకుంటూ వెళ్లి పల్లవికి నూనె రాసి కొంచెం నొప్పి తగ్గించేస్తుంది..

మీనాక్షి ఎలా ఉందమ్మా అని పల్లవిని అడిగితే ఏంటి నేను నీ మొగుడు గురించి అడుగుతానని నన్ను ఐస్ చేస్తున్నావా? నీ ప్లాన్ బాగానే వర్కౌట్ అవుతుంది అని అంటుంది. ఆ మాట వినగానే అవని అక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావ్ ఇలాంటి వాళ్ళకి మంచి చేసిన చెడుగానే ఆలోచిస్తారు అని అంటుంది.. తర్వాత నువ్వు నా తండ్రి ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నావా అని అవని చెప్పబోతుంది కానీ మీనాక్షి మాత్రం అసలు నిజాన్ని బయట పెట్టకుండా ఆపేస్తుంది..

Advertisement

ఇక రాజేంద్ర ప్రసాద్ దిగులుగా కూర్చోవడంతో అక్కడికి వచ్చిన అక్షయ్ ఏమైంది నాన్న అలా ఉన్నారు అంటే సొంత వాళ్లే నాకు వెన్నుపోటు పొడిచారంటే నా గుండె రగిలిపోతుంది. మండుతుంది అని అంటాడు. అవని మీరు ఎటువంటివి ఆలోచించకుండా ఉండండి.. మీరు ముందు ఈ మాత్రలు వేసుకోండి అని అవని అంటుంది.. అప్పుడే అక్షయ్ ఫోన్ కి ఒక మెసేజ్ రావడం చూసి అక్షయ్ చాలా సంతోషపడతాడు.. నా ఫ్రెండు ఎస్ఐ గా ఈ ఊరికి బాధ్యతలు తీసుకొని వస్తున్నాడు మన సమస్యలు ఇక తీరిపోతాయి వాడు చాలా నిజాయితీగా ఉంటాడు అని అంటాడు.. అయితే వెళ్లి మనం వాన్ని కలుద్దాము మన సమస్యను చెబుదాము ఇక మన ఇల్లు ఆస్తులను పోగొట్టిన వాళ్ళు ఎవరో తెలుసుకుందామని అక్షయ్ అంటాడు..

Also Read:బయటపడ్డ మనోజ్ మోసం.. షాకైన బాలు.. ఇదేం ట్విస్ట్ రా బాబు..

ఆ మాట విన్న పల్లవి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్తుంది.. పల్లవి ఫోన్ మాట్లాడుతుంటే అవని విని పల్లవి చంప పగలగొడుతుంది.. నువ్వు మన ఆస్తులు మన ఇల్లు పోగొట్టడానికి కారణమైనవు కాబట్టి నీకు కచ్చితంగా శిక్ష పడుతుంది అని అవని వార్నింగ్ ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×