E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: రమ్య భర్తతో అక్షయ్ బిజినెస్.. రాజేశ్వరికి షాక్..పల్లవి సూసైడ్…

Intinti Ramayanam Today Episode: రమ్య భర్తతో అక్షయ్ బిజినెస్.. రాజేశ్వరికి షాక్..పల్లవి సూసైడ్…
Advertisement

Intinti Ramayanam Today Episode May 8th : అవని బయట ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళుతున్న తన ఫ్రెండ్ రమ్య అవనీని చూసి కారు ఆపి అవని దగ్గరికి వస్తుంది.. ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నావేంటి?అసలు నువ్వు ఏమైపోయావు అని ఇద్దరు ఒకరినొకరు పరామర్శించుకుని మాట్లాడుకుంటారు.. ఆ తర్వాత మీ మావయ్య అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కదా.. నువ్వేంటి ఇలా సింపుల్ గా మధ్య తరగతి వాళ్ళ లాగా ఉన్నావు అని రమ్య అడుగుతుంది.. ఒకప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా మారిపోయావు అని అవినీతో రమ్య మాట్లాడుతుంది.. కొన్ని అనుకొని సంఘటనలు జరిగాయి వాటి గురించి నేను ఫోన్ చేసి తీరిక చెప్తాను ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాను అని అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

అవనిని చూసి రాజేశ్వరి షాక్..

రాజేశ్వరి ఇంటికి చాలా కోపంగా వెళుతుంది అవని. బయట నుంచే అవని భరత్ అంటూ గట్టిగా కేకలు వేస్తూ అక్కడికి వస్తుంది. అది చూసిన రాజేశ్వరి అవని ఎందుకు ఇక్కడికి వచ్చిందా అని కంగారు పడిపోతూ బయటకు వచ్చేస్తుంది. అవని ఏంటి ఇక్కడ అరుస్తున్నావు అని రాజేశ్వరిని అడుగుతుంది. భరత్ ఇక్కడ ఉన్నాడు అంట కదా ఒకసారి పిలవండి నేను మాట్లాడాలి అని అంటుంది. కానీ రాజేశ్వరి ఇక్కడ మాట్లాడితే భరత్ కి నిజం తెలిసిపోతుంది అని పక్కకు తీసుకొని వెళుతుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు ఎందుకు అరుస్తున్నావు అని రాజేశ్వరి అడుగుతుంది. మీ కొడుకును మీ దగ్గరికి తీసుకురావడానికి మీరే ఇదంతా ప్లాన్ చేశారని నాకు అర్థం అయింది. ఎవరో కొడుకు లాగా తీసుకురావడం ఎందుకు మీ కొడుకుని నిజం చెప్పి తీసుకురావాలి కదా అని అనగానే రాజేశ్వరి షాక్ అవుతుంది.

నిజం అందరికి చెప్పేస్తాను…

Advertisement

భరత్ మీ కొడుకు అని, పల్లవి మా అమ్మ మీనాక్షికి పుట్టిన బిడ్డ అని ఇవాళ అందరికీ నిజం చెప్పేయాలి అని అవని అంటుంది.. ఇప్పుడు ఈ నిజం చెప్తే పల్లవి అస్సలు ఊరుకోదు అని రాజేశ్వరి అంటుంది.. ఈ నిజం ఇప్పటికి తెలియకపోతే అటు ఓ కన్నతల్లిని నేను బాధ పెట్టిన దాన్ని అవుతాను. మీ కొడుకు కూతురు మీ దగ్గరే ఉండాలి మా అమ్మ మాత్రం ఏడుస్తూ ఉండాలా..? నేను అస్సలు ఇది సహించను. మీరు ఆ ఇంటికి రండి మీ ముందరే అన్ని నిజాలను నేను అందరితో చెప్పేస్తాను అని అవని ఆవేశంగా వెళ్ళిపోతుంది. నిజంగానే అవని భరత్ తన కొడుకా అన్న నిజాన్ని చెప్తుందేమో అని రాజేశ్వరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది..

చక్రధర్ మాట వినని అవని..

అవని చక్రధర్ కి ఫోన్ చేస్తుంది. రాజేశ్వరి పిన్ని ఎంత చెప్పినా వినడం లేదు నాన్న. నేనైతే ఇవాళ ఈ నిజాన్ని బయట పెట్టాలని అనుకుంటున్నాను. ఆవిడకు నిజం బయట పెడితేనే మన మాట వింటుంది. పల్లవి కూడా ఎవరు అసలు అని తెలుసుకుంటుంది. నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. మీరు కూడా అమ్మని తీసుకుని ఇక్కడికి రండి అని అవని చెప్తుంది. ఇక మీనాక్షి భరత్ ఇంకా ఇంటికి రాలేదని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. భరత్ అవని వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడట మనల్ని అక్కడికి రమ్మని చెప్పింది అని చక్రధర్ అబద్ధం చెప్తాడు. ఇక మీనాక్షి భరత్ ని తీసుకురావాలి అని అవని వాళ్ళింటికి బయలుదేరుదాం పదండి అని అంటుంది.

మీనాక్షికి మైండ్ బ్లాక్..

Advertisement

ఇంటికి వచ్చిన అవని అత్తయ్య అమ్మమ్మ మీకు ఒక నిజం చెప్పాలి అందరూ రండి అని అడుగుతుంది. ఏంటి అవని ఎక్కడికి వెళ్లొచ్చావ్? ఏంటి అంత కోపంగా ఉన్నావ్ ఏంటి అని పార్వతి అడుగుతుంది.. పల్లవి వాళ్ళ తమ్ముడు ఇంటికి రానని అన్నాడు కదా అదే చెప్పడానికి అందర్నీ పిలిచిందేమో అని అనుకుంటుంది. ఈరోజు 30 ఏళ్ల క్రితం దాచిన నిజాన్ని బయటపెట్టబోతున్నాను అని అవని అంటుంది.. కాసేపు ఆగండి రాజేశ్వరి పిన్ని మా అమ్మ నాన్న కూడా రావాలి అని అంటుంది. ఏంటమ్మా అవని అర్జెంటుగా రమ్మని పిలిచావు అని మీనాక్షి చక్రధర్లు అడుగుతారు. ఇవాళ అందరికీ నిజం చెప్పబోతున్నాను నాన్న అందుకే రమ్మని చెప్పాను అని అవని అంటుంది.. ఇన్నాళ్లు మీరు అనుకుంటున్న నిజం నిజం కాదు. ఎందుకు అందని రమ్మన్నావు చెప్పు వదినా అని కమల్ అడుగుతాడు..

తట్టుకోలేకపోతున్న పల్లవి..

రాజేశ్వరి అత్తయ్య కూడా వచ్చింది ఆ నిజం ఏంటో చెప్పు వదినా అని అడుగుతాడు. అవని నిజం చెప్పబోతుంటే రాజేశ్వరి అడ్డుపడుతుంది. కానీ ఈరోజు ఎలాగైనా సరే నిజం చెప్పి తీరాలి అని అవని అసలు నిజానికి చెప్పడంతో మీనాక్షి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మీనాక్షి గురించి తెలుసుకున్న పల్లవి తట్టుకోలేక పోతుంది. భరత్ కి రాజేశ్వరి అసలైన తల్లి అని తెలుస్తుందా? లేదా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×