E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవనికి దిమ్మతిరిగే షాకిచ్చిన పల్లవి.. కొడుకు కోసం మీనాక్షి వెయిటింగ్.. నిజం చెప్పబోతున్న అవని..

Intinti Ramayanam Today Episode: అవనికి దిమ్మతిరిగే షాకిచ్చిన పల్లవి.. కొడుకు కోసం మీనాక్షి వెయిటింగ్.. నిజం చెప్పబోతున్న అవని..
Advertisement

Intinti Ramayanam Today Episode May 7th : ప్రణతి అత్తయ్య మా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎలాగైనా ఈ విషయాన్ని చెప్పాలి అని అనుకుంటుంది. ఫోన్ చేయగానే అమ్మ ప్రణతి నీకోసమే భరత్ వచ్చాడు నువ్వు కోపంలో ఏది అనకు వాడిని కూల్ చేసే ప్రయత్నం చేయను అని అంటుంది. ఇంటికి తిరిగి వస్తున్నారని దేవుడికి పూజ చేసి మొక్కుకున్నాను త్వరగా ఇంటికి రండి అమ్మ అని మీనాక్షి అనగానే ప్రణతి తనకు నిజం చెప్పకుండా దాచేస్తుంది.. నీ అవని వదిన కన్నా ఈ విషయం గురించి చెప్పాలి అని ప్రణతి అనుకుంటుంది. కానీ ఇప్పటికే వదిన చాలా బాధపడుతుంది ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇంకాస్త బాధపడుతుంది అని ప్రణతి ఎవరో ఒకరి ద్వారా వదినకు తెలిసిన తర్వాత చెబుదామని అనుకుంటుంది..

అవనికి నిజం చెప్పిన పల్లవి.. 

అవని వంట గదిలో వంట చేసుకుంటూ ఉండగా పల్లవి నీకు ఒక నిజం చెప్పాలి అక్క అని అంటుంది. ఏదో మంట పెట్టే విధంగా మాట్లాడడం ఎందుకు ఏం మాట్లాడాలనుకుంటున్నావో స్ట్రైట్ గా మాట్లాడు అని పల్లవితో అవని అంటుంది.. నీ తమ్ముడు ప్రణతిని తీసుకొని మీ ఇంటికి వెళ్లాడని నువ్వు అనుకుంటున్నావు కదా.. కానీ మా ఇంటికి వెళ్ళాడు అని పల్లవి చెప్పగానే ఒక్కసారిగా అవన్నీ షాక్ అవుతుంది. మీ అమ్మ మీద నీ మీద విరక్తి కలిగే మీ తమ్ముడు మా అమ్మ దగ్గరికి వెళ్ళాడు. కావాలంటే ఒకసారి ప్రణతికి కాల్ చేసి కన్ఫామ్ చేసుకొని పల్లవి అంటుంది. ప్రణతికి నిజమే అని చెప్పడంతో అవని షాక్ అవుతుంది. ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకో నువ్వు ఓడిపోతూనే ఉన్నావు అని పల్లవి అంటుంది..

మీనాక్షి దగ్గర నిజం దాచిన చక్రధర్.. 

Advertisement

మీనాక్షి భరత్ ప్రణతి వస్తున్నారని దిష్టి తీయడానికి పల్లెం పట్టుకొని బయట నిలబడి ఉంటుంది. గంట నుంచి బయట నిలబడి ఉన్నావు ఏం చేస్తున్నావ్ అసలు నువ్వు అని చక్రధర అడుగుతాడు. అది కాదండి ప్రంతిభారత్ లు ఎంత అన్యోన్యంగా ఉంటారో మనం చూస్తూనే ఉన్నాం కదా.. వాళ్లు ఇలా దూరం అవడానికి కారణం దిష్టి కూడా ఉంటుంది అందుకే దిష్టి తీయాలని నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఇంకా రాలేదు ఏంటి అని అనుకుంటుంది. ప్రణతి భరత్ ఇద్దరూ గొడవపడ్డారు కదా తనని బుజ్జగించడానికి ఈ రెస్టారెంట్ కూడా తీసుకొని వెళ్ళి ఉంటాడు.. వస్తారులే కానీ నువ్వు వెళ్లి నాకు మజ్జిగ తీసుకురా అని మీనాక్షికి నిజం చెప్పకుండా దాచేస్తాడు చక్రధర్..

భానుమతి ఎంట్రీ..

పార్వతి ఒక్కటే కూర్చుని శ్రీకర్ శ్రీయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది.. భానుమతి అప్పుడే రావడంతో ఏంటి అత్తయ్య సడన్గా వచ్చేసారు మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని పార్వతి అంటుంది. అది సరేగాని.. నువ్వేంటి ఒంటరిగా కూర్చుని ఏ దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావు అని భానుమతి అడుగుతుంది. శ్రియ చేసిన రచ్చ అంత ఇంత కాదు. వెళ్ళిపోయింది. అసలే వట్టి మనిషి కూడా కాదు మన అవసరం చాలా ఉంటుందని బాధపడుతున్నాను అని పార్వతి అంటుంది. భానుమతి రావడం చూసినా కమల్ మళ్లీ ఆడుకోవడం మొదలు పెడతాడు.

చక్రధర్ కు పల్లవి వార్నింగ్…

Advertisement

చక్రధర్ ను పల్లవి రమ్మయింది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. నేను రమ్మను గానీ నాకన్నా ముందుగా వచ్చి వెయిట్ చేస్తున్నావు. మమ్మల్ని వదిలేసి నువ్వు ఆ మీనాక్షి దగ్గరకు వెళ్లావు అని పల్లవి చక్రధాన్ని దారుణంగా తిడుతుంది. భరత్ ని ఇప్పుడు తన కన్నతల్లి నుంచి దూరం చేశారు. తనే ఎక్కువ అని రేపు తనే నా కన్న కొడుకు అని తనకి ఆస్తి చెందుతుంది అని మీ అమ్మ అంటుంది. అప్పుడు నువ్వు ఒప్పుకుంటావా అని చక్రధర్ పల్లవితో అంటాడు. మీనాక్షిని నీ కన్నతల్లిగా నువ్వు అనుకుంటావా అని అడగగానే ఆమె నా కన్నతల్లి అని అనుకోవడం కన్నా చావడమే మేలు అని పల్లవి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..

అవనిని కలిసిన రమ్య..

అవని బయట ఆట కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళుతున్న తన ఫ్రెండ్ రమ్య అవనీని చూసి కారు ఆపి అవని దగ్గరికి వస్తుంది.. ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నావేంటి అసలు నువ్వు ఏమైపోయావు అని ఇద్దరు ఒకరినొకరు పరామర్శించుకుని మాట్లాడుకుంటారు.. ఆ తర్వాత మీ మావయ్య అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కదా నువ్వేంటి ఇలా సింపుల్ గా మధ్య తరగతి వాళ్ళ లాగా ఉన్నావు అని రమ్య అడుగుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో అందరినీ ఇంటికి పిలిచిన అవని భరత్ గురించి నిజం చెబుతుందా లేదా అన్నది చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: డాక్టర్ కాళ్ళు పట్టుకున్న వల్లి.. భాగ్యం ఫ్యూజుల్ అవుట్.. భద్రకు దొరికిన ప్రేమ..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×