E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని కొట్టిన పల్లవి.. నిజం చెప్పేసిన చక్రధర్.. రాజేశ్వరి కండీషన్ సీరియస్..

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని కొట్టిన పల్లవి.. నిజం చెప్పేసిన చక్రధర్.. రాజేశ్వరి కండీషన్ సీరియస్..
Advertisement

Intinti Ramayanam Today Episode May 31st : బర్త్డే గర్ల్ఇంకా బయటికి రాలేదు ఏంటి అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు.. అయితే డ్రస్సు పాడైపోయింది కదా కొత్త డ్రెస్ లేదని ఏడుస్తూ ఉండిపోయింది ఏమో అని పల్లవి తనను తానే అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే సడన్గా అవని ఆరాధ్యను తీసుకుని రావడంతో అది చూసిన పల్లవి షాక్ అవుతుంది. ఆ డ్రెస్సు నేను పాడు చేశాను కదా మళ్లీ అడ్రస్ ఎలా వచ్చింది అని పల్లవి అనుకుంటూ ఉండగా అవని వచ్చి డ్రెస్ ను పాడు చేసింది నువ్వే కదా ఈ విషయం గురించి నేను బయట పెడితే కమల్ కొట్టి కొట్టి తరిమేస్తాడు అని అంటుంది.. ఇక గ్రాండ్ గా ఆరాధ్య బర్త్డే వేడుక మొదలవుతుంది..

ఆరాధ్య కేక్ కట్టింగ్ తో ఫుల్ హ్యాపీ..

ఇక అందరూ కలిసి ఆరాధ్య బర్త్డే వేడుకలు గ్రాండ్గా చేయాలని అనుకుంటారు.. కేక్ కటింగ్ చేసినప్పుడు చాలా సంతోషంగా అందరూ కేకు తినిపిస్తారు. అయితే అవని నాన్న మీరు రండి అని అనగానే మీనాక్షి నువ్వు కూడా రాని చక్రధర్ అంటాడు. ఆ మాట వినగానే మీనాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రాజేశ్వరిని పిలవకుండా చక్రధర్ మీనాక్షిని పిలవడంతో రాజేశ్వరి కూడా షాక్ అవుతుంది. ఇక చక్రధర్ మీనాక్షి ఇద్దరు కలిసి ఆరాధ్యులు ఆశీర్వదించి కేకు తినిపిస్తారు. అది చూసిన పల్లవి కోపంతో రగిలిపోతుంది.. తన తల్లి బాధపడుతుంది అని రాజేశ్వరిని చూసి ఇంకాస్త కోపంతో రగిలిపోవడంతో పాటుగా రెచ్చిపోతుంది.

మీనాక్షికి ఘోర అవమానం..

Advertisement

మీనాక్షి కేక తినిపిస్తూ ఉండగా పల్లవి వచ్చి కొంచమైనా సిగ్గు ఉందా నీకు అని చంప పగలగొడుతుంది. నీ మనవరాలు చేత అమ్మమ్మ అని పిలిపించుకున్నావు ఈ వయసులో నీకు మొగుడు కావాల్సి వచ్చాడా అని పల్లవి మీద క్షీణి దారుణంగా అవమానించేలా మాట్లాడుతుంది.. అయితే మీనాక్షి పల్లవి మాట్లాడుతుండగా బాధపడిపోతూ ఉంటుంది. 30 ఏళ్లుగా బతికి దూరంగా ఉన్నావు ఇప్పుడు మాత్రం మీకు భర్త గుర్తుకు వచ్చారా? ఉండలేకపోతున్నావా..? కొంచెం కూడా నీ భర్తని వదలలేకపోతున్నావా మామ్ కి భర్తని దూరం చేస్తావని దారుణంగా అందరూ షాక్ అయ్యేలా మాట్లాడుతుంది.. అంతేకాదు మీనాక్షిని కొట్టడంతో తను చాలా బాధ పడిపోతూ ఉంటుంది.

పల్లవి చెంపలు వాయించిన అవని..

నీ కన్న తల్లి లాంటి మనిషిని పట్టుకుని నువ్వు ఇంత దారుణంగా మాట్లాడతావా అని పల్లవిని అవని చంపలు వాయించేస్తుంది.. మా అమ్మని కొట్టడానికి అసలు నువ్వు ఎవరు? ఎంత ధైర్యం ఉంటే నువ్వు మా అమ్మని కొడతావని పల్లవి కి అవని దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇస్తుంది. కమల్ మంచి పని చేసింది వదిన. పల్లవికి ఇంకాస్త జరగాల్సిందే అని అనుకుంటుంది. ఇక పల్లవికి రాజేశ్వరి కన్న తల్లి కాదు అన్న నిజాన్ని చక్రధర్ బయట పెట్టేస్తాడు. ఆ మాట వినగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. ఈవిడ నా కన్నతల్లి పొరపాటున కూడా అలా మాట్లాడొద్దు ఈడ నాకు కన్నతల్లి అంటే నేను ప్రాణాలతో కూడా ఉండను అని పల్లవి అంటుంది. అతనికి బర్తడే పార్టీ కాస్త రణరంగంగా మారుతుంది.

మీనాక్షిని చంపబోయిన రాజేశ్వరి.. 

Advertisement

రాజేశ్వరి ఇంట్లో గొడవలు జరుగుతుండడానికి కారణం నువ్వే. నువ్వే బతికుంటే ఈ సమస్యలన్నీ ఇంకాస్త పెరిగిపోతాయి నిన్ను చంపేస్తాను అని రాజేశ్వరి మీనాక్షి గొంతు పట్టుకొని చంపబోతుంది.. ఎంతగా వదిలించుకోవాలని ప్రయత్నించిన సరి రాజేశ్వరి మాత్రం ఎలాగైనా సరే ఇవాళ మీనాక్షిని చంపి తీరాల్సిందే అని అనుకుంటుంది.. అయితే రాజేశ్వరి మీనాక్షిని చంపబోతున్నప్పుడు అవని వచ్చి పిన్ని ఏం చేస్తున్నారు మా అమ్మని చంపేస్తారా ఏంటి అని అడ్డుపడుతుంది.. మీ అమ్మని చంపితేనే నేను ప్రశాంతంగా ఉంటాను అని రాజేశ్వరి మీనాక్షి చంపబోతుంటే అవని రాజేశ్వరిని గట్టిగా తోసేస్తుంది. దాంతో మీనాక్షి వదిలేసిన రాజేశ్వరి అక్కడే ఉన్న ఒక రాయి మీద పడిపోతుంది.

పల్లవికి మైండ్ బ్లాక్..

రాజేశ్వరి కింద పడిపోవడం చూసిన పల్లవి ఒక్కసారిగా ఏమైంది నీకు అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. మా మమ్మీ చంపాలని చూస్తావా అని పల్లవి తన తల్లిని చూసి బాధ పడిపోతుంది. ఎందుకిలా చేసావ్ మా అమ్మ నీకు ఏమి అన్యాయం చేసిందని ఇలా చేస్తావని రాజేశ్వరి మీరు చూసిన పల్లవి అవనితో గొడవ పడుతుంది. అయితే ముందు పిన్నికి ఏమైందో అర్థం కావడం లేదు అని అవని కంగారు పడిపోతూ ఉంటుంది. పల్లవి బ్లడ్ కూడా వస్తుంది మామ్ ఏమైంది చనిపోయిందని ఏడుస్తూ ఉంటుంది.. ఈ అవని మీనాక్షి లే మా అమ్మని చంపడానికి ప్రయత్నించారు అని పల్లవి అంటుంది..

చావుబ్రతుకుల్లో రాజేశ్వరి..

రాజేశ్వరి పరిస్థితిని చూసిన ఇంటి సభ్యులు ఆమెను వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు అయితే తను ఎంత ప్రయత్నించినా సరే స్పృహలోకి రావడంతో రాజేశ్వర్ కి ఏమవుతుందని టెన్షన్ పడిపోతూ ఉంటారు.. రాజేశ్వరి ఈ పరిస్థితుల్లో ఉన్నాడని కారణం అవనీని మా మామకి ఏదైనా జరిగింది అంటే కచ్చితంగా మిమ్మల్ని ఎవరిని బతకనివ్వను అని పల్లవి సీరియస్గా అంటుంది. రాజేశ్వరి కండిషన్ మాత్రం సీరియస్ గా ఉన్నట్లు డాక్టర్లు చెప్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: భాగ్యంకు షాక్..ప్రసాద్ రావుకు అవమానం.. కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×