E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి ఫుల్ హ్యాపీ.. దొంగను పట్టుకున్న అవని.. ఇదేం ట్విస్ట్ స్వామీ..

Intinti Ramayanam Today Episode: పల్లవి ఫుల్ హ్యాపీ.. దొంగను పట్టుకున్న అవని.. ఇదేం ట్విస్ట్ స్వామీ..
Advertisement

Intinti Ramayanam Today Episode May 18th : ఉదయం లేవగానే అందరూ డబ్బుల్లేవని బాధపడిపోతూ కూర్చొని ఉంటారు.. ఆ ఫైనాన్షియర్రాగానే అందరూ బయటికి వెళ్తారు.. రాత్రి ఫోన్ చేసి డబ్బులు ఇస్తాను ఉదయం రండి అని చెప్పారు ఇప్పుడేంటి ఇంకా డబ్బులు ఇవ్వకుండా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు అని అతను అంటాడు.. డబ్బులు తెచ్చి పెట్టామండి కానీ ఇంట్లో దొంగలు పడి ఆ డబ్బులు నీ దోచుకుని వెళ్లారు అని చెప్పగానే అతను అవమానించేలా మాట్లాడుతాడు.. డబ్బులు కట్టే సమయానికి ఇలాంటి సాకులు చెప్పడం మాకు వినడం అలవాటయింది. మీరు ఇంకా డబ్బులు ఇవ్వలేదని నాకు అర్థం అయిపోయింది అందుకే మీ కన్స్ట్రక్షన్ ని సేల్ కి పెట్టాను అని అతను చెప్పేసి వెళ్ళగానే అందరూ ఒక్కసారిగా బాధపడిపోతూ ఉంటారు. సొంతంగా కాళ్ళ మీద నిలబడాలి అని నేను ఎన్నో కలలు కన్నాను కానీ అవి ఇలా మొదట్లోనే ఆవిరి అయిపోతాయని అస్సలు అనుకోలేదు అని అక్షయ్ బాధపడిపోతూ ఉంటాడు..

రాజేశ్వరికి గుడ్ న్యూస్..

పల్లవి చాలా సంతోషంగా తన తల్లి దగ్గరికి వెళుతుంది.. మనం వేసిన ప్లాన్ చాలా సక్సెస్ అయింది మామ్ డబ్బులు నిజంగానే దొంగ కొట్టేశారు అని ఇంట్లోని వాళ్ళందరూ చాలా బాధపడిపోతున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అని పల్లవి రాజేశ్వరితో చెబుతుంది. ఇంట్లో వాళ్ళందరూ ఇంత బాధపడడం నాకు పట్టరాని సంతోషంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.. అందుకే నీ దగ్గరికి వచ్చాను అని పల్లవి చాలా సంతోషంగా చెప్పగానే రాజేశ్వరి వాళ్ళు ఇంతకి ఎంత ఇంకా బాధపడాలి అని అంటుంది. ఇక ప్రణతిని కూడా మన వైపు తిప్పేసుకుంటే వాళ్లకు ఇంకాస్త టార్చర్ చేయొచ్చు అని పల్లవి అంటుంది. ఆ మాట వినగానే అప్పుడే పైనుంచి భరత్ ప్రనితులు రావడం చూసిన రాజేశ్వరి పల్లవిని మాట్లాడొద్దని చెప్తుంది.. వీళ్లు మన ఇంట్లో ఉన్నారన్న సంగతి నేను మర్చిపోయాను అని పల్లవి అంటుంది. ఇకపోతే అక్కడికి వచ్చి కొత్త డ్రామాలు మొదలు పెడుతుంది..

పల్లవి దొరుకుతుందా..?

Advertisement

పల్లవి స్నానం చేసి బయటకు వెళ్లి ఇంట్లోకి రాదని కమల్ ఎక్కడికి వెళ్లావు ఇంట్లో డబ్బులు పోయాయి అని అందరూ టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు మాత్రం హ్యాపీగా బయట తిరుగుతున్నావా అని అరుస్తాడు. డబ్బులు కనిపించాలి ఆ దొంగ దొరకాలి అని గుడికి వెళ్లొచ్చాను అని చెప్పగానే అందరూ కూడా మనం కూడా ఇక్కడున్న అమ్మవారి గుడికి వెళ్దాం అని అవని అంటుంది.. గుడికి వెళ్ళినంత మాత్రాన డబ్బులు తిరిగి వస్తాయని పల్లవి తనలో తానే మాట్లాడుకుంటుంది. ఇక వాళ్ళందరూ గుడికి వెళ్ళగానే పోలీసులు ఆ దొంగని తీసుకొని అవని వాళ్ళ ఇంటికి వస్తాడు. వాన్ని చూసినా పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మీ ఇంట్లో దొంగతనం చేసిన దొంగ ఇతనే అని పోలీసులు పల్లవిని అడుగుతారు.. మీ ఇంట్లో ఇంతకీ డబ్బులు పోయాయా లేదా అని పోలీసులు అడగనే పల్లవి పోయాయని చెప్తుంది.

దొంగగా పల్లవి..

అతను డబ్బులు కొట్టేసిన తర్వాత ఇంట్లోనే వాళ్ళు తరుముతుంటే మీ మంచం కింద పెట్టాను అని చెబుతున్నాడు. మీ మనసు కింద డబ్బులు ఉన్నాయో లేదో ఒకసారి వెళ్లి చెక్ చేయండి అని పల్లవి తో పోలీసులు అంటారు. కానీ పల్లవి మాత్రం మా ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరు సార్ గుడికి వెళ్లారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇల్లంతా వెతకండి అని అంటుంది. అయితే ఒకవేళ ఈ దొంగ చెప్పింది అబద్ధం అయితే వీడి వెనకాల ఎవరున్నారు కనుక్కొని వాళ్ళకి దొంగ అని బోర్డు వేసి ఊరంతా తరుముకుంటూ కొట్టుకుంటూ తీసుకుని వెళ్తాము అని చెప్పగానే పల్లవి తనకు తానే ఊహించుకొని కంగారు పడిపోతుంది. వాష్ రూమ్ వస్తుందని లోపలికి వెళ్లి వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది.

అవని ప్లాన్ లో ఇరుక్కున్న పల్లవి..

Advertisement

లోపలికి వెళ్ళిన పల్లవి రాజేశ్వర్ కి ఫోన్ చేసి ఆ దొంగ దొరికాడు. వాడు డబ్బులు నా మంచం కింద పెట్టాడు అని అన్నాడు నువ్వు అర్జెంటుగా డబ్బులు పంపించు మామ లేకపోతే నాతోపాటు నువ్వు కూడా ఇరుక్కుంటావు. ఇద్దరం కలిసి జైల్లో ఉండాలి అని పల్లవి రాజేశ్వరితో అనగానే రాజేశ్వరి భయపడి డబ్బులు పంపిస్తుంది. ఆ డబ్బులు నీ ఒక టవల్ లో చుట్టిన పల్లవి ఇంట్లో డబ్బులు దొరికాయి అని చెప్పాలని అనుకుంటుంది. ఆ పోలీసులు ఆ డ్రామా మొత్తం అవని ప్లాన్ అని పల్లవి అర్థం చేసుకోలేక పోతుంది.

హమ్మయ్య.. డబ్బులు దొరికేసాయి..

అవని వాళ్ళు గుడికి వెళ్లి తిరిగి వచ్చేలోగా బయట పోలీసులు కారు ఉండడంతో ఏమైంది అని అనుకుంటారు. లోపలికి వెళ్లి చూడగానే పోలీసులు దొంగను పట్టుకొని ఉంటారు. మీ ఇంట్లో డబ్బులు కొట్టేసిన దొంగ ఇతనే చెప్పగానే కమల్ అక్ష ఇద్దరు కూడా సీరియస్ అవుతారు. మీరు దొంగని కొడితే మేము మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పగానే వాళ్ళ ఆగుతారు. ఆ తర్వాత ఆ డబ్బులు నీ కమల్ చేతికి ఇస్తారు. డబ్బులు దొరికాయి ఆ ఫైనాన్షియర్ కు ఇవ్వాలి అని అవని చెప్పగానే అక్షయ్ అలానే అని అంటాడు. మొత్తానికి డబ్బులు దొరికేసాయి. ఇకపోతే పల్లవికి తన ప్లాన్ గురించి చెప్పి అవన్నీ దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ సుకన్య రియల్ లైఫ్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంత..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×