E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: రాజేశ్వరి చక్రధర్ ను క్షమిస్తుందా..? టెన్షన్ పడుతున్న పార్వతి.. పల్లవి నెక్స్ట్ ప్లాన్..?

Intinti Ramayanam Today Episode: రాజేశ్వరి చక్రధర్ ను క్షమిస్తుందా..? టెన్షన్ పడుతున్న పార్వతి.. పల్లవి నెక్స్ట్ ప్లాన్..?
Advertisement

Intinti Ramayanam Today Episode March 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. చక్రధరతో పల్లవి ఎంతగా మాట్లాడడానికి ప్రయత్నించినా సరే వినకుండా చక్రధర్ ఇంటికి వెళ్ళిపోతాడు.. అయితే చక్రధర్ వెనకాల ఇంటికి వెళ్లిన పల్లవి ఏం జరుగుతుందని చూస్తూ ఉంటుంది. రాజేశ్వరి తన భర్త ఇంకా ఇంటికి రాలేదు అని కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంటికి వచ్చిన చక్రధారిని చూసిన రాజేశ్వరి భయపడిపోతుంది. ఆ ఒంటి మీద దెబ్బలు ఏంటి అండి. మళ్లీ మిమ్మల్ని ఎవరైనా కొట్టారా?  మళ్ళీ ఏదైనా యాక్సిడెంట్ అయిందా అని కంగారు పడిపోతూ అడుగుతుంది.. మొన్ననే కదా యాక్సిడెంట్ అయింది మళ్ళీ ఎందుకు ఈ దెబ్బలు అని రాజేశ్వరి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయితే చక్రధర్ ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు. ఇంటికి వచ్చిన పల్లవి మాత్రం మామ్ అడుగుతుంది కదా.. డాడ్ అసలు నిజం ఏంటో చెప్పండి అని అంటుంది.. అయితే పల్లవి జరిగిన విషయాన్ని మొత్తాన్ని చెప్పేస్తుంది. ఏంటండీ మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను అని రాజేశ్వరి నిలదీస్తుంది.

ఎందుకు మిమ్మల్ని ఇన్ని రోజులు నమ్మినందుకు నాకు నిజం చెప్పలేదా? నన్నెందుకు మోసం చేశారు అని రాజేశ్వరి చక్రధరిని నిలదీస్తుంది. నేను అనుకోని పరిస్థితుల్లో అలా పెళ్లి చేసుకున్న అనే తప్ప వేరే ఉద్దేశం లేదు అని చక్రధర అంటున్న సరే రాజేశ్వరి మాత్రం ఆవేశంగా అతన్ని అసహ్యించుకుంటుంది.. ఆమె అందానికి ఆమెని వాడుకుందాం అనుకున్నారు. ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అంతేనా అని రాజేశ్వరి ఎమోషనల్ అయిపోతుంది. అంతే కాదు రాజేశ్వరి కళ్ళు తిరిగి పడిపోతుంది. రాజేశ్వరిని చక్రధర్ ముట్టుకో పోతుంటే పల్లవి మాత్రం మీరు మామ్ ని ముట్టుకోవద్దు అని గట్టిగా అరుస్తుంది.. ఇక రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయ్యే కళ్ళు తిరిగి పడిపోతుంది. పల్లవి తన తల్లికి ఏదో అయిందని టెన్షన్ పడిపోతూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. రాజేశ్వరి కోసం వచ్చిన డాక్టర్ ఆమెను పరీక్షించి పరిస్థితి కాస్త క్రిటికల్ గానే ఉంది అని చెప్పడంతో పల్లవి చక్రధర్ షాక్ అవుతారు. ఏమైంది డాక్టర్ మా మామ్ కి ఇప్పుడు ప్రమాదం ఏమీ లేదు కదా అని పల్లవి అడుగుతుంది. ప్రస్తుతమైతే ఎటువంటి ప్రమాదం లేదండి ఆమెకు ఏదైనా షాకింగ్ న్యూస్ విని ఇలా మారింది అని డాక్టర్ అడుగుతుంది. అవును డాక్టర్ మా మామ్ కి నమ్మలేని నిజం ఒకటి తెలిసింది. దానివల్లే ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది అని పల్లవి అంటుంది. ఆమె బిపి ఎక్కువైపోయి పడిపోయింది ఇంకొకసారి ఇలా ఎక్కువ అవ్వకుండా చూసుకోండి అని మందులు రాసిస్తుంది.. చూసావా డాడీ మీ వల్లే మామ్ కి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని పల్లవి బాధపడుతుంది.. మీరు ఆ నిజం చెప్పి అవని ఇంకా రెచ్చిపోయేలా చేసారు. ఇకమీదట అవనీని అవమానించే పరిస్థితి కనిపించలేదు. ఎందుకు డాడీ ఇలా చేశారు అని పల్లవి సీరియస్ అవుతుంది.

ఆ అవని పై రెవెన్యూ తీర్చుకున్నామని ఎన్నెన్నో కలలు కన్నాను. ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ ఏ ఒక్కటి కూడా అవన్నీ దెబ్బకొట్టేలా కనిపించలేదు. కానీ అ మీనాక్షిని అడ్డుపెట్టుకుని అవనిని ఒక ఆట ఆడుకుందాం అనుకున్నాను.. నువ్విలా నా ప్లాన్ ని దారుణంగా మోసపోయేలా చేస్తావని అస్సలు ఊహించలేదు అంటూ పల్లవి చక్రధరిని అడుగుతుంది. ఇక రాజేశ్వర్ కి స్పృహ వస్తుంది. అయితే చక్రధర ఎంతగా మాట్లాడడానికి ప్రయత్నించిన సరే ఆమె మాత్రం మాట్లాడకుండా అతని అసహ్యించుకుంటుంది.. మరి రాజేశ్వరి చక్రధరి ఎలాంటి పరిస్థితులలో తనను పెళ్లి చేసుకున్నాడో తెలిస్తే మళ్లీ చక్రధరిని భర్తగా ఒప్పుకుంటుందా లేక శాశ్వతంగా దూరమవుతుందా అన్నది ముందు ముందు ఎపిసోడ్ లలో మిస్ అవ్వకుండా చూడాలి..

Advertisement

Also Read : వీకెండ్ సినిమాల సందడి.. అన్నీ సూపర్ హిట్ చిత్రాలే…

పార్వతి మాత్రం అవనిని ఎన్ని మాటలు అన్నాను. అవని ఎలాంటిదో నాకు బాగా తెలుసు. అలాంటి అవనీని నేను ఎన్ని మాటలని ఇబ్బంది పెట్టాను అని పార్వతి బాధ పడిపోతూ ఉంటుంది. అసలు అవని ఇంతగా ఎందుకు అవమానించను నాకే అర్థం కావడం లేదు. కన్న తండ్రి అని తెలిసిన కూడా అవని చెప్పుకోకపోవడం నిజంగా ఆమె గొప్పతనం.. రాజేశ్వరి గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి రాజేశ్వరి కి నిజం తెలిస్తే తను బ్రతుకుతుందా లేదా అన్నది మాత్రం ఇప్పుడు భయంగా మారింది అని రాజేశ్వరి భయపడిపోతుంటుంది.. అసలు రాజేశ్వరికి విషయం తెలిస్తే ఎలా తట్టుకుంటుందో అర్థం కావడం లేదు అని పార్వతీపు బాధపడిపోతూ ఉంటుంది. అక్షయ్ కమల్ ఇద్దరూ కూడా అత్తయ్య అర్థం చేసుకుంటుంది అని ఓదారుస్తారు. అక్కడితో ప్రోమో పూర్తి అవుతుంది. ఇక సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×